Alla Nani passed away: ఏపీ రాజకీయాల్లో తీవ్ర విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గుండెపోటుతో కన్నుమూత..
Alla Nani passed away
Alla Nani Passed Away: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం, మాజీ మంత్రి ఆళ్ల నాని (ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ – 57) మంగళవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. విశాఖపట్నంలోని తన నివాసంలో ఉన్న సమయంలో ఆయనకు తీవ్ర గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన హఠాన్మరణ వార్త తెలిసి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అభిమానులు, రాజకీయ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి.
ఏలూరు నియోజకవర్గ రాజకీయాల్లో ఆళ్ల నాని తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయంలోకి అరంగేట్రం చేసిన ఆయన, 2004, 2009 శాసనసభ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించి ఏలూరు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2019 ఎన్నికల్లో ఏలూరు నుంచి మూడోసారి విజయం సాధించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రితో పాటు కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా కరోనా (కోవిడ్-19) సంక్షోభ సమయంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన అందించిన సేవలు, చూపిన చొరవ ప్రత్యేక చర్చనీయాంశమయ్యాయి.
2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బడేటి చంటి(బడేటి రాధాకృష్ణ) చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆళ్ల నాని టీడీపీలో చేరారు. ఆళ్ల నాని మృతి పత్ర పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేస్తూ, ఏలూరు నియోజకవర్గ ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రజాదరణ పొందిన నాయకుడిని కోల్పోవడం ఏలూరు ప్రాంతానికి తీరని లోటని పలువురు నేతలు కొనియాడారు.
- Alla Nani passed away: ఏపీ రాజకీయాల్లో తీవ్ర విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గుండెపోటుతో కన్నుమూత..
- Monsoon Withdrawal: వర్షాకాలానికి గుడ్ బై.. సెప్టెంబర్ 19 నుంచి రుతుపవనాల ఉపసంహరణ.. IMD కీలక అప్డేట్
- Oracle Layoffs: ఒరాకిల్ ఉద్యోగులకు ఊహించని షాక్.. ఉదయం 6 గంటలకు లాస్ట్ వర్కింగ్ డే అంటూ కంపెనీ నుంచి ఈమెయిల్..
- Telangana: తెలంగాణలో కొత్త పెన్షన్ల దరఖాస్తుదారులకు అలర్ట్.. గడువు నేటితో సమాప్తం, అక్టోబర్ 1 నుండి పంపిణీ..
- Andhra Pradesh: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు.. నాన్-యూనిఫాం పోస్టులకు 34 నుంచి 44 ఏళ్లకు పెంపు