US-Venezuela oil deal: వెనుజులా ఆయిల్ వ్యాపారంలోకి అమెరికా…మీకు మూరెడు…మాకు బారెడు : చమురు వ్యాపారంలో పెంటగాన్‌కు 35% వాటా..?
US-Venezuela oil deal: వెనుజులా ఆయిల్ వ్యాపారంలోకి అమెరికా...మీకు మూరెడు...మాకు బారెడు : చమురు వ్యాపారంలో పెంటగాన్‌కు 35% వాటా..?
US-Venezuela oil deal: వెనిజువెలాలోని 17 ప్రధాన చమురు క్షేత్రాలను అభివృద్ధి చేసే కాంట్రాక్టులను ‘నార్త్ అమెరికన్ బ్లూ ఎనర్జీ పార్టనర్స్’ దక్కించుకోనుంది. ప్రముఖ వ్యాపారవేత్త అలేజాండ్రో నేతృత్వంలో నడిచే ఈ సంస్థ, ఈ డీల్‌తో వెనిజువెలాలోనే రెండో అతిపెద్ద ప్రైవేటు ఇంధన కంపెనీగా ఎదగనుంది. ఈ కంపెనీలోనే అమెరికా రక్షణ శాఖ తన విభాగమైన ‘స్ట్రాటజిక్ క్యాపిటల్ ప్లాన్స్’ ద్వారా 35% ప్యాసివ్ ఈక్విటీని దక్కించుకోవడానికి ప్రణాళిక వేసింది.
US-Venezuela oil deal: వ్యాపార రంగంలో అమెరికా ప్రభుత్వం మరో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. రక్షణ వ్యవహారాలను మాత్రమే చూసుకునే పెంటగాన్ (US Department of Defense) ఇకపై నేరుగా ఇంధన వ్యాపారంలోకి దిగనుంది. వెనిజువెలా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న తరుణంలో, ఆ దేశ పునర్నిర్మాణానికి రూపుదిద్దుకున్న భారీ చమురు ఒప్పందంలో పెంటగాన్‌కు కీలక వాటా దక్కనుంది.
వెనిజువెలాలోని 17 ప్రధాన చమురు క్షేత్రాలను అభివృద్ధి చేసే కాంట్రాక్టులను ‘నార్త్ అమెరికన్ బ్లూ ఎనర్జీ పార్టనర్స్’ దక్కించుకోనుంది. ప్రముఖ వ్యాపారవేత్త అలేజాండ్రో నేతృత్వంలో నడిచే ఈ సంస్థ, ఈ డీల్‌తో వెనిజువెలాలోనే రెండో అతిపెద్ద ప్రైవేటు ఇంధన కంపెనీగా ఎదగనుంది. ఈ కంపెనీలోనే అమెరికా రక్షణ శాఖ తన విభాగమైన ‘స్ట్రాటజిక్ క్యాపిటల్ ప్లాన్స్’ ద్వారా 35% ప్యాసివ్ ఈక్విటీని దక్కించుకోవడానికి ప్రణాళిక వేసింది. పెన్నీ వారెంట్ల ద్వారా పొందే ఈ భాగస్వామ్యంతో, భవిష్యత్తులో అక్కడ ఉత్పత్తి అయ్యే చమురులో 20% వాటాను కేవలం ఉత్పత్తి వ్యయానికే (Cost Price) కొనుగోలు చేసే ప్రత్యేకాధికారం పెంటగాన్‌కు లభించనుంది.
ఈ భారీ భాగస్వామ్యంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. వెనిజువెలాలోని దాదాపు 65 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలపై నియంత్రణ సాధించేందుకు ఇది దోహదపడుతుందని, ఇది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఇంధన ఒప్పందమని ఆయన అభివర్ణించారు. సాధారణంగా ప్రైవేటు రంగంలో పెట్టుబడులు ప్రోత్సహించే పనులకే ప్రభుత్వ విభాగాలు పరిమితమవుతాయి. కానీ, రక్షణ శాఖ స్వయంగా ఓ బిజినెస్ నెట్‌వర్క్‌లో వాటాలు పొందడం రక్షణ రంగ చరిత్రలోనే అత్యంత అరుదైన పరిణామంగా నిలవనుంది.
మరోవైపు ఈ ఒప్పందంపై వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెರಿಕాతో కుదిరిన ఈ ఒప్పందం తమ దేశంలోని 17 కీలక చమురు క్షేత్రాల సమగ్ర అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని తెలిపారు. అంతేకాకుండా, దీని ద్వారా తమ దేశంలోకి దాదాపు 100 బిలియన్ డాలర్ల మేర ప్రైవేట్ పెట్టుబడులు ప్రవహిస్తాయని, తద్వారా పడిపోయిన తమ దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పునర్నిర్మించుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు.