పెద్దలకు బాల్యాన్ని గుర్తు చేసే సకుటుంబ చిత్రం ‘సమ్మర్ హాలిడేస్”
Summer Holidays
ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్‌గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన తన ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై ‘సమ్మర్ హాలిడేస్’ అనే చిల్డ్రన్ మూవీని నిర్మిస్తున్నారు. ‘సమ్మర్ హాలిడేస్’ సినిమాను మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నవంబర్ 6న ‘సమ్మర్ హాలిడేస్’సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ చిత్ర రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్‌లో నిర్వహించారు. నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ అక్టోబర్ లోనే మా సినిమా రిలీజ్ కు కొన్ని డేట్స్ అనుకున్నాం కానీ కుదరలేదు. నవంబర్ 6న రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాం. మా సినిమా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ముందుకు వెళ్తున్నాం. రోహన్, అరుణ్ లీడ్ రోల్స్ చేశారు. వాళ్ల టీనేజ్ లో సమ్మర్ హాలీడేస్ లో వాళ్ల అమ్మమ్మ వాళ్ల ఊరు వెళ్లినప్పుడు ఎలాంటి జ్ఞాపకాలు ఉండేవో గుర్తుకు తెచ్చుకుంటారు. అందరికీ నచ్చేలా, అందరికీ కనెక్ట్ అయ్యేలా మూవీ ఉంటుంది. పిల్లల కంటే పేరెంట్స్ ఎక్కువ ఎంజాయ్ చేసే చిత్రమిది. అందరికీ వాళ్ల బాల్యాన్ని రెండు గంటల పాటు గుర్తుచేస్తాం. ఈ దీపావళికి మా సినిమా మంచి హిట్ అవుతుందని నమ్ముతున్నాం. చిన్న సినిమాల మనుగడ బాగుండాలంటే ప్రభుత్వం టికెట్ రేట్స్ పెంచేందుకు అనుమతి ఇవ్వకూడదని నా అభిప్రాయం అన్నారు. బాల నటుడు రోహన్ రాయ్, డైరెక్టర్ శ్రీకర్, మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమల్లి ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు.