Skip to content
వినోదం వార్తలు

18న ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’ విడుదల

Prajapaksham 09 Sep 2026 1 నిమిషాల పఠనం వినోదం
18న ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’ విడుదల

pithapuram lo ala modalaindi

‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. డా. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, మణిచందన, అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని మహేష్ చంద్ర సినిమా టీమ్ మరియు ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా సంయుక్త నిర్మాణంలో దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదారి కిట్టయ్య) నిర్మించారు. ప్రేమ, సునిశితమైన హాస్యం, సెంటిమెంట్, తండ్రీకూతుళ్ల అనుబంధం వంటి భావోద్వేగ అంశాలతో పాటు యువతకు ఒక మంచి సందేశాన్ని అందించేలా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు దర్శకుడు మహేష్ చంద్ర తెలిపారు. మన చుట్టూ కనిపించే సహజమైన పాత్రలు, సంఘటనలతో సినిమా ఎంతో సహజంగా ఉంటుందని, ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందిస్తుందని ఆయన అన్నారు.హాస్య బ్రహ్మ డా. బ్రహ్మానందం వాయిస్ ఓవర్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుందని, ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ వడయార్ ఇందులో కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో పాటు రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందని, నిజంగా కెమెరా పెట్టి లైవ్ చేసినట్టుగా ఈ సినిమా ఉంటుందని, ఇలాంటి కాన్సెప్టులు ఎప్పుడూ ఎవర్ గ్రీన్ అని మహేష్ చంద్ర తెలిపారు. ఇరుముడి, విశ్వనాథం అండ్ సన్స్, మా ఇంటి బంగారం తరహా లోనే మా సినిమా కూడా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం అవుతుందని మహేష్ చంద్ర చెప్పారు. డా. రాజేంద్రప్రసాద్, పృధ్విరాజ్ ,కేదార్ శంకర్, మణిచందన, జయవాహిని, అన్నపూర్ణమ్మ, దాసరి పద్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా, జూనియర్ పవన్ కళ్యాణ్, జెడివి ప్రసాద్, కేఏ పాల్ రాము, జబర్దస్త్ శేషు ఇందులో ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి స్టోరీ డెవలప్మెంట్ – డైలాగ్స్ : శ్రీరామ్ ఏదోటి, ఎడిటర్: బి సత్యనారాయణ, మ్యూజిక్ : జీసీ క్రిష్.