Vijay-Trisha: అంతా తూచ్, ఔను వాళ్లిద్దరూ కలిసే ఉన్నారు, విజయ్ తో కేక్ కట్ చేయించిన త్రిష
ai generated
సోషల్ మీడియాలో ఆడుకోవాలి అంటే అది త్రిష తర్వాతే అని చెప్పొచ్చు. ఎందుకంటే, ఓవైపు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను తన ఇన్స్టాగ్రామ్ పేజీలో అన్‌ఫాలో చేసి, తామిద్దరి మధ్య బ్రేకప్ అయిపోయింది రేంజ్లో కలరింగ్ ఇవ్వడంతో, ఒక్కసారిగా సోషల్ మీడియా మొత్తం విజయ్, త్రిష బ్రేకప్ వార్తలతో నిండిపోయింది. కానీ, చావు కబురు చల్లగా చెప్పినట్టు, ఈరోజు పొద్దు పోయాక త్రిష తన అఫీషియల్ ట్విట్టర్ పేజీలో విజయ్ పక్కనే కూర్చొని, అతనితో కేక్ కట్ చేయిస్తున్న ఫోటో విడుదల చేయడంతో, అందరి నోళ్లకు తాళాలు పడ్డాయి. వీరిద్దరూ విడిపోలేదు, ఇంకా బలంగా అతుక్కున్నారు అని నెటిజన్లు అనుకుంటున్నారు. ఓవైపు త్రిష చేస్తున్నటువంటి ఈ జిమ్మిక్కులతో సోషల్ మీడియా మొత్తం అవాక్కవుతున్నారు. సోషల్ మీడియాను ఎలా ఉపయోగించుకోవాలో త్రిషకు తెలిసినట్టుగా మరెవరికి తెలియదని చెప్పవచ్చు. ఎందుకంటే, ఒక్క స్టేట్మెంట్ ఇవ్వకుండా, కేవలం ఒక అన్‌ఫాలో బటన్ కొట్టి, పొద్దున్నుంచి సాయంత్రం దాకా వార్తల్లో ప్రధానాంశంగా నిలిచినటువంటి త్రిష, మళ్లీ ఒక పోస్ట్ చేసి రోజంతా వార్తల్లో వ్యక్తిగా నిలిచిపోయింది. ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బర్త్‌డే కన్నా కూడా, త్రిష ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్ను అన్‌ఫాలో చేసింది అనే అంశంపైనే చర్చ అంతా జరిగిపోయింది. కానీ, సాయంత్రం కల్లా అంతా సద్దుమణిగిన తర్వాత, సడన్‌గా మరో బాంబు పేల్చి హౌరా అనిపించుకుంది.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, అలాగే నటి త్రిష ఇద్దరు సహజీవనం చేస్తున్నారని ఇప్పటికే బీజేపీకి చెందిన ఓ నేత ఎన్నికలకు ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ, గత కొన్ని నెలలుగా త్రిష, విజయ్ ఎక్కడికి వెళ్లినా కలిసి జంటగా వెళుతున్నారని కోలీవుడ్ సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మార్చి నెలలో వివాహం సందర్భంగా త్రిష, విజయ్ ఇద్దరు కలిసి వెళ్లారు. అలాగే, అజిత్ తల్లి చనిపోయినప్పుడు పరామర్శించేందుకు కూడా విజయ్, త్రిష ఇద్దరు కలిసి ఒకే కారులో వెళ్లారు. ఇక తమిళ మీడియాలో అయితే త్రిష గురించి కథలు కథలుగా చెబుతున్నారు. ఆమె భవిష్యత్తులో మరొక జయలలిత అవుతుందని, త్రిష సెంటర్‌గా టీవీకే పార్టీ మొత్తం నడుస్తుందని, ఆమె తమిళనాడు రాజకీయాల్లో పవర్ సెంటర్ అవుతున్నారని, మంత్రులంతా ఆమె చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారని వార్తలు ఎక్కువగా తమిళ మీడియాలో వండి వారిస్తున్నారు.
అందుకు బలం చేకూర్చేలానే సీఎం విజయ్, ఆయన భార్య సంగీత మధ్య విడాకులకు అప్లై చేసుకోవడం వంటివి చాలా వేగంగా జరిగిపోతున్నాయి. ఈ పరిణామాలు అన్నింటిని చూస్తూ ఉంటే, త్వరలోనే త్రిష, విజయ్ ఇద్దరు పెళ్లి పీటలు ఎక్కడం ఖాయమని నెట్టింట చర్చ నడుస్తోంది. నిప్పు లేనిదే పొగరాదు అనే సామెతకు సరిగ్గా సరిపోయేలా, త్రిష ప్రవర్తన కూడా అలాగే ఉంది అని చెప్పవచ్చు. ప్రస్తుతం మాత్రం త్రిష, విజయ్ విడిపోలేదు అనేది సుస్పష్టంగా ఈ ఫోటోను చూసి అర్థం చేసుకోవచ్చు.