జనవరి 13న చిరంజీవి ‘కాకా’ విడుదల
Kaaka
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్ తర్వాత ప్రతిష్టాత్మక చిత్రం ‘కాకా’తో రాబోతున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యాన ర్‌పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పుతోంది. భారీ స్థాయిలో హై-ఇంటెన్సిటీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌లో మెగాస్టార్‌ను రెండు డిఫరెంట్ షేడ్స్‌లో చూపించడంతో సినిమాపై మాస్లో భారీ క్రేజ్ ఏర్పడింది. హీరోయిన్ అనశ్వర రాజన్ ఈ సినిమాలో మెడికల్ స్టూడెంట్‌గా నటిస్తోంది. చిరంజీవి ‘సత్యం’ పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి.ఈ సినిమాకు ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నారు. ఆంటోనీ ఎల్ రూబెన్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. కోన వెంకట్, కే చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందించగా, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి రైటర్స్ గా చేస్తున్నారు. భాను-నందు డైలాగ్స్ రాస్తున్నారు.‘కాకా’ 2027 జనవరి 13న సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
- KTR At ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టులో విచారణకు.. కేటీఆర్ హాజరు..ఫార్ములా-ఈ కేసు విచారణ అక్టోబర్ 30కి వాయిదా
- Telangana Minister Ponguleti: అసైన్డ్ భూముల పట్టాలు ఉన్నవారిని ఎలాంటి ఇబ్బంది పెట్టము.. వట్టి నాగుల పల్లె భూమి నాది కాదు… మంత్రి పొంగులేటి స్పష్టం..
- Telangana 22A Land Issues: 22A భూముల సమస్యలకు హై లెవల్ కమిటీ.. ఫాస్ట్ ట్రాక్‌లో పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం
- Tata Group Stocks: టాటా గ్రూప్‌లో ఛైర్మన్ కొట్లాట.. భారీగా పడిపోయిన కంపెనీ షేర్లు.. కారణం ఏంటంటే..
- భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి షురూ