Skip to content
బిజినెస్ వార్తలు

హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన థియోమ్‌.. GCC రంగంలో మరో బిగ్ బూస్ట్..

Prajapaksham 11 Jun 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన థియోమ్‌.. GCC రంగంలో మరో బిగ్ బూస్ట్..

New Global Capability Center Opens in Hyderabad, Boosting Tech & Innovation

కృత్రిమ మేధ (AI), డేటా సెక్యూరిటీ సేవల రంగంలో గుర్తింపు పొందిన ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ‘థియోమ్‌’ (Theom) భారతదేశంలో తన వ్యాపార కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించింది. ఇందులో భాగంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో తన సరికొత్త గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌ (GCC)ను బుధవారం నాడు ఘనంగా ప్రారంభించింది. కంపెనీ వ్యూహాత్మక వృద్ధిలో ,అంతర్జాతీయ వ్యాపార విస్తరణ ప్రణాళికల్లో హైదరాబాద్ జీసీసీ కేంద్రం ప్రారంభం కావడం ఒక కీలక మైలురాయి అని థియోమ్ కంపెనీ సీఈవో, కో-ఫౌండర్ నవీంద్ర యాదవ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉండటం వల్లే తమ గ్లోబల్ సెంటర్ ఏర్పాటుకు హైదరాబాద్‌ను అత్యంత అనువైన నగరంగా ఎంచుకున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. తమ వ్యాపార విస్తరణలో భాగంగా ప్రస్తుత త్రైమాసికం ముగిసేనాటికే ఈ హైదరాబాద్ కేంద్రంలో 50 మందికి పైగా నైపుణ్యం కలిగిన ఐటీ ఉద్యోగులను నియమించుకోనున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. క్లౌడ్ డేటా భద్రత ,ఏఐ సాంకేతికత ఆధారిత రక్షణ రంగంలో సేవలందిస్తున్న థియోమ్ రాకతో, హైదరాబాద్‌ గ్లోబల్ ఐటీ హబ్‌గా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నట్లయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *