Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

Gade Sai Krishna Case: గాదె సాయికృష్ణ మిస్టరీ లాకప్ డెత్ వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఎవరు ? జగ్గయ్యపేట భూ వివాదమే కారణమా ?

Prajapaksham 24 Jun 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
Gade Sai Krishna Case: గాదె సాయికృష్ణ మిస్టరీ లాకప్ డెత్ వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఎవరు ? జగ్గయ్యపేట భూ వివాదమే కారణమా ?

Ai Geneareted

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేస్ కొత్త మలుపులు తిరుగుతోంది ముఖ్యంగా రాజకీయంగాను అటు సామాజిక మాధ్యమాల్లో కూడా తీవ్ర దుమారం రేపుతోంది. గాదె సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ వ్యవహారం వెనుక బలమైన అదృశ్య శక్తులు ఉన్నాయా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా సాయికృష్ణ కస్టోడియల్ డెత్ వ్యవహారంపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. దీనిపై ప్రముఖ యూట్యూబర్ ప్రశ్న రావణ్ కస్టోడియల్ డెత్ వ్యవహారంలో ఒక కొత్త కోణాన్ని ముందుకు తెచ్చాడు.

జగ్గయ్యపేట భూ వివాదంతో బీజం..
రావణ్ చెబుతున్న వివరాలను బట్టి ఇప్పుడు అసలు కథ ఎక్కడ మొదలైందో ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. జగ్గయ్యపేటకు చెందిన ఒక ప్రముఖ రాజకీయ నేత, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కలిసి చేసిన ల్యాండ్ సెటిల్మెంట్ వ్యవహారంలో రౌడీషీటర్ గాదె సాయి కృష్ణ, నవీన్ రెడ్డి రంగ ప్రవేశించడంతో అసలు కథ మొదలైంది.

జగ్గయ్యపేటలో ఒక భూ సెటిల్మెంట్ పూర్తయిన తర్వాత తమకు ఇస్తామన్న డబ్బుల కోసం నవీన్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారిపై ఒత్తిడి తీసుకురావడంతో, నవీన్ రెడ్డిని వదిలించుకునేందుకు సాయి కృష్ణతో వారు చీకటి ఒప్పందం చేసుకున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆ పెద్దల మాటలు నమ్మి నవీన్ రెడ్డిని హత్య చేసిన కేసులో సాయి కృష్ణ ప్రైమ్ అక్యుస్డ్ గా అరెస్టు అయి జైలుకు సైతం వెళ్లాడు. అయితే బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత తనకు ఇస్తానన్న వాటా గురించి సాయికృష్ణ ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారిని వద్ద నిలదీయగా వారు మొహం చాటేశారు. దీంతో సాయి కృష్ణ తాను మోసపోయానని గ్రహించి పగతో రగిలిపోయాడు.

ఇంకేముంది తీవ్ర ఆగ్రహానికి గురైన సాయి కృష్ణ వెంటనే తనను మోసం చేసిన ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారికి బుద్ధి చెప్పేందుకు అతని భౌతికంగా తొలగించేందుకు జగ్గయ్యపేటలో రెక్కీ నిర్వహించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఆ రెక్కీ వార్త తెలుసుకున్న ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంటనే ఆ జగ్గయ్యపేటకు చెందిన ఆ ప్రముఖ నేత వద్దకు వెళ్లి సాయి కృష్ణ తనను చంపే అవకాశం ఉందని ఎలాగైనా కాపాడాలని ఈ సమస్య నుంచి గట్టెక్కాలని ప్రాధేయపడటంతో, ఆ స్థానిక నేత విజయవాడలో ఉన్న నేతలను కదిలించాడు. అక్కడి నుంచి సెటిల్మెంట్ వ్యవహారం పోలీసు పెద్దల వద్దకు చేరింది. ఇంకేముంది అక్కడే సాయి కృష్ణను అంతమొందించే ఒక ప్లాన్ పుట్టుకొచ్చిందని కథనాలు వినిపిస్తున్నాయి.

పోలీసుల ఎంట్రీతో అసలు వివాదం…
ఇక సాయి కృష్ణను పక్కకు తప్పించడానికి పక్కా సమాచారంతో మార్కాపురంలో ఉన్న సాయి కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అతడిని జీపులోనే పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు కూడా ఆధారాలు లభించాయి. పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చిన తర్వాత సాయికృష్ణ అదృశ్యం అవడం, ఆ తర్వాత కస్టోడియల్ డెత్ కు గురైనట్లు వార్తలు రావడం ఈ వ్యవహారంలో కొనసాగింపుగా చెప్పవచ్చు.

కింగ్ పిన్ సీఐ నాగరాజు…
అసలు ఈ మొత్తం కేసులో కింగ్ పిన్ ఎవరైనా ఉన్నారంటే అది సీఐ నాగరాజు అని ఈ కథనంలో తెలిపారు. అంతేకాదు సుమారు రూ. 200 కోట్ల ఆస్తులు ఏ నాగరాజు వెనకేశాడని కూడా ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు సిఐ నాగరాజు వెనుక పై స్థాయి అధికారుల ప్రమేయం కూడా ఉందని అనుమానాలు బలపడుతున్నాయి.

ఇదంతా ఒక ఎత్తైతే న్యాయస్థానంలో దాఖలైన హేబియస్ కార్పస్ పిటిషన్ నుంచి తప్పించుకునేందుకే ప్రభుత్వం సీఐ నాగరాజుపై కేసు పెట్టి, సిట్ (SIT) విచారణ పేరుతో వ్యూహాత్మక డ్రామా ఆడుతోందని సీపీఎం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గఫూర్ టీవీ డిబేట్ లో ఆరోపణలు చేశారు.

మరోవైపు సాయి కృష్ణ తల్లి న్యాయం కోసం కొడుకు కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న వైనం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కన్న కొడుకు శవం అయినా అప్పగించాలని ఆమె ప్రాధేయపడుతోంది. మరోవైపు పౌర హక్కుల నేతలు నేరస్తులను కోర్టు ద్వారా చట్టప్రకారం శిక్షించాలి తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని కస్టడీలో చంపే అధికారం పోలీసులకు ఎవరు ఇచ్చారని నిలదీస్తున్నారు. ఇక ఇందులో రాజకీయ కోణం విషయానికి వస్తే క్రిమినల్స్ కులం లేదు అని పవన్ కళ్యాణ్ చెబుతున్నా కానీ అదే పార్టీకి చెందిన తూర్పు నియోజకవర్గంతో ఒక రాజీ మార్గానికి రావాలని సెటిల్మెంట్ కు ప్రయత్నం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఒక చిన్న ల్యాండ్ సెటిల్మెంట్ తో మొదలైనటువంటి ఈ వ్యవహారం ఇప్పుడు ఒక పెద్ద వ్యవస్థ గత నేరానికి దారితీసింది. డబ్బుల పంపకాలతో మొదలైన వ్యవహారం అటు నవీన్ రెడ్డి, సాయి కృష్ణల ప్రాణాలు పోయేందుకు కారణం అయ్యింది. పోలీస్ వ్యవస్థ కస్టోడియల్ డెత్ వంటి ఆరోపణలు ఎదుర్కొనే స్థాయికి ఈ వ్యవహారం వెళ్లడం గమనార్హం. దీన్నిబట్టి రియల్ ఎస్టేట్ మాఫియాలో అటు వ్యాపారులు, రాజకీయ నేతలు, నేరస్తులు, పోలీసులు అంతా మిలాఖత్ అయి సాగిస్తున్న ఈ చీకటి సంబంధాలు బాహాటంగానే చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్న తీరు కళ్ళ ముందు కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *