Skip to content
ప్రపంచం › వార్తలు

ఫ్రాన్స్‌ ఎన్నికలపై ప్రభావం చూపనున్న విద్యార్థి నిరసనలు

Prajapaksham 03 Nov 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
ఫ్రాన్స్‌ ఎన్నికలపై ప్రభావం చూపనున్న విద్యార్థి నిరసనలు

France Riots

డెన్నిస్ బ్రో యి

ఫ్రాన్స్‌లోని రెండవ అతిపెద్ద, అత్యంత వైవిధ్యభరిత నగరమైన సెయింట్‌ డెన్నిస్‌ను కేంద్రంగా చేసుకుని జరుగుతున్న పాఠశాల విద్యార్థుల నిరసన రోజురోజుకూ వేడెక్కుతుండడంతో పాటు, మొదట్లో నిందలు వేసిన పాశ్చాత్య కార్పొరేట్‌ మీడియా, కొన్నిసార్లు తమ వైఖరిని సరిదిద్దుకోవలసి వస్తోంది.
కొత్త బ్యారక్‌లలోకి దూసుకెళ్తున్న విద్యార్థుల బృందాలను, వారి పాఠశాలల చుట్టూ దిగ్బంధనాలను చిత్రీకరించడానికి బదులుగా, ‘ది న్యూయార్క్‌ టైమ్స్‌’ మొదట్లో ఈ సమీకరణకు చిహ్నంగా మండుతున్న చెత్తబుట్ట వీడియోను ఉత్సాహంగా ప్రచురించింది. తద్వారా నిరసన కారుల ను హింసాత్మక ఉగ్రవాదులుగా ఆపాదించిది.
సెకండరీ పాఠశాలల్లో మొదలైన ఈ నిరసనలు ఇప్పుడు విశ్వవిద్యాలయాలకు కూడా వ్యాపించాయి. ఇవి కేవలం విద్యార్థులనే కాకుండా, యూనియన్‌లు, ఉపాధ్యాయులను, వారి తల్లిదండ్రులు, తాతలు, నానమమ్మ, అమ్మమ్మలను కూడా చుట్టుముట్టాయి. వీరందరూ కేవలం నిరసనలకు మద్దతు ఇవ్వడానికే కాకుండా, అసలైన ఉగ్రవాదులైన ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ పోలీసుల నుంచి తమ పిల్లలను, మనమలను కాపాడుకోవడానికి కూడా ముందుకు వచ్చా రు.
విద్యార్థులు ఏమి కోరుకుంటున్నా రో, దేనికి ప్రతిస్పందిస్తున్నారో అనే విషయాలను అంతటా కనిపిస్తున్న బ్యానర్లు తెలియజేస్తున్నాయి. పదవీ విరమణ చేసిన లేదా ఒత్తిడిని తట్టుకోలేని ఉపాధ్యాయు ల స్థానంలో కొత్త ఉపాధ్యాయులు రాక పోవడంతో పాఠశాలలు కిటకిటలాడుతున్నా యి. ‘పని ఒత్తిడితో అలసిపోయిన కొంతమంది ఉపాధ్యాయుల స్థానం లో ‘మా అమ్మ వస్త్తోంది, కానీ మా అమ్మ స్థానంలో కి ఎవరు వస్తారు?’ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నిరసనకారులను అణచివేయడం ద్వారా కాకుండా, ఇతర మార్గాల ద్వారా నిధుల కొరత సమస్య పరిష్కారాన్ని చూడాలి. ‘ఫ్రిక్‌ నాన్‌ ఫ్లిక్‌’, అంటే పోలీసులకు కాదు, విద్యకు డబ్బు కావాలి. పారిస్‌, సెంట్రల్‌ సిటీల వెలుపల
ఉన్నవారికి నిధుల కొరత మరింత తీవ్రంగా ఉండటంతో, ఖర్చు చేసే నిధులలో అసమానతలు
కనపడుతున్నాయి.
అమెరికా సామాజిక, కార్పొరేట్‌ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్న చెత్తను తగలబెడుతున్న దృశ్యాలు& మాక్రాన్‌ తొమ్మిదేళ్ల పొదుపు బడ్జెట్‌ల తర్వాత నిధుల కొరత కారణంగా తమ భవిష్యత్తును నాశనం చేస్తూ, అదే సమయంలో అత్యంత ధనవంతులకు భారీ పన్ను రాయితీలు కల్పిస్తున్నందుకు విద్యార్థులు చేస్తున్న నిరసనకు ప్రధాన ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
