Skip to content
తెలంగాణ వార్తలు

మాకొద్దీ SIR బాబోయ్…తెలంగాణలో బీజేపీ వింత వాదన…మా ఓట్లన్నీ గల్లంతు…

Prajapaksham 26 Jul 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
మాకొద్దీ SIR బాబోయ్…తెలంగాణలో బీజేపీ వింత వాదన…మా ఓట్లన్నీ గల్లంతు…

మాకొద్దీ SIR బాబోయ్...తెలంగాణలో బీజేపీ వింత వాదన...మా ఓట్లన్నీ గల్లంతు...

తెలంగాణలో బెడిసి కొట్టిన బీజేపీ SIR ప్లాన్

బీజేపీ ఓటు బ్యాంకుగా ఉన్న ఉత్తరాది ఓటర్లు, ఏపీ ఓటర్ల ఓట్లు గల్లంతు

గోషామహల్ నియోజకవర్గంలో రాజాసింగ్ కు భారీ నష్టం..ఓడిపోయే ఛాన్స్..

పరిస్థితి ఎందుకిలా వచ్చింది..

దేశమంతటా బిజెపికి వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారని విమర్శలు వస్తుంటే, తెలంగాణలో మాత్రం “తమ ఓట్లే గల్లంతవుతున్నాయని” బిజెపి గగ్గోలు  పెడుతోంది. దీంతో రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. నిజానికి ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది బిజెపి ఒక పొలిటికల్ టూల్ గా వాడుకుంటుందని దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న నేపథ్యంలో. తెలంగాణలో మాత్రం ఇలా సీన్ రివర్స్ ఎందుకు అవుతోందని కమలం పార్టీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. నిజానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తమ ఓట్లను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని తొలగిస్తోందని, దీని వెనుక భారతీయ రాష్ట్ర సమితి అలాగే ఎంఐఎం  మూడు పార్టీలు కుమ్మక్కయి తమకు చెక్ పెట్టాలని చూస్తున్నాయని తాజాగా బిజెపి ఎన్నికల కమిషన్ కు సైతం ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

 ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నివసిస్తున్నటువంటి ఆంధ్ర ప్రాంత నివాసులతో పాటు బిజెపికి ఎక్కువగా సానుభూతి చూపించే ఉత్తరాది ఓటర్లను పెద్ద ఎత్తున తొలగిస్తున్నారని బిజెపి ఆరోపిస్తోంది.  నిజానికి ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాదులో సెటిల్ అయినటువంటి చాలామంది ఓటర్లు హైదరాబాద్ తో పాటు ఆంధ్ర ప్రాంతంలో కూడా ఓటు హక్కును కలిగి ఉన్నారు. . ఇలా ఓట్లు డూప్లికేట్ అయిన సందర్భాలు చాలా కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఉత్తర భారతదేశం ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఓటర్లు కూడా తమ సొంత రాష్ట్రం తో పాటు హైదరాబాద్ నగరంలో కూడా ఓటు హక్కును కలిగి ఉన్నారు. . ఈ ఓట్లన్నీ కూడా డూప్లికేషన్ అయిన నేపథ్యంలో వీటిని జాబితా నుంచి తొలగించే అవకాశం ఉంది. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఈ తరహా ఓట్లను ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. దీంతో బిజెపి గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో రెండవ అతిపెద్ద పార్టీగా  ఆవిర్భవించడానికి ప్రధాన కారణమైన ఈ ఓటు బ్యాంకు ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ద్వారా తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది. 

పాతబస్తీ ఓట్లపై ప్రధాన ఫోకస్:

 నిజానికి ఎస్ఐఆర్ ప్రక్రియకి ముందు హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా పాతబస్తీలో రోహింగ్యాల పేరిట అత్యధిక సంఖ్యలో ఉన్నారని అక్రమ వలసదారులు ఉన్నారని వీరందరి ఓట్లు కూడా ఎరివేస్తామని  బిజెపి నేతలు ఘంటాపథంగా చెప్పారు. కానీ పరిస్థితి మాత్రం పూర్తిగా రివర్స్ అవుతోంది. నిజానికి అస్సాం బెంగాల్ బీహార్ రాష్ట్రాల్లో బిజెపి గెలవడానికి ఎస్ఐఆర్ ప్రక్రియ పరోక్షంగా దోహదపడిందని చెబుతుంటారు. అక్కడ ఎక్కువగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిం ఓటర్లను తొలగించి బిజెపి తన పొలిటికల్ గేమ్ నడిపిందని చెబుతుంటారు. కానీ అలాంటి పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో కనిపించడం లేదు.

బిజెపి ఇంతకాలం ప్రచారం చేస్తున్న రోహింగ్యా ఫ్యాక్టర్ తెలంగాణలో దాదాపు ఉనికిలో కూడా లేదని ఈ ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో తేలింది.  గడచిన మూడు ఎన్నికల్లో వరుసగా బిజెపి ఉనికిని కాపాడుతున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. ఎందుకంటే రాజాసింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహల్ నియోజకవర్గంలో అత్యధిక శాతం ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ఓటర్లే ఉన్నారు. వారి ఓట్లు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది. గోషామహల్ నుంచి తొలగించి వేస్తే అక్కడ ముస్లిం జనాభా ఎక్కువగా ఉంది. కనుక గోషామహల్ ఓటు బ్యాంకు మారే అవకాశం కనిపిస్తోంది. ఇదే కనుక జరిగినట్లయితే గోషామహల్ ఎంఐఎం లేదా కాంగ్రెస్ పరం అయ్యే అవకాశం స్పష్టంగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

ట్యాగ్‌లు: BJP Telangana