‘రంభ ఊర్వశి మేనక’ టైటిల్ సాంగ్ రిలీజ్
Ramba Oorvasi Menaka
అల్లరి నరేష్ ఫాంటసీ కామెడీ ‘రంభ ఊర్వశి మేనక’తో అలరించబోతున్నారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వంలో, అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు. సురభి, రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ టీజర్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఘనంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. సాంగ్ లాంచ్ ఈవెంట్లో హీరోయిన్ రాశి సింగ్ మాట్లాడుతూ ఇప్పుడు టైటిల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నాము. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ఇది చాలా డిఫరెంట్. థియేటర్లో ఈ సాంగ్ ఇంకా చాలా బాగుంటుంది.. అల్లరి నరేష్ తో నటించడం చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది.ఈ సినిమా కోసం ఆహార నియమాలు చాలా కఠినంగా పాటించాను. ఈ సినిమా షూటింగ్ కూడా మాకు చాలా ఛాలెంజింగ్‌గా అనిపించిందని అన్నారు. ప్రిశా సింగ్ మాట్లాడుతూ ఈ సాంగ్‌కి అందరూ డాన్స్ చేస్తారు. ప్రతి ఒక్కరికీ ఈ పాట నచ్చుతుంది. సెప్టెంబర్ 4న అందరూ ఈ సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో ఒక డిఫరెంట్ కాస్ట్యూమ్ వేసుకుని యాక్టింగ్ చేయడం చాలా కొత్త ఎక్స్పీరియన్స్. ఈ సినిమా నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను అన్నారు. విష్ణుప్రియ మాట్లాడుతూ థియేటర్లో ఈ పాట మీ అందరినీ సీట్లో నుంచి లేచి డాన్స్ చేసేలా చేస్తుంది.‘రంభ ఊర్వశి మేనక’ చుట్టూ తిరిగే కథ ఇది. ఇప్పటివరకు రంభ, ఊర్వశి, మేనకలను ఒక డాన్స్‌కి లేకపోతే ఒక సన్నివేశానికి రావడం చూశాము. కానీ ఈ కథ మాత్రం చుట్టూ రంభ, ఊర్వశి, మేనకల చుట్టూనే తిరుగుతుంది. ఇలాంటి సినిమా చేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పారు.
- CJP Protest Assault Case: జంతర్‌మంతర్ దాడి కేసులో కీలక పరిణామం.. స్వతంత్ర భరద్వాజ్ పోలీసుల అదుపులోకి..
- Konda Surekha Controversy: నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను, మారే ప్రసక్తే లేదు.. తేల్చి చెప్పిన కొండా సురేఖ..సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దని వినతి..
- Konda Surekha Controversy: కొండా సురేఖను పదవి నుంచి తొలగించడం బాధాకరమైన విషయమే.. స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్..
- One Last Kiss: ఎనిమిదేళ్ల బంధానికి భావోద్వేగ వీడ్కోలు.. చివరి ముద్దు ఇచ్చి కన్నీళ్లు పెట్టుకున్న బస్సు డ్రైవర్.. స్పందించిన కేరళ సీఎం..
- Tamil Nadu: మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడి యత్నం.. కామాంధుడిని తరిమి తరిమి కొట్టిన వీధి కుక్కలు.. వీడియో ఇదిగో..