వాస్తవ నిరసనలకు, వాటిని ప్రసారం చేస్తున్న తీరుకు మధ్య ఉన్న వ్యత్యాసం, అసలు ఫ్రెంచ్‌ విప్లవాన్ని బూర్జువా మీడియా ఎలా చూసిందో అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తుంది. దానిని ప్రజల విముక్తికి చేసిన తొలి ప్రయత్నంగా కాకుండా,
‘భయోత్పాతం’ అని పిలవబడిన దానిగా అది దిగజారిపోయినట్లుగా చిత్రీకరించారు. చార్లెస్‌ డికెన్స్‌ రచించిన ‘ఎ ఎ ఆఫ్‌ టూ సిటీస్‌’ నవలలో యువ మనసుల్లో బలంగా నాటుకుపోయిన ఈ చిహ్నాలు, నేటి బూర్జువా మీడియాలో మళ్ళీ వినిపిస్తున్నాయి. ఇక్కడ ఆస్తి, చివరికి చెత్తబుట్టలు కూడా పవిత్రమైనవిగా పరిగణించబడుతున్నాయి. మరోవైపు నిరసనకారులు, ఫ్రెంచ్‌ రచయిత ప్రౌధూన్‌ చెప్పిన ‘ఆస్తి దొంగతనం’ అనే మాటను పునరుద్ఘాటిస్తున్నారు.
నిజానికి, 1789 విప్లవానికి ఆరంభ స్థలమైన బాస్టిల్‌ వద్ద గత వారం అతిపెద్ద నిరసన జరిగింది. ఇందులో వేలాదిమంది విద్యార్థులు చౌరస్తాను ముట్టడించారు. విప్లవానికి జన్మస్థలమైన ఇక్కడే, విద్యార్థులు ‘లే మార్సెయిలీస్‌’ గీతాన్ని ఆలపించి ఈ వారసత్వాన్ని గుర్తించారు. పారిస్‌ వీధి తిరుగుబాటులో కలవడానికి కార్మిక మిలీషియాలు మార్సెయిల్‌ నుండి పారిస్‌కు కవాతు చేస్తున్నప్పుడు ఈ గీతాన్ని ఆశువుగా పాడారు.
ట్రంప్‌ ఈ నిరసనలను కమ్యూనిస్టు, ముస్లిం ప్రేరేపితమైనవిగా అభివర్ణించారు. ఈ రెండు శక్తులే అమెరికాను లోపలి నుంచే కూల్చివేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇది ఒక అద్భుతమైన, ఆశ్చర్యకరమైన చిత్రీకరణ. ఎందుకంటే అమెరికాను లోపలి నుంచి కూల్చివేయగల అసలైన శక్తి, అంటే నిజమైన పంచమాంగ దళం, ట్రంప్‌ కుటుంబం, ట్రంపిస్టులు
(ట్రంప్‌వాదులు).
ఆ వారంలో నిరసనలు ఒక అప్రతిహత ఉద్యమంగా మారడంతో ‘ది టైమ్స్‌’ వాటిని కొంత నిష్పక్షపాతంగా కవర్‌ చేసింది. కానీ వారి కవరేజీకి పైన, ఫ్రాన్స్‌ అధిక అప్పుల కారణంగా ఫ్రెంచ్‌ బాండ్ల ధర ల పెరుగుదలను వేగవంతం చేస్తున్నాయని, ప్రభుత్వానికి రుణాలు తీసుకోవడాన్ని మరింత కష్టతరం చేస్తున్నాయని తెలిపే మరో కథనాన్ని చేర్చింది. ప్రజలు ఏమన్నప్పటికీ, పొదుపు చర్యలు తప్ప మరో మార్గం లేదనేది ఆ కథనంలోని సారాంశం.
వచ్చే ఏప్రిల్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలలో నేతృత్వం వహించనున్న మారిన్‌ లూ పెన్‌ కొద్దిరోజుల క్రితం తన సొంత ప్రతిపాదిత బడ్జెట్‌ను ఆవిష్కరించారు. ఇది అత్యంత సంపన్న కార్పొరేషన్‌ల కు పూర్తిగా వరాలు ఇచ్చేలా ఉంది. ఎందుకంటే ఆమె ఫ్రెంచ్‌ ప్రభుత్వం నుంచి సుమారు $154 బిలియన్లు (116.4 బిలియన్‌ల పౌండ్లు) ఆ మొత్తాన్ని తగ్గించాలని ప్రతిపాదించారు.
ఫ్రాన్స్‌ సామాజిక సేవలను నిర్వహించడానికి అత్యంత సంపన్నులపై 2 శాతం పన్ను విధించాలని తరచుగా ముందుకు తీసుకువచ్చి, అంతే వేగంగా విరమించుకున్న ప్రత్యామ్నాయానికి ఇది విరుద్ధం.
