Skip to content
తెలంగాణ వార్తలు

బీఆర్ఎస్ చేసిన తప్పులు సరిదిద్దితే మమ్మల్నే నిందిస్తారా?: మంత్రి శ్రీధర్ బాబు

Prajapaksham 08 Jun 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
బీఆర్ఎస్ చేసిన తప్పులు సరిదిద్దితే మమ్మల్నే నిందిస్తారా?: మంత్రి శ్రీధర్ బాబు

Sridhar Babu Questions Criticism Over Correcting BRS-Era Mistakes

గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం చేసిన తప్పులను తాము సరిచేస్తుంటే, తమ ప్రభుత్వంపై కొందరు అనవసర నిందలు వేస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి నాజీ సిద్ధాంతాలకు మద్దతు ఇస్తున్నారంటూ సాగుతున్న ప్రచారంపై ఆయన తీవ్రంగా స్పందించారు.

హిట్లర్ సిద్ధాంతాలను తాము పాటిస్తామని ముఖ్యమంత్రి ఎక్కడా చెప్పలేదని మంత్రి స్పష్టం చేశారు. సాధారణంగా ఏదైనా ఒక పనిని అనుకున్న విధంగా సాధించే వరకు విరమించని పట్టుదల గల వ్యక్తినే లోకంలో ‘హిట్లర్’ అని అంటుంటారని, ముఖ్యమంత్రి కూడా ఏ పనినైనా పట్టుదలతో పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే ఆ మాట మాట్లాడారని ఆయన వివరించారు. దీనిని కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

ఇక నగరంలో చెరువుల సంరక్షణ, ఆక్రమణల తొలగింపు కోసం ఏర్పాటు చేసిన హైడ్రా (HYDRAA) పై వస్తున్న ఆరోపణలను మంత్రి శ్రీధర్‌బాబు పూర్తిగా తోసిపుచ్చారు. భూకబ్జాదారుల గుండెల్లో హైడ్రా భయం పుట్టిస్తుంటే కొందరు ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా పూర్తిగా చట్టపరిధిలోనే పని చేస్తోందని, రాజ్యాంగం , చట్ట నిబంధనల ప్రకారమే ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేస్తోందని స్పష్టం చేశారు. హైడ్రా తీసుకుంటున్న కఠిన చర్యలను సామాన్య ప్రజలందరూ మనస్ఫూర్తిగా హర్షిస్తున్నారని, కానీ బీఆర్ఎస్ నాయకులకు మాత్రమే దీనివల్ల తీవ్ర ఇబ్బంది కలుగుతున్నట్లు కనిపిస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *