Skip to content
ప్రపంచం › వార్తలు

Nuclear Attack on Iran: ఇరాన్‌పై అణుదాడి జరిగితే భారత్‌కు రేడియేషన్ ముప్పు ఉందా? నిపుణులు ఏమంటున్నారు..

jagan 04 Nov 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
Nuclear Attack on Iran: ఇరాన్‌పై అణుదాడి జరిగితే భారత్‌కు రేడియేషన్ ముప్పు ఉందా? నిపుణులు ఏమంటున్నారు..

Iran US War: అమెరికా-సౌదీ దాడిలో 20 మంది పీఎంఎఫ్ సభ్యులు మృతి

Nuclear Attack on Iran: ఇరాన్‌లోని అణు స్థావరాలపై అమెరికా సైనిక లేదా అణు దాడులు చేయవచ్చనే వార్తలు అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్‌లోని నటాంజ్ అణు ప్రాసెసింగ్ కేంద్రానికి సమీపంలో ఉన్న పిక్‌యాక్స్ పర్వతం (Pickaxe Mountain) పైన అణుదాడి జరిగే అవకాశాలు ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాలు, రక్షణ విశ్లేషణల్లో వస్తున్న కథనాలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. ఒకవేళ దాడి జరిగితే ఉత్పన్నమయ్యే రేడియోధార్మిక పదార్థాలు (Radioactive Fallout) గాలి దిశను బట్టి పాకిస్థాన్‌తో పాటు వాయవ్య భారతదేశ ప్రాంతాలకూ చేరుతాయనే వార్తలపై రక్షణ రంగ నిపుణులు స్పందించారు.

అమెరికా మాజీ ఫాక్స్ న్యూస్ వ్యాఖ్యాత టక్కర్ కార్ల్‌సన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు ఒత్తిడి మేరకు ట్రంప్ యంత్రాంగం ఇరాన్‌లోని పిక్‌యాక్స్ అణు సొరంగాల ప్రాంగణాన్ని అణ్వాయుధాలతో ధ్వంసం చేసేందుకు ఆలోచిస్తోందని ఆరోపించారు. పిక్‌యాక్స్ పర్వతం భూమికి 100 మీటర్ల కంటే ఎక్కువ లోతులో, దృఢమైన అగ్నిపర్వత రాతి పొరల కింద ఉంది. దీనిని సాధారణ బాంబులతో ధ్వంసం చేయడం కష్టమైనందున వ్యూహాత్మక అణుదాడి ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే, అణుదాడి జరపబోతున్నట్లు అమెరికా సైనిక వర్గాలు లేదా వైట్ హౌస్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

రక్షణ రంగ నిపుణుడు సందీప్ ఉన్నితన్ అందిస్తున్న విశ్లేషణ ప్రకారం.. ఇరాన్‌పై అణు పేలుడు జరిపితే దాని వల్ల వెలువడే రేడియోధార్మిక ధూళి (Fallout) పాకిస్థాన్ మీదుగా వాయవ్య భారతదేశానికి (పంజాబ్, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్, గుజరాత్ ప్రాంతాలు) విస్తరించే అవకాశం సిద్ధాంతపరంగా ఉంటుంది. కానీ, క్షేత్రస్థాయిలో అది అనేక పారామితులపై ఆధారపడి ఉంటుంది:

విస్ఫోటన తీవ్రత , ఎత్తు: పేలుడు రకం, వాడే బాంబు పవర్ (Explosive Yield) ను బట్టి ధూళి తీవ్రత ఆధారపడి ఉంటుంది.
వాతావరణ పరిస్థితులు: గాలి వేగం, దిశ , ఎగువ వాతావరణంలో వీచే గాలుల ప్రవాహంపై ప్రభావం ఆధారపడి ఉంటుంది.
దూరం వల్ల తీవ్రత తగ్గుదల: ఇరాన్ నుంచి భారతదేశ వాయవ్య సరిహద్దులు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ప్రయాణించే కొద్దీ గాలిలో రేడియోధార్మిక కణాల సాంద్రత (Dilution) విపరీతంగా తగ్గిపోతుందని, భారత భూభాగానికి చేరుకునే సరికి దాని ముప్పు నామమాత్రంగానే ఉండే అవకాశం ఉందని నిపుణులు తేల్చిచెప్పారు.

ఒకవేళ పిక్‌యాక్స్ పర్వతాన్ని లక్ష్యంగా చేసుకుని అణుదాడి జరిగితే, అది కేవలం భూభాగంపైనే కాకుండా పర్షియన్ గల్ఫ్ వ్యాపార మార్గాలు, పర్యావరణ వ్యవస్థ , గల్ఫ్ దేశాలపై తీవ్ర పరిణామాలను చూపే ప్రమాదం ఉంది. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం సైనిక చర్యపై ఎలాంటి తుది నిర్ణయం ప్రకారంగా తీసుకోనప్పటికీ, దౌత్య మార్గాల ద్వారానే ఈ ఉద్రిక్తతలు సద్దుమణగాలని అంతర్జాతీయ సమాజం అభిప్రాయపడుతోంది.