Skip to content
క్రైమ్ వార్తలు

కాబోయే భర్తను కొండ మీదకు తీసుకెళ్లి తోసేసిన యువతి…వామ్మో ఇదేం శాడిజం రా బాబోయ్..

Prajapaksham 23 Jun 2026 0 నిమిషాల పఠనం క్రైమ్
కాబోయే భర్తను కొండ మీదకు తీసుకెళ్లి తోసేసిన యువతి…వామ్మో ఇదేం శాడిజం రా బాబోయ్..

ప్రతీకాత్మకచిత్రం

జీవితంలో ఎంతో భవిష్యత్తు ఉన్న యువతీ యువకులు, చిన్న చిన్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికి దారుణాలకు దిగుతున్నారు. తాజాగా అలాంటి ఘటనలు ఒకేరోజు దేశంలో రెండు చోటుచేసుకున్నాయి. అందులో ఒకటి, మరికొన్ని రోజుల్లో ఏడడుగులు నడవాల్సిన కాబోయే భర్తను దారుణంగా హత్య చేసిన ఘటన, మహారాష్ట్రలో కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళితే, పూణేకు సమీపంలోని గహుంజే గ్రామానికి చెందినటువంటి కేతన్ అగర్వాల్ (26) అనే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణంగా హత్యకు గురయ్యాడు. మహారాష్ట్రలోని ప్రముఖ పర్యాటక కేంద్రం లోహగడ్ కోట పైనుంచి ఆయన కాబోయే భార్య తోసి వేయడంతో, తీవ్ర గాయాల పాలై స్పాట్‌లో మృతి చెందాడు. జూన్ 19వ తేదీన తన కాబోయే భార్య పుట్టినరోజు వేడుకల కోసం, ఆమె స్నేహితులతో కలిసి కేతన్ అగర్వాల్ విహారయాత్రకు వెళ్లాడు. సుమారు 400 అడుగుల పైన ఉన్నటువంటి కోటకు ట్రెక్కింగ్ ద్వారా చేరుకొని, అక్కడ ఫోటోలు దిగుతుండగా, నిందితురాలు, అలాగే ఆమె స్నేహితుడు ఇద్దరు కలిసి లోతైన లోయలోకి నెట్టేసినట్లు పోలీసుల రిపోర్టులో పేర్కొన్నారు.

అయితే నిందితులు మాత్రం, తాము కోటపై ఫోటోలు దిగుతుండగా, గాలివాన వల్ల అదుపుతప్పి కేతన్ 400 అడుగుల లోయలో పడిపోయాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ పోస్టుమార్టం నివేదికతో పాటు, అనుమానాస్పద ప్రవర్తన ద్వారా నిందితులను దర్యాప్తు చేయగా, అసలు విషయం బయటపడింది. కాబోయే భర్తను కొండపై నుంచి తోసి వేసానని ఎట్టకేలకు ఆ యువతి తెలపడంతో, అసలు విషయం బయటపడింది.

తనకు కాబోయే భర్త కేతన్ అగర్వాల్ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని, ఎలాగైనా పెళ్లి ఆగిపోవాలని ఉద్దేశంతో తాను ఈ చర్యకు పాల్పడినట్టు నిందితురాలు పేర్కొన్నారు. కాగా, పోలీసులు మొదట ఈ కేసును ఒక ప్రమాదంగానే భావించారు. కేసు దర్యాప్తులో నిందితులు చెబుతున్న సమాధానాలు ఏ మాత్రం మ్యాచ్ కాకపోవడంతో పాటు, పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేయగా, ఈ హత్య కోణం బయటపడింది. నిందితులను పోలీసులు అదుపులో తీసుకొని, న్యాయస్థానంలో హాజరు పరచనున్నారు. పోలీసుల దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరో ఘటన ఢిల్లీలో సైతం చోటు చేసుకోవడం గమనార్హం. ఢిల్లీలోని కాలింది కుంజ్ ప్రాంతంలో, 21 సంవత్సరాల యువకుడు తన భార్యకు మరొక వ్యక్తితో సంబంధం ఉందని అనుమానంతో గొంతు నులిమి చంపేశాడు. అయితే పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో, ఆ యువతి ఆత్మహత్య చేసుకుందని ఉరివేసి అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు సీనులోకి ఎంటర్ అయిన తర్వాత, అసలు విషయం బయటపడింది. ఎందుకంటే మృతురాలి పోస్టుమార్టం నివేదిక ఆధారంగా, ఆమెది ఆత్మహత్య కాదని, ఊపిరి ఆడకుండా దాడి చేయడం వల్లనే చనిపోయిందని రిపోర్టులో తేలింది. శరీరం పైన ఇతర భాగాల్లో కూడా తీవ్రమైన గాయాలు ఉన్నాయి. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి విచారణ జరపగా, అసలు విషయం బయటపడింది. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉంది. నిందితుడిని పోలీసులు రిమాండ్‌లోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *