Skip to content
జాతీయం వార్తలు

Rahul Gandhi vs PM Modi: విద్యా వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేశారు.. ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు.. ముదురుతున్న నీట్‌ పేపర్‌ లీక్‌ వివాదం..

Prajapaksham 23 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Rahul Gandhi vs PM Modi: విద్యా వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేశారు.. ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు.. ముదురుతున్న నీట్‌ పేపర్‌ లీక్‌ వివాదం..

Rahul Gandhi Slams PM Modi: మోదీ దేశ చరిత్రలోనే అత్యంత యువత వ్యతిరేక ప్రధాని.. రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు.. న్యాయం అడిగితే లాఠీ దెబ్బలా అని మండిపాటు..

Rahul Gandhi vs PM Modi: నీట్‌ (NEET) పేపర్‌ లీక్‌ ఉదంతంలో యువత భవిష్యత్తుతో ఆడుకునే వారిని వదిలిపెట్టబోమని.. విచారణను వేగవంతం చేసేందుకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే ‘ఎక్స్’ వేదికగా స్పందించిన ఆయన.. దేశ యువత భవిష్యత్తుకు స్వయంగా హాని చేసిందే మోదీ ప్రభుత్వమని ఘాటుగా విమర్శించారు.

కేంద్రంలోని ప్రభుత్వం దేశ విద్యా వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసేందుకు అవకాశం కల్పించడమే కాకుండా.. ఈ అక్రమాలకు బాధ్యులైన వారిని రక్షించే ప్రయత్నం చేసిందని రాహుల్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా బాధితులైన విద్యార్థుల డిమాండ్లు చాలా స్పష్టంగా ఉన్నాయని పేర్కొన్న రాహుల్.. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

అంతేకాకుండా, తీవ్రంగా నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అలాగే న్యాయం కోసం దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద శాంతియుతంగా ఆందోళన చేసిన విద్యార్థులపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధాని మోదీ కఠిన చర్యల ప్రకటన చేసిన వెంటనే రాహుల్‌ గాంధీ ఈ స్థాయిలో కౌంటర్‌ ఇవ్వడం జాతీయ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.