Skip to content
జాతీయం › వార్తలు

Vote Chori Protest: ‘ఓట్ చోరీ’కి వ్యతిరేకంగా ఢిల్లీలో మెగా మార్చ్.. నవంబర్ 1న రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనుకునే వారందరూ హాజరు కావాలని రాహుల్ గాంధీ పిలుపు..

jagan 29 Oct 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Vote Chori Protest: ‘ఓట్ చోరీ’కి వ్యతిరేకంగా ఢిల్లీలో మెగా మార్చ్.. నవంబర్ 1న రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనుకునే వారందరూ హాజరు కావాలని రాహుల్ గాంధీ పిలుపు..

Rahul Gandhi

Vote Chori Protest: దేశంలో ‘ఓట్ చోరీ’ (ఓట్ల దొంగతనం) ప్రహసనానికి వ్యతిరేకంగా నవంబర్ 1వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక రాంలీలా మైదాన్‌లో భారీ మెగా మార్చ్ , ‘వార్ అగైన్స్ట్ ఓట్ చోరీ’ ప్రతిఘటన సభను నిర్వహిస్తున్నట్లు లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ మేరకు ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా తరలివచ్చి ఈ మెగా మార్చ్‌లో పాల్గొనాలని పిలుపునిస్తూ తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా వేదికగా ఒక భావోద్వేగభరిత సందేశాన్ని పోస్ట్ చేశారు.

ఈ నిరసన ర్యాలీ కేవలం ఒక రాజకీయ పార్టీ ప్రాతినిధ్యం వహించే కార్యక్రమం కాదని, ఇది భారతదేశ ప్రజాస్వామ్య ఆత్మను కాపాడుకునేందుకు నిర్వహిస్తున్న జాతీయ స్పందన అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా , కేంద్ర ఎన్నికల సంఘం (సిసిసి) జ్ఞానేశ్ కుమార్ వైఖరితో విసిగిపోయిన వారందరూ, భారత రాజ్యాంగాన్ని , ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనుకునే ప్రతీ పౌరుడు రాంలీలా మైదాన్‌కు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలీసుల లాఠీఛార్జీలు, బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, హక్కుల కోసం చేసే పోరాటంలో వెనక్కి తగ్గొద్దని పిలుపునిచ్చారు.

రాజకీయాల పరిధి దాటి ఆలోచించే విద్యార్థి సంఘాలు, యువత, రైతులు, శ్రామికులు, వ్యాపారవేత్తలు ఈ ప్రజా నిరసనలో ప్రత్యక్షంగా భాగస్వాములు కావాలని రాహుల్ గాంధీ ఆకాంక్షించారు. పౌరుల భావప్రకటనా స్వేచ్ఛపై, ఆలోచనా శక్తిపై , ఓటు హక్కుపై దాడి జరుగుతోందని భావించే ప్రతి ఒక్కరూ ఢిల్లీకి తరలివచ్చి దేశ ప్రతిఘటన స్వరాన్ని వినిపించాలని ఆయన కోరారు. నవంబర్ 1న జరిగే ఈ ‘చలో ఢిల్లీ’ పిలుపుతో ఇండియా (INDIA) కూటమి ప్రతిపక్షాలు ఢిల్లీ వేదికగా ఎన్నికల అక్రమాలపై సమరశంఖం పూరించనున్నాయి.