Skip to content
బిజినెస్ › వార్తలు

H-1B Visa Shock: రాజీనామా చేస్తారా..అమెరికా వదిలి వెళతారా.. ఉద్యోగులకు షాకిచ్చిన IBM

jagan 11 Nov 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
H-1B Visa Shock: రాజీనామా చేస్తారా..అమెరికా వదిలి వెళతారా.. ఉద్యోగులకు షాకిచ్చిన IBM

IBM

H-1B Visa Shock: ప్రముఖ అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఐబీఎం (IBM) అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు బిగ్ షాక్ ఇచ్చింది. తన ‘ఐబీఎం కన్సల్టింగ్’ విభాగంలోని మెజారిటీ ఉద్యోగాలకు ఇకపై ఎలాంటి యూఎస్ వీసా (H-1B వంటివి), గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్‌లు అందించబోమని సంచలన ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా లక్షన్నర మందికి పైగా ఉద్యోగులున్న ఐబీఎం కన్సల్టింగ్ విభాగం తీసుకున్న ఈ నిర్ణయం, టెక్ రంగంలో పనిచేస్తున్న వేలాది మంది విదేశీ నిపుణులలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విదేశీ టెక్ నిపుణుల నియామకాలపై కఠినమైన నిబంధనలు విధిస్తున్న నేపథ్యంలనే ఐబీఎం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

మరొక వైపు గత నెలలోనే మైక్రోసాఫ్ట్, అడోబ్, ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలను ‘పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్’ (PERM) ప్రక్రియ నుంచి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. విదేశీ ఉద్యోగులకు గ్రీన్ కార్డులు జారీ చేయడంలో ఇది అత్యంత కీలకమైన దశ కావడం వల్ల పరిశ్రమపై ప్రభావం చూపుతోంది.

నిర్ణయానికి గల కారణాలు:

గత కొన్నేళ్లుగా తమ సంస్థలో నైపుణ్యాల కొరతను తీర్చడానికి యూఎస్ వీసా ప్రోగ్రామ్‌లను వినియోగించుకున్నప్పటికీ, క్రమంగా వాటిపై ఆధారపడటం తగ్గిందని ఐబీఎం ప్రతినిధి ఒకరు ‘రాయిటర్స్‌’ (Reuters) వార్తా సంస్థకు తెలిపారు. ప్రస్తుతం అమెరికా స్థానిక మార్కెట్‌లోనే అవసరమైన నైపుణ్యాల లభ్యత పెరగడం, క్లయింట్ల అవసరాలలో మార్పులు రావడం వల్లే ఈ నిర్ణయానికి వచ్చినట్లు వివరించారు.

అంశంవివరాలు
నిర్ణయం తీసుకున్న సంస్థఐబీఎం (కన్సల్టింగ్ విభాగం)
తీసుకున్న చర్యయూఎస్ వీసా, గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్‌ల నిలిపివేత
ప్రభావితమయ్యే ఉద్యోగులుఐబీఎం కన్సల్టింగ్ విభాగంలో పనిచేస్తున్న విదేశీ నిపుణులు
ప్రత్యామ్నాయాలుఅమెరికా వెలుపలికి బదిలీ లేదా ఉద్యోగానికి రాజీనామా

‘బ్లూమ్‌బర్గ్’ (Bloomberg) నివేదిక ప్రకారం.. ఐబీఎం నిర్ణయంతో ప్రభావితమైన విదేశీ ఉద్యోగులు ఈ ఏడాది చివరిలోగా అమెరికా వెలుపల ఉన్న ఐబీఎం అంతర్జాతీయ కార్యాలయాలకు బదిలీపై వెళ్లాల్సి ఉంటుంది లేదంటే ఉద్యోగం నుంచి వైదొలగక తప్పని పరిస్థితి నెలకొంది. గతేడాది ట్రంప్ ప్రభుత్వం కొత్త హెచ్-1బీ పిటిషన్లపై ఏకంగా లక్ష డాలర్ల రుసుము విధించిన విషయం విదితమే.