Skip to content
ప్రపంచం వార్తలు

మాస్కోలో మూడవ అంతర్జాతీయ ఫాసిస్టు వ్యతిరేక ఫోరం పిలుపు

Prajapaksham 24 Jun 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
మాస్కోలో మూడవ అంతర్జాతీయ ఫాసిస్టు వ్యతిరేక ఫోరం పిలుపు

మాస్కోలో జరిగిన అంతర్జాతీయ ఫాసిస్టు వ్యతిరేక ఫోరం మూడవ మహాసభలో సిపిఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ రష్యన్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి గెన్నడీ జుగనోవ్

సామ్రాజ్యవాదం, యుద్ధం, టెర్రరిజంపై ఐక్యపోరాటం

– రామకృష్ణ పాండా, సీపీఐ కేంద్ర కార్యదర్శి

రష్యన్‌ ఫెడరేషన్‌ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మాస్కోలో నిర్వహించబడిన మూడవ అంతర్జాతీయ ఫాసిస్టు వ్యతిరేక ఫోరం ప్రపంచ నలుమూలల నుంచీ కమ్యూనిస్టులు, కార్మికవర్గ పార్టీలు, ప్రగతిశీల శక్తులను ఒక చోటకు చేర్చింది. పెరుగుతున్న యుద్ధాలను, సైనిక జోక్యాలను, ఆర్థిక సంక్షోభాలను, ప్రజాస్వామిక హక్కుల పై దాడులను, నయా పెరుగుదలను, అంతర్జాతీయ టెర్రరిజం నుంచి ప్రమాదాన్ని మానవజాతి ఎదుర్కొంటున్న తరుణంలో ఈ సమారోహం జరిగింది. “అంతర్జాతీయ టెర్రరిజం, నిరంకుశత్వం, దురాక్రమణకు వ్యతిరేకంగా, శాంతి, భద్రతల కోసం” అనేది చర్చనీయాంశం. ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, శాంతి దృక్కోణంతో కూడిన సంఘీభావం అనే సందేశాన్ని ఈ మహాసభ ప్రపంచ ప్రజలకు ఇచ్చింది. ఫాసిజం, యుద్ధోన్మాదం, సామ్రాజ్యవాద దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాటాన్ని జాతీయ సరిహద్దులలో మాత్రమే సాగించలేమన్న చారిత్రక అవగాహన నుంచి ఈ ఫోరం ఆవిర్భావం పొందింది.

అంతర్జాతీయ ఫాసిస్టు వ్యతిరేక ఫోరం మొదటి, రెండవ సభలు ప్రపంచవ్యాప్తంగా వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల మధ్య ఐక్యత కొనసాగింపునకు, ఆ క్రమం విస్తరణకు ప్రాతినిధ్యం వహించింది. పెరుగుతున్న అభివృద్ధినిరోధక, సామ్రాజ్యవాద, నయాఫాసిస్టు ధోరణులకు ప్రతిస్పందనగా ప్రపంచస్థాయిలో ఉమ్మడి రాజకీయ స్పందనను అభివృద్ధి చేయటాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.

శక్తిమంతమైన సామ్రాజ్యవాద దేశాలు సర్వసత్తాక రాజ్యాలపై ప్రత్యక్షయుద్ధాలు, సైనిక కూటములు, ఆర్థిక ఆంక్షలు, రాజకీయ జోక్యాల ద్వారా, ఇంకా “మానవతావాద”, “ప్రజాస్వామ్యయుత” కార్యకలాపాల పేరుతో దాడులు చేస్తుండగా, ఈ ఫోరం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక ప్రగతిశీల రాజకీయ దృష్టి నుంచి చూచినపుడు, అంతర్జాతీయ టెర్రరిజం ప్రభుత్వయేతర వ్యక్తులు లేక సమూహాలు సాగించే హింసకు పరిమితం కాలేదు. ప్రభుత్వం అండతో సాగే దురాక్రమణ, ఆక్రమణలు, సామూహికంగా శిక్షించటం, ఆర్థిక దిగ్బంధనాలు, రాజకీయ అస్థిరత సృష్టించే విధానాలు కూడా టెర్రరిజం రూపాలే. వాటి నుంచి కూడా ప్రజలకు ప్రమాదం పెరుగుతున్నది. ఈ సందర్భంలోనే ఈ మహాసభ యుద్ధం, సామ్రాజ్యవాదం, నయావలసవాదం, ఫాసిస్టు రాజకీయాలకు వ్యతిరేకంగా విశాలమైన ప్రపంచవ్యాప్త ప్రతిఘటన ఆవశ్యకతను వక్కాణించింది.

