‘అలియాస్ రుక్మిణి’ పాట రిలీజ్
Alias __Rukmini
హీరో నాని యునానిమస్ ప్రొడక్షన్స్ మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రాబోతోంది. ‘అలియాస్ రుక్మిణి’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్ హీరోగా నటిస్తుండగా, ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా నిర్మాణంలో ప్రేమ, హాస్యం కలగలిసిన కథతో రూపొందుతున్న ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను మేకర్స్ ప్రారంభించారు. ఇందులో భాగంగా ఫస్ట్ సింగిల్ ‘రుక్కు రుక్కు రుక్మిణి’ లవ్ సాంగ్‌ను విడుదల చేశారు. ఆహ్లాదకరమైన ట్యూన్స్‌కు గిటార్, వయోలిన్‌తో కూడిన చక్కని ఆర్కెస్ట్రేషన్ తోడవడంతో పాటకు మంచి రొమాంటిక్ ఫీల్ వచ్చింది. తనతో కలిసి కోర్టులో పనిచేసే కృష్ణకు, ప్రతిరోజూ తాను వెళ్లే దారిలో కనిపించే స్కూల్ టీచర్ రుక్మిణిపై ప్రేమ కలుగుతుంది. గీత రచయిత పూర్ణాచారి ప్రేమ, ఆరాధన భావాలను అందంగా వ్యక్తపరిచే సాహిత్యాన్ని అందించగా, అనురాగ్ కులకర్ణి వోకల్స్ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చారు. విజువల్స్ కూడా మెలోడీకి చక్కగా సరిపోయాయి. నితిన్‌ను సాధారణ మధ్యతరగతి యువకుడైన కృష్ణగా, ఆఫియా సయ్యద్ను అందమైన రుక్మిణిగా పరిచయం చేశారు.ఈ చిత్రానికి జోమోన్ టీ. జాన్ ఐఎస్‌సి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూరుస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ నిర్వర్తిస్తుండగా, సృజన అడుసుమిల్లి ఎడిటింగ్ . ఈ సినిమా డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది.