Skip to content
వినోదం వార్తలు

తెల్లకాగితం ఇన్నోసెంట్ ల‌వ్‌స్టోరీ.. టీజ‌ర్ లాంచ్ ఈవెంట్‌లో దిల్‌రాజు

Prajapaksham 07 Sep 2026 0 నిమిషాల పఠనం వినోదం
తెల్లకాగితం ఇన్నోసెంట్ ల‌వ్‌స్టోరీ.. టీజ‌ర్ లాంచ్ ఈవెంట్‌లో దిల్‌రాజు

Tella Kagitham Movie

అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కృష్ణ కొమ్మాలపాటి సమర్పణలో హర్ష్ రోషన్ ప్రస్తుతం చేస్తున్న చిత్రం ‘తెల్ల కాగితం’. అక్టోబ‌ర్‌2న మూవీ రిలీజ్ అవుతుంది. ‘కోర్ట్’, ‘బ్యాండ్ మేళం’ వంటి చిత్రాలతో విజయం సాధించిన హర్ష్ రోషన్ హీరోగా నటిస్తున్నారు. నక్ష‌త్ర హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతోంది. ఈ సినిమాతో రమేష్ బండ్రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యూత్ ఫుల్ ఎమోషనల్ లవ్ ఎంటర్‌టైన‌ర్‌గా రానున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ అయింది. ఈ క్ర‌మంలో మూవీకి సంబంధించిన టీజర్‌ను మేక‌ర్స్ శ‌నివారం రోజున రిలీజ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు, ద‌ర్శ‌కుడు బాబీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇంకా భాను బోగ‌వ‌ర‌పు, సినిమాటోగ్రాఫ‌ర్ కెవి.గుహ‌న్‌, న‌టుడు అజ‌య్‌, నందు, రామ్ అబ్బ‌రాజు, బెక్కెం వేణుగోపాల్‌, బివిఎస్‌.ర‌వి, ఈటీవీ విన్ సాయికృష్ణ‌, హ‌ర్ష్ రోష‌న్‌, న‌క్ష‌త్ర‌, శ్రావ్య‌, డైరెక్ట‌ర్ ర‌మేష్ బండ్రెడ్డి స‌హా ఇత‌ర చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘‘జీవితంలో తెలిసీ తెలియక అందరూ తప్పులు చేస్తుంటారనే విషయాన్నే ఈ సినిమాతో చెప్పాల‌నుకున్నారు. అదే తెల్ల కాగితం మీద ఎర్ర మ‌చ్చ ప‌డితే ఎలా ఉంటుంద‌నేదే క‌థ‌. అదే ఈ సినిమా. తెల్ల‌కాగితం మూవీ ఇన్నోసెంట్ ల‌వ్‌స్టోరి. కొత్త బంగారు లోకం తీసిన‌ప్పుడు నేనెగైతే ఫీల‌య్యాను. అలాగే వీళ్లు 2000 బ్యాక్ డ్రాప్‌లో జ‌రిగే క‌థ‌ను ఇన్నోసెంట్ ల‌వ్‌స్టోరీగా రూపొందించారు. హ‌ర్ష్ రోష‌న్‌, న‌క్ష‌త్ర‌.. మ‌రో ఇద్ద‌రు ఫ్రెండ్స్‌..న‌లుగురు మ‌ధ్య న‌డిచే క‌థ‌. క‌చ్చితంగా పెద్ద హిట్ అవుతుంద‌నే న‌మ్ముతున్నాను.ఎందుకంటే ఆ క‌థ‌లో అమాయ‌క‌త్వాన్ని నందు అందంగా రాస్తే, ర‌మేష్ చ‌క్క‌గా తీశాడు. గుహ‌న్ అద్భుత‌మైన విజువ‌ల్స్‌గా చెప్పాడు. విజ‌య్ సౌండ్ రూపంలో ఆవిష్క‌రించాడు. యూత్‌కి, ఫ్యామిలీస్‌కి క‌నెక్ట్ అయ్యే సినిమా. అజ‌య్ ఇందులో తండ్రి పాత్ర‌ను చేశాడు. రోష‌న్ బ్ర‌ద‌ర్ పాత్ర‌లో ర‌ఘురాం.. ఇలా స్టోరీలో చాలా ఇన్వాల్ అయ్యే పాత్ర‌లు మ‌న‌కు క‌నిపిస్తాయి. ఇప్పుడున్న జ‌నరేష‌న్ తెల్ల‌టి జీవితంపై ఎర్ర మ‌చ్చ ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డాల‌నేదే ఈ క‌థ‌. నిర్మాత కృష్ణ‌తో నాకు ఇర‌వైయేళ్ల జ‌ర్నీ. ఈ సినిమాకు అన్నీ ర‌కాలుగా వెనుకుండి స‌క్సెస్ వ‌చ్చే వ‌ర‌కు ప్ర‌య‌త్నం చేస్తుంటాం. కృష్ణ‌కు, టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌ అన్నారు. డైరెక్ట‌ర్ బాబీ, బివిఎస్ ర‌వి , ర‌ఘురాం , రాజ్‌కుమార్ కసిరెడ్డి , అజ‌య్, రామ్ అబ్బ‌రాజు భాను బోగ‌వ‌ర‌పు ,రైట‌ర్ నందు , బెక్కెం వేణు గోపాల్ , న‌క్ష‌త్ర , హర్ష్ రోషన్ , డైరెక్ట‌ర్ ర‌మేష్ బండ్రెడ్డి.