108 దేశాల నుంచి 180 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. చైనా ప్రజారిపబ్లిక్‌, డిపిఆర్‌ కొరియా, వియత్నాం, లావోస్‌, క్యూబా వంటి సోషలిస్టు దేశాల నుంచి, అమెరికా సామ్రాజ్యవాదం ప్రోత్సాహంతో అనేకరకాల ఒత్తిళ్లు, జోక్యాలు చవిచూస్తున్న పాలస్తీనా, ఇరాన్‌, లెబనాన్‌, వెనిజులా ల నుంచి కూడా ప్రతినిధులు పాల్గొన్నారు. భారతదేశం నుంచి సిపిఐ ప్రతినిధివర్గం (ప్రధానకార్యదర్శి డి.రాజా, జాతీయ కార్యదర్శి, అంతర్జాతీయ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ రామకృష్ణ పాండా) పాల్గొన్నది. రాజా తొలి సమావేశంలో “21వ శతాబ్దంలో సామ్రాజ్యవాదం, అంతర్జాతీయ టెర్రరిజం : కారణాలు, గమ్యాలు, పద్ధతులు” అనే అంశాలపై ప్రసంగించారు. రెండవ సమావేశంలో రామకృష్ణ పాండా, “అంతర్జాతీయ టెర్రరిజం, దాని వ్యక్తీకరణలకు వ్యతిరేకంగా పోరాటంలో సంఘీభావం : వామపక్ష, ప్రగతిశీల శక్తుల పాత్ర” అనే అంశంపై ప్రసంగించారు.

రాజా తమ ప్రసంగంలో ఇలా చెప్పారు : “ఇది ప్రపంచ చరిత్రలో అత్యంత ముఖ్యమైన క్షణం. మానవాళి అనేక సంక్షోభాలు ఎదుర్కొంటున్నది యుద్ధం, ఆర్థిక అస్థిరత, వాతావరణంలో వినాశకర మార్పులు, పెరుగుతున్న అసమానతలు, నయాఫాసిస్టు, అతిజాతీయవాద శక్తులు ప్రమాదకరంగా పెరుగుదల వాటిలో ఉన్నాయి. ప్రపంచం పెట్టుబడిదారీ విధానంలో తీవ్రమవుతున్న సంక్షోభం, ఆధునిక సామ్రాజ్యవాదం దుందుడుకు స్వభావం ఈ సంక్షోభాల వెనుక ఉంది. 21వ శతాబ్దంలో సామ్రాజ్యవాదం, అంతర్జాతీయ టెర్రరిజం గూర్చి మనం చర్చించేటపుడు అది అకడమిక్‌ చర్చ కాదు. అది శాంతి, ప్రజాస్వామ్యం, సార్వభౌమత్వం, మానవ నాగరికత భవిష్యత్‌కు సంబంధించిన సమస్య.

సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ విధానం అత్యున్నత దశ అని, గుత్త పెట్టుబడిదారుల, ద్రవ్య పెట్టుబడి, సైనిక ఆధిపత్యం, ప్రపంచాన్ని విభజించుకునేందుకు పోరాటం దాని లక్షణమని లెనిన్‌ చెప్పారు. 21వ శతాబ్దంలో సామ్రాజ్యవాదం సైనిక కూటములు, బహుళజాతి కార్పొరేషన్‌లు, ద్రవ్య సంస్థలు, ఆంక్షల విధింపు, సమాచార యుద్ధతంత్రం, సర్వసత్తాక దేశాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా జోక్యం చేసుకోవటం ద్వారా పనిచేయటం కొనసాగిస్తున్నది. అందువల్ల యుద్ధం, ఆక్రమణలు, దారిద్య్రం, మతోద్రేకాలు రెచ్చగొట్టటం, విదేశీ జోక్యంతో కూడిన ప్రస్తుత పరిస్థితుల నుంచి అంతర్జాతీయ టెర్రరిజాన్ని వేరు చేసి అవగాహన చేసుకోలేము.

