Indiramma Towers in Hyderabad: ఇందిరమ్మ టవర్స్ కోసం ప్రభుత్వ భూముల గుర్తింపు.. అధికారులకు పొంగులేటి ఆదేశాలు..
Telangana Govt Revises Property Registration Rates from June 5; Homebuyers Face Higher Costs
Indiramma Towers in Hyderabad: తెలంగాణ రాజధాని హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో నిరుపేదల కోసం నిర్మించతలపెట్టిన ‘ఇందిరమ్మ టవర్స్’ (Indiramma Towers) ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఈ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయడానికి అవసరమైన ప్రభుత్వ భూములను యుద్ధ ప్రాతిపదికన సేకరించి, స్పష్టంగా గుర్తించాలని ఆయన సంబంధిత జిల్లాల అధికారులను ఆదేశించారు. కోర్ సిటీ , గ్రేటర్ హైదరాబాద్ (CURE) పరిధిలోని ఇందిరమ్మ టవర్లు, గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ తీరుపై హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు , హౌసింగ్ ఉన్నతాధికారులతో సచివాలయంలో మంత్రి పొంగులేటి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. సీయూఆర్ఈ (CURE) ప్రాంత పరిధిలో మొత్తం మూడు విడతల్లో లక్ష ఇందిరమ్మ ఫ్లాట్లను నిర్మించడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని తెలిపారు. మొదటి విడత పనులతో పాటు రాబోయే రెండు , మూడు విడతల నిర్మాణాలకు సంబంధించిన భూముల సేకరణ, స్థలాల గుర్తింపు ప్రక్రియను కూడా తక్షణమే పూర్తి చేయాలని కలెక్టర్లను కోరారు. మొదటి విడత ఇళ్ల లబ్ధిదారుల జాబితా ఎంపిక ప్రక్రియను ఈ నెలాఖరు నాటికి ఎలాంటి ఆలస్యం లేకుండా ముగించాలని స్పష్టమైన గడువు విధించారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అక్రమాలు, రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా పూర్తి పారదర్శకత పాటించాలని సూచించారు. అర్హులైన పేదలకు న్యాయం జరిగేలా పారదర్శకంగా చేపట్టే డ్రా/లాటరీ ప్రక్రియను సామాజిక మాధ్యమాల్లో, ముఖ్యంగా యూట్యూబ్ (YouTube) వేదికగా ప్రత్యక్ష ప్రసారం (Live Stream) చేయాలని అధికారులను ఆదేశించారు.