Skip to content
వినోదం వార్తలు

భారతరత్న ఎంఎస్‌ సుబ్బులక్ష్మి షురూ

Prajapaksham 18 Sep 2026 0 నిమిషాల పఠనం వినోదం
భారతరత్న ఎంఎస్‌ సుబ్బులక్ష్మి షురూ

Bharat Ratna M.S. Subbulakshmi Journey Begins

అమృత గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా శ్రోతలను దశాబ్దాల పాటు ఉర్రూతలూగించిన సంగీత సామ్రాజ్ఞి, గాయని భారతరత్న ఎంఎస్‌ సుబ్బులక్ష్మి జీవిత చరిత్రను సినిమాగా రూపొందించే భారీ ప్రయత్నం చేయబోతున్నారు. ప్రొడ్యూసర్స్‌ అల్లు అరవింద్‌, రాక్‌ లైన్‌ వెంకటేష్‌, బన్నీ వాస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎస్‌ సుబ్బులక్ష్మిగా రశ్మిక మందన్న నటిస్తున్నారు. టాలెంటెడ్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ తిన్ననూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎంఎస్‌ సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా లెజెండరీ యాక్టర్‌ కమల్‌ హాసన్‌ చేతుల మీదుగా లాంఛ్‌ చేశారు. రశ్మిక మందన్నపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి కమల్‌ హాసన్‌ క్లాప్‌ ఇచ్చారు. చెన్నైలోని మ్యూజిక్‌ అకాడెమీ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించారు. అనంతరం నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ఎంఎస్‌ అమ్మ గొప్ప సంగీతకారిణిగా మనందరికీ తెలుసు. కానీ ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న ఘటనల గురించి తెలిశాక ఈ బయోపిక్‌ తీయాలని మరింతగా ఇన్స్‌ పైర్‌ అయ్యాం. ఆమె పాటించిన నిబంధనలు, చూపించిన ధైర్యం, క్రమశిక్షణ చాలా గొప్పవి. ఆమె పదేళ్ల ప్రాయం నుంచే సంగీతం పట్ల తన ఇష్టాన్ని చూపిస్తూ గొప్ప లక్ష్యం వైపు చెదరని ఏకాగ్రతతో పయణించారు. ఎంఎస్‌ అమ్మ ఎంత ఇబ్బందికరమైన జీవితాన్ని గడిపారో చాలామందికి తెలియదు. నాలుగు దక్షిణ భారత భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం అన్నారు.హీరోయిన్‌ రశ్మిక మందన్న మాట్లాడుతూ నటిగా నాకు ఈ గొప్ప అవకాశం దక్కినందుకు కృతజ్ఞతతో మనసు నిండిపోతోంది. ఎంఎస్‌ అమ్మ 110వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ వేదిక మీద నిల్చున్నందుకు దేవుడి సమక్షంలో ఉన్న భావన కలుగుతోంది. అమ్మ జీవిత ప్రయాణంలో చిన్న భాగంగా మారుతున్నందుకు ఎంతో గర్వంగా, గౌరవంగా భావిస్తున్నా. ఎంఎస్‌ అమ్మ పాత్రను మీ అందరికీ నచ్చేలా పోషించేందుకు సంపూర్ణ ప్రయత్నం చేస్తాను. అన్నారు.లెజెండరీ యాక్టర్‌ కమల్‌ హాసన్‌ మాట్లాడుతూ తన సంగీతంతో భారతదేశాన్ని, ముఖ్యంగా దక్షిణ భారత దేశాన్ని ఏకం చేసిన సంగీత సామ్రాజ్ఞి ఎంఎస్‌ సుబ్బులక్ష్మి అమ్మ. ఆమె సంస్కృతం, హిందీ సహా అనేక భాషల్లో పాటలు పాడారు. తెలుగు, తమిళం, కన్నడ ఇలా ఏ భాషలో ఆమె పాట పాడినా భాషకే అందం తెచ్చేలా ఆ పాట ఉండేది. ఆమె సంగీతమే మనకు అందించిన సందేశం. ఎంఎస్‌ సుబ్బులక్ష్మి అమ్మ నాలో ఎంతో స్ఫూర్తి నింపారు. ఎంఎస్‌ సుబ్బులక్ష్మి అమ్మ. ఈ టీమ్‌ అందరికీ నా బెస్ట్‌ విసెస్‌ తెలియజేస్తున్నా. అన్నారు.ఈ కార్యక్రమంలో హీరోయిన్‌ సుహాసినీ, నటుడు శివకుమార్‌, దర్శకుడు మహేంద్రన్‌, నటుడు, దర్శకుడు సముద్రఖని, ప్రొడ్యూసర్స్‌ కలైపులి థాను, రాజేంద్రన్‌, కాట్రగడ్డ ప్రసాద్‌, ఎంఎస్‌ సుబ్బులక్ష్మి మనవడు చంద్రశేఖర్‌, ఆయన సతీమణి మాల, దర్శకుడు డైరెక్టర్‌ గౌతమ్‌ తిన్ననూరి,ప్రొడ్యూసర్‌ రాక్‌ లైన్‌ వెంకటేష్‌ , ప్రొడ్యూసర్‌ బన్నీవాస్‌ తదితరులు పాల్గొన్నారు.