21వ శతాబ్దంలో సామ్రాజ్యవాదం లక్ష్యాల్లో ప్రాథమికంగా ఎటువంటి మార్పులేదు. ప్రపంచంపై ఆధిపత్యం దాని ప్రధాన ధ్యేయం. అది అనుసరిస్తున్న పద్ధతుల్లో మార్పులు వస్తున్నాయి. నయా వలసవాద పద్ధతుల స్థానంలో చాలా వరకు వలసవాద ప్రత్యక్ష ఆక్రమణ చేరింది. ప్రభుత్వాలను మార్చటం, మీడియాను వశం చేసుకోవటం, సైబర్‌ యుద్ధ తంత్రాలు, రాజకీయ అస్థిరత సృష్టించటం, బయటనుంచి ‘రంగుతో అభివర్ణిస్తున్న విప్లవాలను’ ప్రోత్సహించటం వాటిలో ఉన్నాయి. అదే సమయంలో భౌగోళిక రాజకీయ సంఘర్షణ లోపల టెర్రరిజాన్ని కూడా ఉపయోగిస్తున్నారు.

సామ్రాజ్యవాదం, టెర్రరిజం ప్రమాదకరంగా కలిసిపోవటాన్ని పశ్చిమాసియాలో చూడవచ్చు. సమకాలీన సామ్రాజ్యవాదం సైనికం, ఆర్థికం మాత్రమే కాదు. భావజాల సంబంధం కూడా. కార్పొరేట్‌ల నియంత్రణలోని మీడియా, డిజిటల్‌ ప్రచార వ్యవస్థలు యుద్ధాలను సమర్థించే ప్రయత్నం చేస్తున్నాయి. స్వతంత్ర రాజ్యాలను భూతంగా చిత్రిస్తున్నాయి. కమ్యూనిజం వ్యతిరేకతను ప్రచారం చేస్తున్నాయి. ప్రజలను మతం, జాతి, ఉపజాతి ప్రాతిపదికపై విభజిస్తున్నాయి.

శాంతి, జాతీయ సార్వభౌమత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం, సోషలిజం కోసం ప్రపంచంలోని ప్రగతిశీల శక్తులన్నీ ఐక్యంకావాలని రాజా పిలుపు ఇచ్చారు. సోషలిస్టు శక్తులు, సోవియట్‌ ప్రజల వీరోచిత పోరాటం, త్యాగాల వల్లనే ఆనాడు ఫాసిజం ఓడించబడింది. అదే మాస్కోగడ్డ నుంచి మరో శక్తిమంతమైన సందేశం వెళ్లాలి:

“-మేము యుద్ధానికి వ్యతిరేకం-, శాంతి కోసం నిలబడతాం.

  • మేము జోక్యోలకు వ్యతిరేకంగా సార్వభౌమత్వాన్ని బలపరుస్తాం.
    మేము ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యంకోసం నిలబడతాం.
    మేము దోపిడీకి వ్యతిరేకంగా సోషలిజం కోసం నిలబడతాం.”
    మేము సామ్రాజ్యవాదం, టెర్రరిజంకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సంఘీభావం కోసం నిలబడతాం”.

రామకృష్ణ పాండా తమ ప్రసంగంలో అంతర్జాతీయ టెర్రరిజానికి వ్యతిరేకంగా జరిపే పోరాటాన్ని శాంతి, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, జాతీయ సార్వభౌమాధికారం, సామాజిక న్యాయం కోసం జరిపే విస్తృత పోరాటం నుంచి వేరుచేయ వీలులేదని వక్కాణించారు. పశ్చిమాసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా ప్రజలు, ‘భద్రత’, ‘ప్రజాస్వామ్యం’ పేరుతో సామ్రాజ్యవాదం సాగించిన జోక్యాలకు భారీమూల్యం చెల్లించారని గుర్తుచేశారు. ఇరాక్‌, లిబియాలపై దండయాత్రలు రాజ్యవ్యవస్థలను ధ్వంసంచేసి అస్థిరత, తీవ్రవాదానికి అనువైన పరిస్థితులు సృష్టించాయన్నారు. సిరియాలో దీర్ఘకాలంపాటు ప్రాక్సీ యుద్ధాలు వినాశం కలుగజేశాయన్నారు. పాలస్తీనా భూభాగాల ఆక్రమణ, గాజాపై పదేపదే దాడులు, సమష్టిగా శిక్ష, వేలాది మంది అమాయకుల హత్యలు ఇవన్నీ సమకాలీన ప్రపంచంలో రాజ్య టెర్రరిజానికి స్పష్టమైన ఉదాహరణలని అన్నారు.

వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల పాత్రను వక్కాణిస్తూ ఐదు ప్రధాన కర్తవ్యాలను ఆయన ప్రతిపాదించారు : అంతర్జాతీయ సంఘీభావం పటిష్టం చేయటం; సెక్యులరిజం, ప్రజాస్వామ్యాలకు సమర్థన; టెర్రరిజానికి గల సామాజిక – ఆర్థిక కారణాలను బహిర్గతం చేయటం; యుద్ధం, సైనికీకరణకు వ్యతిరేకంగా ప్రజాపోరాటాలను ముమ్మరం చేయటం; పాలస్తీనా, వెనిజులా, క్యూబా, ఇతర సర్వసత్తాక రాజ్యాలతో సంఘీభావం పటిష్టం చేయటం.

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ రష్యన్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి గెన్నడీ జ్యుగానోవ్‌ ఈ మహాసభలో ప్రారంభోపన్యాసం చేశారు. వామపక్ష శక్తుల పోరాటాన్ని సామ్రాజ్యవాదానికి, రాజ్యటెర్రరిజానికి, సైనిక దురాక్రమణకు, నయా వలసవాదానికీ, నయాఫాసిజానికీ వ్యతిరేకంగా జరిగే పోరాటాలనుంచి వేరు చేయలేమన్నారు. ప్రపంచ పెట్టుబడిదారీ విధానం తన లక్ష్యాలను “భౌతికంగా బలప్రయోగం, ఆలోచనను ప్రభావితం చేయటం” ద్వారా ముందుకు తీసుకెళుతున్నదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల శక్తులు ఈ ధోరణులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు. ఈ ఫోరం ప్రపంచ తిరోగమన శక్తులకు వ్యతిరేకంగా పోరాటంలో మరో చర్య అన్నారు.

జర్మన్‌ డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ (జిడిఆర్‌) చివరి నాయుడు ఇగోన్‌ క్రెంజ్‌ ఈ మహాసభలో ప్రసంగించారు. రాజకీయంగా ఆయన కృషి, ఫాసిస్టు వ్యతిరేక వారసత్వంతో ఆయన సంబంధాన్ని గుర్తిస్తూ ప్రతిష్టాత్మకమైన లెనిన్‌ బహుమతితో ఆయన్ను సత్కరించారు. పలువురు కమ్యూనిస్టు, వర్కర్స్‌, ప్రగతిశీల శక్తుల నాయకులు కూడా ప్రసంగించారు.

ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో, శాంతి, ప్రజాస్వామ్యం, జాతీయ సార్వభౌమత్వం, సామాజిక న్యాయం కాపాడుకోవటం కోసం ప్రగతిశీల, ప్రజాస్వామిక, వామపక్షశక్తుల మధ్య విశాల ఐక్యత అవసరమని ఈ ఫోరం బలమైన సందేశాన్ని ఇచ్చింది.

మేము జోక్యోలకు వ్యతిరేకంగా సార్వభౌమత్వాన్ని బలపరుస్తాం.
మేము ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యంకోసం నిలబడతాం.
మేము దోపిడీకి వ్యతిరేకంగా సోషలిజం కోసం నిలబడతాం.”

