Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

Andhra Pradesh Weather Update Today: జూలై 26, ఆదివారం ఏపీ వాతావరణం అప్‌డేట్స్ ఇవే..ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు…

Prajapaksham 26 Jul 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
Andhra Pradesh Weather Update Today: జూలై 26, ఆదివారం ఏపీ వాతావరణం అప్‌డేట్స్ ఇవే..ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు…

Andhra Pradesh Weather Update Today: జూలై 26, ఆదివారం ఏపీ వాతావరణం అప్‌డేట్స్ ఇవే..ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు...

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాతావరణం మారింది. ఈ రోజు (జూలై 26) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలపై ఈ ప్రభావం కనిపిస్తుందని తెలిపారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APDMA) తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముంది.

వర్షాల సమయంలో ప్రజలు చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల వద్ద గానీ నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. అయితే ఈ అల్పపీడన ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై తక్కువగానే ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలో భారీ ముప్పు లేదా ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని, అయితే అక్కడక్కడ పడే పిడుగుల పట్ల రైతులు, మత్స్యకారులు మరియు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.