Andhra Pradesh: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు.. నాన్-యూనిఫాం పోస్టులకు 34 నుంచి 44 ఏళ్లకు పెంపు
Andhra Pradesh:
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న లక్షలాది మంది నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని నాన్-యూనిఫాం ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని 10 సంవత్సరాలు పెంచుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటివరకు 34 ఏళ్లుగా ఉన్న గరిష్ఠ వయోపరిమితి ఒక్కసారిగా 44 ఏళ్లకు పెరిగింది. ఏపీపీఎస్సీ (APPSC)తో పాటు ఇతర ప్రభుత్వ సంస్థలు చేపట్టే నియామకాలన్నింటికీ ఈ వయో సడలింపు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
జివో నిబంధనల ప్రకారం ఈ అదనపు పదేళ్ల వయోపరిమితి సడలింపు 2027 సెప్టెంబర్ 30వ తేదీ వరకు విడుదలయ్యే ఉద్యోగ ప్రకటనలకు మాత్రమే అమల్లో ఉంటుంది. అంటే దాదాపు ఏడాది పాటు వచ్చే నోటిఫికేషన్లకు అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే ‘ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్-1996’ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు ప్రస్తుతం అమలులో ఉన్న 5 ఏళ్ల సాధారణ సడలింపులు యథావిధిగా కొనసాగుతాయి. దీంతో రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ఠంగా 49 ఏళ్ల వరకు అర్హత లభించనుంది. ఇక యూనిఫాం సర్వీసులకు సాధారణ కేటగిరీలో కేవలం రెండేళ్ల పాటు వయోపరిమితిని పెంచినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అయితే పోలీస్, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు, అటవీ, రవాణా శాఖలకు చెందిన యూనిఫాం పోస్టులతో పాటు నిర్దిష్ట భౌతిక ప్రమాణాలు (Physical Standards) తప్పనిసరి అయిన ఉద్యోగాలకు ఈ 10 ఏళ్ల సడలింపు వర్తించదని అధికారులు స్పష్టం చేశారు. నోటిఫికేషన్లు లేక వయసు మించిపోతోందని ఆందోళన చెందుతున్న తమ అభ్యర్థనలను మన్నించి, వయోపరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకున్నందుకు సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌లకు నిరుద్యోగ జేఏసీ, అభ్యర్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
- Amit Shah VS Abhijit Dipke: 2029లో గెలుపుపై ముందే ధీమానా? అమిత్ షా మాటల్లోనే దొంగతనం బయటపడింది..దిప్కే కౌంటర్..
- Rahul Gandhi Petition: రాహుల్ గాంధీ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా.. 14 లోపాలు గుర్తించిన రిజిస్ట్రీ
- Mamata Banerjee: మమతా బెనర్జీ నివాసం వద్ద కత్తితో మహిళ హల్చల్.. దాడికి యత్నించిందని టీఎంసీ ఎంపీ ఫిర్యాదు
- LB Nagar Double Decker Corridor: ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు గ్రీన్ సిగ్నల్.. హైదరాబాద్‌కు మరో కీలక ప్రాజెక్టు!
- CM Revanth Reddy: సీఎం రేవంత్ లాజిక్ కు బీజేపీ షాక్: జనాభా పెరుగుతుంటే.. 13 కోట్ల ఓట్లు ఎలా తగ్గాయి?