శీతల భూగోళం దిశగా మానవాళి అడుగులు
World Ozone Day
(16 సెప్టెంబర్ ప్రపంచ ఓజోన్ దినం సందర్భంగా)
జీవకోటి ఆరోగ్యకర మనుగడకు అనువైన వాతావరణం భూగ్రహంపైన మాత్రమే ఉన్నది. సూర్యరశ్మి లేకుండా జీవి మనుగడ సాగించలేదు. భూమాత గృహంలో సకల ప్రాణికోటి మనుగడకు సంబంధించిన ఉష్ణోగ్రతలు, వాతావరణం, పరిశుద్ధ గాలి, స్వచ్ఛమైన నీరు, పవిత్రమైన మట్టి అందుబాటులో ఉన్నాయి. ప్రాణులకు హాని కలిగించే అంశాలకు ప్రకృతి మాత్రమే అడ్డుకట్ట వేస్తున్నది. సూర్యుడి నుంచి భూమిపైకి చేరుతున్న సూర్యరశ్మిలో అతి ప్రమాదకర అతినీలలోహిత లేదా అల్ట్రా-వాయిలెట్ (యూవీ) కిరణాలు కూడా ఉంటాయి. ఈ కిరణాలు నేలపైకి చేరితే జీవకోటి ఉనికికి అతి ప్రమాదకరంగా మారుతుంది. ఇలాంటి అత్యంత ప్రమాదరమైన, హానికారక యువి కిరణాలను నేలపైకి రాకుండా 10 కిమీ దూరంలోని స్ట్రాటోస్పియర్‌లో ఓజోన్ అనబడే పొర అడ్డుకొని, శోషణం చేసుకొని, సాధారణ సూర్యరశ్మి నేలపైకి చేరడానికి దోహదపడుతుంది. ఇలాంటి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఓజోన్ పొర జీవులకు ఒక రక్షణ గొడుగుగా పనిచేస్తున్నది.
ఓజోన్ పొర ప్రాధాన్యం: రసాయనపరంగా త్రి-పరమాణుక ఆక్సీజన్ అణువు (O3)ని ఓడోన్ అని పిలుస్తాం. ఈ అణువు యువి కిరణాలను శోషణం చేసుకొని, సాధారణ సూర్యరశ్మిని భూమిపైకి చేర్చుతుంది. ఓజోన్ పొర పలుచడినపుడు లేదా పొరకు రంధ్రాలు ఏర్పడినపుడు సూర్యరశ్మితో పాటు యువి కిరణాలు నేలపైకి చేరి మానవాళికి, జంతువులకు, వృక్ష సంపదకు హానిని కలిగిస్తాయి. ఓజోన్ పొర తరుగుదలను అడ్డుకోవడానికి స్థానిక స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు నిర్దిష్ట చర్యలు తీసుకోవడం నిరంతరం జరగాలి. రేపటి తరానికి ఆరోగ్యం గా జీవించడానికి అనువైన వాతావరణాలను బహుకరించడానికి కృషి చేద్దాం. నేటి యువతలో ఓజోన్ పరిరక్షణ అవగాహన పెంచుదాం.
- Telangana Assembly Session: 22ఏ సమస్య ఒక్కరోజులో పుట్టింది కాదు..గత ప్రభుత్వాల నుంచి వారసత్వంగా వచ్చిన సమస్య .. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి..
- Hyderabad Water Crisis: నీటి సంక్షోభం దిశగా హైదరాబాద్.. భారీగా పడిపోయిన గ్రౌండ్‌వాటర్ లెవల్స్..ఏడాదిలోనే 4.84 మీటర్ల పతనం
- Telangana Assembly Session: ఆ ప్రైవేటు భూములను వెంటనే నిషేధిత జాబితా నుండి బయటకు తీసుకురండి.. ప్రభుత్వానికి సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక సూచన
- Telangana Assembly Session: కోటి ఎకరాలు అనేది అవాస్తవం.. సెక్షన్ 22-Aపై కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు.. ఏడో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు..
- UPI Transaction Rules: కొత్త UPI ట్రాన్సాక్షన్ రూల్స్.. కస్టమర్లకు ఛార్జీలు పడతాయా? NPCI FAQలో కీలక సమాధానాలు