‘నైరుతి’ మరింత ఆలస్యం
న్యూఢిల్లీ : ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు రాక మరింత ఆలస్యం కానుంది. రానున్న ఏడు రోజుల్లో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించవచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండి) వాతావరణ శాస్త్ర డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. వాస్తవానికి ఈ నెల 28వ తేదీన రుతుపవనాలు కేరళను తాకే అవకాశముందని ఐఎండి తొలుత వెల్లడించింది. సాధారణంగా, కేరళలో జూన్ 1వ తేదీన నైరుతి రుతుపవనాలు ప్రారంభమవుతాయి, ఇది దేశంలో నైరుతి రుతుపవన కాలం ప్రారంభానికి నాంది పలుకుతుంది. ఈ రుతుపవన కాలంలో భారతదేశంలో 92 శాతం దీర్ఘకాల సగటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఏప్రిల్ 13న వాతావరణ కార్యాలయం తెలిపింది. నైరుతి రుతుపవనాలపై తన రెండవ అంచనా సందర్భంగా భారత వాతావరణ శాఖ ఈ పరిశీలనలను వెల్లడించింది. జూన్‌లో ఎల్ నినో పరిస్థితులు బలహీనంగా, సెప్టెంబర్‌లో మధ్యస్థం నుండి బలంగా ఉండే అవకాశం ఉందని శుక్రవారం ఐఎండి పేర్కొంది. ప్రస్తుతం, భూమధ్యరేఖ పసిఫిక్ ప్రాంతంలో తటస్థ ఎల్ నినో- సదరన్ ఆసిలేషన్ పరిస్థితులు ఎల్ నినో పరిస్థితుల వైపు పరివర్తన చెందుతున్నాయి. ఎల్ నినో పరిస్థితులు ఏర్పడటం వల్ల దేశంలో రుతుపవన వర్షపాతం తగ్గుతుంది.
భారతదేశంలో జూన్- నెలల నైరుతి రుతుపవన కాలంలో కురిసే వర్షపాతం దీర్ఘకాల సగటులో 90 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు భారత వాతావరణ శాఖ శుక్రవారం తెలిపింది. ఈ రుతుపవన కాలంలో ఈశాన్య ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండగా, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉండవచ్చని వాతావరణ కార్యాలయం పేర్కొంది. 1971 నుండి 2020 వరకు సేకరించిన డేటా ఆధారంగా, దేశవ్యాప్తంగా కాలానుగుణ వర్షపాతం దీర్ఘకాల సగటు (ఎల్‌పిఎ) 87 సెం.మీ.గా ఉంది.
ఎల్‌పిఎ అంటే, ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఒక నెల లేదా రుతువు వంటి నిర్దిష్ట వ్యవధిలో నమోదైన వర్షపాతాన్ని, సాధారణంగా 30 నుండి 50 సంవత్సరాల సుదీర్ఘ కాలానికి సగటున లెక్కించడం. ‘దేశంలోని చాలా వర్షాధార వ్యవసాయ ప్రాంతాలు ఉన్న రుతుపవన ప్రధాన ప్రాంతంలో నైరుతి రుతుపవన కాలంలో కురిసే వర్షపాతం సాధారణం కంటే తక్కువగా (దీర్ఘకాలిక సగటులో 94 శాతం కంటే తక్కువ) ఉండే అవకాశం ఉంది’ అని భారత వాతావరణ శాఖ (ఐఎండి) వాతావరణ శాస్త్ర డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర ఒక ప్రకటనలో తెలిపారు.
జూన్ నెలలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణం కంటే తక్కువగా, అంటే దీర్ఘకాలిక సగటులో 92 శాతం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఒకవేళ రుతుపవన కాలంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతంలో 90 శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైతే, ఐఎండి దానిని ‘లోటు’గా వర్గీకరిస్తుంది.
జూన్‌లో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ నెలవారీ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ‘జూన్ నెలలో, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలలోనూ, మహారాష్ట్రలోని అక్కడక్కడా కొన్ని ప్రాంతాలలోనూ సాధారణ స్థాయి కంటే అధికంగా వడగాలుల రోజులు ఉండే అవకాశం ఉంది’ అని మహాపాత్ర తెలిపారు. రాజస్థాన్, జార్ఖండ్‌లలో మాత్రం సాధారణ స్థాయి కంటే తక్కువగా వడగాలుల రోజులు ఉండే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.