ఎంఎస్ సుబ్బలక్ష్మి’గా రష్మిక
Rashmika Mandanna
అమృత గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా శ్రోతలను దశాబ్దాల పాటు ఉర్రూతలూగించిన సంగీత సామ్రాజ్ఞి, గాయని భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవిత చరిత్రను సినిమాగా రూపొందించే ప్రయత్నం ప్రారంభించారు. నిర్మాతలు అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీ వాస్ సంయుక్తంగా ఈ ప్రెస్టీజియస్ మూవీలో ఎంఎస్ సుబ్బలక్ష్మిగా రశ్మిక మందన్న నటిస్తున్నారు. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి 110వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను ప్రకటించారు. చెన్నైలోని మ్యూజిక్ అకాడెమీ వేదికగా ఈ చిత్ర అనౌన్స్ మెంట్ ఘనంగా చేశారు.తన నట ప్రతిభతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న హీరోయిన్ రశ్మిక మందన్న ఎంఎస్ సుబ్బలక్ష్మి పాత్రకు ప్రాణం పోసి, ఆ పాత్రలో జీవించబోతున్నారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ అనౌన్స్మెంట్ సంగీత ప్రియుల్లో ఆనందాన్ని నింపుతోంది. వరల్డ్ క్లాస్ మేకింగ్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.
- Telangana Assembly Session: 22ఏ సమస్య ఒక్కరోజులో పుట్టింది కాదు..గత ప్రభుత్వాల నుంచి వారసత్వంగా వచ్చిన సమస్య .. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి..
- Hyderabad Water Crisis: నీటి సంక్షోభం దిశగా హైదరాబాద్.. భారీగా పడిపోయిన గ్రౌండ్‌వాటర్ లెవల్స్..ఏడాదిలోనే 4.84 మీటర్ల పతనం
- Telangana Assembly Session: ఆ ప్రైవేటు భూములను వెంటనే నిషేధిత జాబితా నుండి బయటకు తీసుకురండి.. ప్రభుత్వానికి సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక సూచన
- Telangana Assembly Session: కోటి ఎకరాలు అనేది అవాస్తవం.. సెక్షన్ 22-Aపై కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు.. ఏడో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు..
- UPI Transaction Rules: కొత్త UPI ట్రాన్సాక్షన్ రూల్స్.. కస్టమర్లకు ఛార్జీలు పడతాయా? NPCI FAQలో కీలక సమాధానాలు