Bhogapuram Airport : వీడియో ఇదిగో.. బొబ్బిలి వీణతో ప్రధాని మోదీ.. రూ.4,727 కోట్ల వ్యయంతో భోగాపురం అంతర్జాతీయ విమానం నిర్మాణం..
alluri sitarama raju international airport
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర కళా వైభవానికి ప్రతీకగా నిలిచే బొబ్బిలి వీణను ప్రధాని మోదీకి బహూకరించి ఘనంగా సత్కరించారు. సుమారు రూ.4,727 కోట్ల వ్యయంతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో రూపొందించబడింది.
Bhogapuram Airport: ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలిచే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్రకు దేశీయ, అంతర్జాతీయ విమాన కనెక్టివిటీ మరింత విస్తరించనుంది.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, జీఎంఆర్ గ్రూప్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని టెర్మినల్ భవనాన్ని సందర్శించి చెక్-ఇన్ హాల్, ప్రయాణికుల సౌకర్యాలు, డిజిటల్ వ్యవస్థలు, విమానాశ్రయ రూపకల్పనను పరిశీలించారు. జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ జి. మల్లిఖార్జునరావు, జీబీఎస్ రాజు విమానాశ్రయం నిర్మాణ విశేషాలు, మాస్టర్ ప్లాన్, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలను ప్రధానికి వివరించారు. ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఎడ్యుసిటీ నమూనాలను కూడా ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ రాష్ట్రంలో రూ.17,912 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.
బొబ్బిలి వీణతో ప్రధాని మోదీ సందడి
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర కళా వైభవానికి ప్రతీకగా నిలిచే బొబ్బిలి వీణను ప్రధాని మోదీకి బహూకరించి ఘనంగా సత్కరించారు. సుమారు రూ.4,727 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో రూపొందించబడింది. భవిష్యత్లో భారీ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తరణకు అనువుగా మౌలిక వసతులు సిద్ధం చేశారు. ఈ విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్రలో పర్యాటకం, పరిశ్రమలు, ఐటీ, ఫార్మా, సీఫుడ్ ఎగుమతులు, పెట్టుబడులకు గణనీయమైన ఊతం లభించనుందని ప్రభుత్వం భావిస్తోంది.
కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రను ప్రపంచంతో అనుసంధానించే కీలక కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు. ఇది ఎర్రబస్సులు కాదు ఎయిర్ బస్సులు తిరిగే ప్రాంతమని నిరూపించామని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని, రాబోయే రోజుల్లో ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రధాన చోదకశక్తిగా మారనుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
- Teachers’ Day 2026 Speech Ideas: నేడు టీచర్స్ డే సందర్భంగా మంచి స్పీచ్ ఇవ్వాలి అనుకుంటున్నారా..అయితే చక్కటి స్పీచ్ మీకోసం..
- Teachers Day Wishes On September 5: మీ గురువులు, స్నేహితులకు సెప్టెంబర్ 5 టీచర్స్ డే సందర్భంగా విషెస్ మీ కోసం…
- Happy Teachers Day 2026 Telugu Wishes: మీ బంధుమిత్రులు, స్నేహితులకు టీచర్స్ డే విషెస్ షేర్ చేయండి..
- Happy Teachers Day 2026 Wishes In Telugu: మీ టీచర్లు, స్నేహితులు, బంధు మిత్రులకు Messages, Quotes, Images రూపంలో Whatsapp Status, Facebook కోసం గ్రీటింగ్స్ మీకోసం..
- El Niño 2027 Alert: ప్రపంచానికి పెనుముప్పు తీసుకొస్తున్న చిన్న బాలుడు.. భారీ వర్షాలు, కరువు, తీవ్ర వేడి ముప్పు.. WMO తీవ్ర హెచ్చరిక