Skip to content
బిజినెస్ › వార్తలు

EPFO Good News for Employees: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వాట్సాప్‌లోనే PF బ్యాలెన్స్, పాస్‌బుక్ వివరాలు చెక్ చేసుకోండి..

jagan 02 Nov 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
EPFO Good News for Employees: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వాట్సాప్‌లోనే PF బ్యాలెన్స్, పాస్‌బుక్ వివరాలు చెక్ చేసుకోండి..

EPFO Rules

EPFO Good News for Employees: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తమ కోట్లాది మంది చందాదారులకు అత్యంత వేగవంతమైన, పారదర్శకమైన సేవలను అందుబాటులోకి తెస్తూ కీలక నిర్ణయాలు ప్రకటించింది. ఇకపై సాధారణ పీఎఫ్ ఖాతా వివరాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా వాట్సాప్ (WhatsApp) ద్వారానే పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకునే నూతన సదుపాయాన్ని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ లాంఛనంగా ప్రారంభించారు. దీనికి తోడు డార్మెంట్‌గా మారిన పీఎఫ్ ఖాతాల్లోని స్వల్ప మొత్తాలను నేరుగా చందాదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విప్లవాత్మక ఆటోమేటిక్ రీఫండ్ విధానానికి శ్రీకారం చుట్టారు.

ఈపీఎఫ్‌ఓ అధికారిక వాట్సాప్ సేవ ద్వారా చందాదారులు తమ పీఎఫ్ ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందో తక్షణమే పరిశీలించవచ్చు. వీటితో పాటు ఖాతాలో జరిగిన చివరి ఐదు లావాదేవీల (Last 5 Transactions) వివరాలను చూడటం , పూర్తి స్థాయి పీఎఫ్ పాస్‌బుక్ సమాచారాన్ని సులభంగా డౌన్‌లోడ్ చేసుకునే వీలు కల్పించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ప్రధానమంత్రి వికసిత్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన’ (PMVBRY) పథకం లబ్ధిదారులు తమ అవసరాలను పూర్తి చేసుకునేందుకు వీలుగా ఈ వాట్సాప్ వేదిక ద్వారానే వ్యక్తిగత సహాయం, అధికారిక మార్గదర్శకత్వాన్ని కూడా అందించనున్నారు.

వాట్సాప్ సేవలతో పాటు ఈపీఎఫ్‌ఓ ప్రకటించిన మరో అతిపెద్ద నిర్ణయం చందాదారులకు ఊరట నిచ్చింది. చాలా కాలంగా లావాదేవీలు లేక నిలిచిపోయిన (Inoperative/Dormant) , ఆధార్ ధ్రువీకరణ (Aadhaar Verification) పూర్తయిన పీఎఫ్ ఖాతాల్లో రూ.1,000 లేదా అంతకంటే తక్కువ సొమ్ము ఉన్న అర్హులైన చందాదారులకు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించే ప్రక్రియను సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్‌గా ప్రారంభించనున్నారు. దీనికోసం చందాదారులు ఎలాంటి ప్రత్యేక క్లెయిమ్ ఫారాలు దాఖలు చేయాల్సిన అవసరం లేదు. చందాదారుని గుర్తింపు , బ్యాంకింగ్ వివరాల (KYC) ధ్రువీకరణ పూర్తయిన వెంటనే డబ్బు నేరుగా వారి ఖాతాల్లోకి చేరుతుంది. ఈ సరికొత్త సదుపాయం ద్వారా సుమారు లక్ష మంది చందాదారులకు చెందిన దాదాపు రూ.5 కోట్ల బకాయిలు త్వరితగతిన విడుదల కానున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.