మేము సామ్రాజ్యవాదం, టెర్రరిజంకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సంఘీభావం కోసం నిలబడతాం”.
రామకృష్ణ పాండా తమ ప్రసంగంలో అంతర్జాతీయ టెర్రరిజానికి వ్యతిరేకంగా జరిపే పోరాటాన్ని శాంతి, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, జాతీయ సార్వభౌమాధికారం, సామాజిక న్యాయం కోసం జరిపే విస్తృత పోరాటం నుంచి వేరుచేయ వీలులేదని వక్కాణించారు. పశ్చిమాసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా ప్రజలు, ‘భద్రత’, ‘ప్రజాస్వామ్యం’ పేరుతో సామ్రాజ్యవాదం సాగించిన జోక్యాలకు భారీమూల్యం చెల్లించారని గుర్తుచేశారు. ఇరాక్‌, లిబియాలపై దండయాత్రలు రాజ్యవ్యవస్థలను ధ్వంసంచేసి అస్థిరత, తీవ్రవాదానికి అనువైన పరిస్థితులు సృష్టించాయన్నారు. సిరియాలో దీర్ఘకాలంపాటు ప్రాక్సీ యుద్ధాలు వినాశం కలుగజేశాయన్నారు. పాలస్తీనా భూభాగాల ఆక్రమణ, గాజాపై పదేపదే దాడు లు, సమష్టిగా శిక్ష, వేలాది మంది అమాయకుల హత్య-లు ఇవన్నీ సమకాలీన ప్రపంచంలో రాజ్య టెర్రరిజానికి స్పష్టమైన ఉదాహరణలని అన్నారు.

వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల పాత్రను వక్కాణిస్తూ ఐదు ప్రధాన కర్తవ్యాలను ఆయన ప్రతి పాదించారు : అంతర్జాతీయ సంఘీభావం పటిష్టం చేయటం; సెక్యులరిజం, ప్రజాస్వామ్యాలకు సమర్థన; టెర్రరిజానికి గల సామాజిక – ఆర్థిక కారణాలను బహిర్గతం చేయటం; యుద్ధం, సైనికీకరణకు వ్యతిరేకంగా ప్రజాపోరాటాలను ముమ్మరం చేయటం; పాలస్తీనా, వెనిజు లా, క్యూబా, ఇతర సర్వసత్తాక రాజ్యాలతో సంఘీభావం పటిష్టం చేయటం.

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ రష్యన్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి గెన్నడీ జ్యుగానోవ్‌ ఈ మహాసభలో ప్రారంభోపన్యాసం చేశారు. వామపక్ష శక్తుల పోరాటాన్ని సామ్రాజ్యవాదానికి, రాజ్యటెర్రరిజానికి, సైనిక దురాక్రమణకు, నయా వలసవాదానికీ, నయాఫాసిజానికీ వ్యతిరేకంగా జరిగే పోరాటాలనుంచి వేరు చేయలేమన్నారు. ప్రపంచ పెట్టుబడిదారీ విధానం తన లక్ష్యాలను “భౌతికంగా బలప్రయోగం, ఆలోచనను ప్రభావితం చేయటం” ద్వారా ముందుకు తీసుకెళుతున్నదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల శక్తులు ఈ ధోరణులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు. ఈ ఫోరం ప్రపంచ తిరోగమన శక్తులకు వ్యతిరేకంగా పోరాటంలో మరో చర్య అన్నారు.
జర్మన్‌ డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ (జిడిఆర్‌) చివరి నాయకుడు ఇగోన్‌ క్రెంజ్‌ ఈ మహాసభలో ప్రసంగించారు. రాజకీయంగా ఆయన కృషి, ఫాసిస్టు వ్యతిరేక వారసత్వంతో ఆయన సంబంధాన్ని గుర్తిస్తూ ప్రతిష్టాత్మకమైన లెనిన్‌ బహుమతితో ఆయన్ను సత్కరించారు. పలువురు కమ్యూనిస్టు, వర్కర్స్‌, ప్రగతిశీల శక్తుల నాయకులు కూడా ప్రసంగించారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో, శాంతి, ప్రజాస్వామ్యం, జాతీయ సార్వభౌమత్వం, సామాజిక న్యాయం కాపాడుకోవటం కోసం ప్రగతిశీల, ప్రజాస్వామిక, వామపక్షశక్తుల మధ్య విశాల ఐక్యత అవసరమని ఈ ఫోరం బలమైన సందేశాన్ని ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *