నా కెరీర్లో చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్.. ‘సర్దార్ 2’ ప్రీరిలీజ్ లో హీరో కార్తీ
హీరో కార్తి తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘సర్దార్ 2’తో థియేటర్లలోకి వస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 10న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్బంగా హీరో కార్తి మాట్లాడుతూ ‘సర్దార్’ సినిమాకు ఇక్కడ చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ‘సర్దార్ 2’ నా కెరీర్లో చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్. ఇలాంటి స్పై క్యారెక్టర్ దొరకడం నా అదృష్టం. నిజానికి గూఢచారులకు ఎలాంటి గుర్తింపు ఉండదు. కానీ వాళ్ల పని వాళ్లు చాలా నిజాయితీతో, ఏదీ ఆశించకుండా చేస్తారు. ‘సర్దార్ 2’ చూసే ముందు ‘సర్దార్’ సినిమా మరొకసారి చూడమని కోరుతున్నాను. అది యూట్యూబ్‌లో ఫ్రీగా ఉంది. అలా ఆ సినిమా చూస్తే మీరు ‘సర్దార్ 2’కి ఇంకా స్ట్రాంగ్‌గా కనెక్ట్ అవుతారు అన్నారు . ఎస్.జె. సూర్య మాట్లాడుతూ సర్దార్ ఆల్రెడీ చాలా పెద్ద హిట్ అయిన సినిమా. ఆ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ‘సర్దార్ 2’ డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. కంటెంట్, యాక్షన్ చాలా కొత్తగా ఉంటుంది. డైరెక్టర్ మిత్రన్ అద్భుతమైన కథతో సినిమాని ఎక్స్ట్రార్డినరీగా తీశారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ తెలుగు సినిమా చాలా అద్భుతంగా ఉంది. ప్రతి సినిమా సక్సెస్ సాధిస్తోంది. పరిశ్రమ కళకళలాడుతోంది. ఇలాంటి సమయంలో ‘సర్దార్ 2’ సినిమా వస్తోంది. మా సినిమా కూడా ఇదే దోవలో అద్భుతమైన సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.హీరోయిన్ మాళవిక మోహన్. హీరోయిన్ ఆశిక రంగనాథ్.
నిర్మాత రవిశంకర్ , డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ , నిర్మాత నాగవంశీ ,నిర్మాత అనిల్ సుంకర పాల్గొన్నారు.