నిరసనకారులలో అధికశాతం మంది సెకండరీ పాఠశాల విద్యార్థులే కావడంతో, తమ ప్రభుత్వం సంపదను పైకి బదిలీ చేయడం వల్ల తలెత్తిన అశాంతిని అణచివేయడానికి మాక్రాన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్ధిష్ట వ్యూహంపై వారు దృష్టిని సారించారు. ఆ వ్యూహం ఏమిటంటే, భీకరమైన పోలీసు హింస ను ప్రయోగించడం. పేలుడు ధాటికి ఒక 15 ఏళ్ల బాలుడి చేయి తెగిపోగా, 16 ఏళ్ల బాలుడు ఒక కన్ను కోల్పోయాడు. బహుశా ఎల్‌బిడి (లాన్సర్‌ డి బాల్స్‌ డి డిఫెన్స్‌) అనే అల్లర్ల నిరోధక గన్‌తో కొట్టినందుకే ఇలా జరిగి ఉండవచ్చు. 5,000 మందికి పైగా విద్యార్థులను అరెస్ట్‌ చేశారు. వీరిలో అధికశాతం సెకండరీ పాఠశాల విద్యార్థులే. చాలా మందిని నిర్బంధంలో ఉంచారు.
మాక్రాన్‌ మరో ‘ప్రభావవంతమైన ఆవిష్కరణ’ పట్ల కూడా విద్యార్థులు అసంతృప్తిగా ఉన్నారు. అది పార్కోర్సప్‌ అనే పేరుతో ఎలాన్‌ మస్క్‌ తరహా కంప్యూటర్‌ అప్లికేషన్‌ను ఏర్పాటు చేయడం. ఇది ఇప్పుడు విశ్వవిద్యాలయ దరఖాస్తులను నిర్వహి స్తూ, క్రమబద్ధీకరిస్తుందని భావిస్తున్నా రు.
విద్యార్థులను చేర్చుకునేందుకు అంగీకరించారా లేదా తిరస్కరించారా అనే విషయాన్ని వారికి తిరిగి తెలియజేయడంలో ఈ వ్యవస్థ నెమ్మదిగా వ్యవహరిస్తోంది. అంతేకాకుండా, అత్యంత సంపన్న, పలుకుబడి గల పాఠశాలల విద్యార్థులకు అనుకూలం గా వ్యవహరిస్తోందని కూడా దీనిపై ఆరోపణలు ఉన్నాయి.
ఈ వ్యవస్థలోని అపారదర్శకత వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది. ఫ్రాన్స్‌లోని ఒక విద్యార్థి జీవిత భవిష్యత్తును నిర్ణయించడంలో అత్యంత కీలకమైన ఈ ఎంపిక ప్రక్రియలో ఎలాంటి ప్రమాణాలను ఉపయోగిస్తారో ఎవరికీ తెలియదు.
ఈ నిరసనలు, అత్యంత ప్రజాదరణ పొందిన వామపక్ష పార్టీ అయిన లా ఫ్రాన్స్‌ ఎన్‌సూమీజ్‌ (ఎల్‌ఎఫ్‌ఐ) పై కూడా ఆరోపణలకు దారితీశాయి. ఆ పార్టీ, దాని నాయకు డు, అధ్యక్ష అభ్యర్థి అయిన జాన్‌లుక్‌ మెలాన్‌షోన్‌ ఈ తిరుగుబాటును ప్రేరేపించారని ఆరోపణలు వచ్చాయి. వచ్చే ఎన్నికల రెండవ రౌండ్‌లో పచ్చి మితవాద పక్షానికి చెందిన లూ పెన్‌, ఎల్‌ఎఫ్‌ఐకి చెందిన మెలాన్‌షోన్‌తో తలపడతారనే భయం తో, మధ్యేవాద, మితవాద పక్షాలలో ఈ ఆరోపణ విస్తృతంగా వ్యాపించింది. ఈ ఆరోపణను మెలాన్‌షోన్‌కు ఏ మాత్రం మిత్రుడు కాని మధ్యేవాద పత్రిక ‘లూ మాండ్‌’ కూడా ఖండించింది. దీని మూలాల పై రాసిన ఒక వ్యాసంలో, ఇది ఆకస్మికంగా జరిగిన తిరుగుబాటు అని ఆ పత్రిక పేర్కొంది. నిరసనకారులకు భద్రత కల్పించడంలోనే ఎల్‌ఎఫ్‌ఐ కీలక పాత్ర పోషించింది. వచ్చే ఏప్రిల్‌లో ఈ విద్యార్థులలో చాలామంది ఓటు వేసే వయస్సుకు చేరుకున్నప్పుడు, ఈ పార్టీ గణనీయంగా లబ్ధి పొందవచ్చు.

(సౌజన్యం : మార్నింగ్‌ స్టార్‌)