కుటుంబం కోసం దేనికైనా తెగించే కథ: ‘ఆదర్శ కుటుంబం’ ‘ప్రీ రిలీజ్’ వేడుకలో తివిక్రమ్
adarsha kutumbam
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయిక. తమన్ సంగీ తం అందిస్తున్న ఈ సినిమాలో నారా రోహిత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ‘ప్రీ రిలీజ్” వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ ‘20 ఏళ్ల తర్వాత నాది, త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుంది. ఎలాంటి సినిమా చేయాలనే ఒత్తిడి ఉండటం సహజం. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సినిమాలు చేసిన తరువాత కథ ఎంచుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కానీ, త్రివిక్రమ్ ఇలాంటి అద్భుతమైన స్క్రిప్ట్ తో వచ్చారు. అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. కామెడీ మాత్రమే కాకుండా థ్రిల్, సస్పెన్స్ ఇలా అన్ని ఎమోషన్స్‌తో ఇలాంటి అద్భుతమైన కథ చెప్పినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. అక్టోబర్ 30న ఆదర్శ కుటుంబం విడుదల కాబోతుంది అన్నారు. బంధాలన్నీ మనకి ఇవ్వబడతాయి. కానీ స్నేహితులను మనం ఎంచుకుంటాం. ప్రేమ కోసమైతే కోరుకుంటాం, వెంటపడతాం, ప్రాణాలు తీసుకునే అంతగా ప్రయత్నిస్తాం, యుద్ధం కూడా చేస్తాం స్నేహితులను మనం ఎంచుకుంటాం. చిట్టిబాబు, స్వర్ణ, సంపూర్ణ, సర్వ అనే నలుగురు మనుషులు ఆ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంత కష్టపడ్డారు? ఎంత దూరం వెళ్ళారు? ఒక సామాన్యుడు తెగిస్తే ఎంతదూరం ప్రయాణం చేయగలడు? అది ఈ సినిమా తాలూకు కథ అన్నారు.కథానాయిక శ్రీనిధి శెట్టి ,సంగీత దర్శకుడు తమన్, నటి నివేదా పేతురాజ్, నటుడు బ్రహ్మాజీ, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.