‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ టీజర్ రిలీజ్
Least Eligible Bachelor Teaser Released
హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. బాబు డెగాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చవాన్, శ్రీధర్ చెని, దీపక్ ముస్త్యాల నిర్మించారు. రాజ్ సుహాస్, ప్రమదేశ్వి వి క్రియేటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు.సెప్టెంబర్ 30 నుంచి ప్రముఖ తెలుగు ఒటిటి వేదిక ఇటివి విన్లో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. హర్ష ఫాదర్ ఎవరినైనా ప్రేమించమని చెప్పే సన్నివేశంతో మొదలైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. టీజర్లో ఫన్ అలరించింది. హర్ష టైమింగ్ అదిరిపోయింది. హైపర్ ఆది పంచులు మరో హైలైట్‌గా నిలిచాయి.జీవన్ కుమార్, ఐశ్వర్య హోలక్కల్, శ్రావ్య చౌదరి ఇతర కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు. అజయ్ అరసాడ సంగీతం, శక్తి అరవింద్ సినిమాటోగ్రఫీ,. జానీ షేక్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, లిఖిత్ లీ ఎడిటర్‌గా, సాయి ప్రావలిక కాస్ట్యూమ్ డిజైనర్‌గా, పీవీజీ విశ్వనాథ్ లైన్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు.హర్ష చెముడు, హైపర్ ఆది, జీవన్ కుమార్, ఐశ్వర్య హోలక్కల్, రూప శ్రావ్య, శ్రీ విద్యా, ప్రేమ్ సాగర్, వాసు ఇంటూరి, మహేందర్, జబర్దస్త్ గోపి తదితరులు నటించారు.
- Telangana Praja Palana Dinotsavam 2026: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం.. అణచివేతపై ధిక్కార స్వరం విన్పించిన నేల తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి
- Telangana Rain Alert: తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్.. హైదరాబాద్ సహా రాష్ట్రంలో భారీ వర్షాలు.. వచ్చే 5 రోజులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచన
- Corporate India Layoffs: 45 ఏళ్లు దాటితే ఉద్యోగానికి ముప్పేనా.. భారత కార్పొరేట్ రంగంలో మారుతున్న లేఆఫ్స్ ట్రెండ్ ఇదే..
- US Fed Rate Hike: అర్థరాత్రి యూఎస్ ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లు 25 బేసిస్ పాయింట్లు పెంపు.. మరోసారి పెంపునకు సంకేతాలు..
- ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ టీజర్ రిలీజ్