PM Modi Net Worth: ప్రధాని మోదీకి ఎంత ఆస్తి ఉంది.. ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు.. బ్యాంక్ బ్యాలెన్స్ పూర్తి వివరాలివే..
Modi
PM Modi Net Worth: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా ఆయన వ్యక్తిగత ఆస్తులు, పెట్టుబడుల వివరాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. దేశంలో అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి ఆస్తులు ఎంత ఉంటాయనే ఆసక్తి సహజంగానే ఉంటుంది. అయితే ప్రధానమంత్రి కార్యాలయం (PMO) తాజాగా వెల్లడించిన ఆస్తులు, అప్పుల వివరాల ప్రకారం.. 2026 మార్చి 31 నాటికి ప్రధాని నరేంద్ర మోదీ మొత్తం ఆస్తుల విలువ రూ.4,01,60,999గా ఉంది. ఈ వివరాలను కేంద్ర మంత్రుల ఆస్తులు, అప్పుల ప్రకటనలో PMO అధికారికంగా వెల్లడించింది.
ఆస్తుల వివరాలను పరిశీలిస్తే ప్రధాని మోదీ పేరు మీద స్థిరాస్తులు లేవని అధికారిక ప్రకటన స్పష్టం చేస్తోంది. వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి, వాణిజ్య భవనం, నివాస భవనం లేదా అపార్ట్‌మెంట్.. ఏదీ ఆయన పేరుపై నమోదు కాలేదు. స్థిరాస్తుల మొత్తం మార్కెట్ విలువను కూడా ‘NIL’గా పేర్కొన్నారు.
అదేవిధంగా ప్రధాని మోదీ పేరు మీద వ్యక్తిగత వాహనం కూడా లేదు. కార్లు, ఇతర మోటార్ వాహనాలు, విమానం, పడవ వంటి విభాగాల్లో ఆయన ఆస్తులు లేవని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ఇతరులకు ఇచ్చిన వ్యక్తిగత రుణాలు లేదా అడ్వాన్సులు కూడా లేవని వెల్లడించారు.
ప్రధాని మోదీ చరాస్తుల్లో అత్యధిక భాగం బ్యాంకు డిపాజిట్ల రూపంలో ఉంది. అధికారిక వివరాల ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) గాంధీనగర్ NSC బ్రాంచ్‌లో FDR, MOD రూపంలో రూ.3,79,76,101 ఉన్నాయి. అదే ఖాతాలో బ్యాంకు బ్యాలెన్స్‌గా రూ.3,562 ఉన్నట్లు ప్రకటించారు.
ఇక పోస్టాఫీస్‌కు సంబంధించిన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లలో (NSC) ప్రధాని మోదీ పెట్టుబడి రూ.10,24,724గా ఉంది. అంటే ఆయన పెట్టుబడుల్లో ఒక ప్రధాన భాగం బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టాఫీస్ సేవింగ్స్ వంటి సాధారణ పొదుపు సాధనాల్లోనే ఉన్నట్లు అధికారిక వివరాలు చూపిస్తున్నాయి. ప్రధాని మోదీ వద్ద నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నట్లు ఆస్తుల ప్రకటనలో పేర్కొన్నారు. వీటి మొత్తం బరువు సుమారు 45 గ్రాములు కాగా, వాటి విలువను రూ.4,58,864గా పేర్కొన్నారు.
ఇక ఆయన చేతిలో ఉన్న నగదు రూ.34,429గా, బ్యాంకు ఖాతాలోని బ్యాలెన్స్ రూ.3,562గా ఉంది. జీతం నుంచి మినహాయించిన TDS, బ్యాంకు FDRలపై వచ్చిన వడ్డీ కలిపి ఇతర ఆస్తుల విభాగంలో మొత్తం రూ.6,63,309గా నమోదైంది. ఇందులో జీతంపై TDS రూ.4,14,210 కాగా, బ్యాంకు FDR వడ్డీ రూ.2,49,099గా ఉంది.
స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు లేవు
ప్రధాని మోదీ ఆస్తుల ప్రకటనలో బాండ్లు, డిబెంచర్లు, షేర్లు, యూనిట్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటి పెట్టుబడుల విభాగంలో NILగా పేర్కొన్నారు. అంటే ఈ విభాగాల్లో ఆయన పేరుపై పెట్టుబడులు నమోదు కాలేదు.
అప్పులు కూడా లేవు
ఆస్తులతో పాటు అప్పులు, బాధ్యతల విషయంలోనూ ప్రధాని మోదీ పేరుపై ఎలాంటి వ్యక్తిగత రుణాలు లేదా ఇతరులకు ఇచ్చిన అడ్వాన్సులు లేవని ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం మీద 31 మార్చి 2026 నాటికి ఆయన ప్రకటించిన స్థూల ఆస్తుల విలువ రూ.4,01,60,999. ఇందులో బ్యాంకు FDRలు, NSCలు, బంగారు ఉంగరాలు, నగదు, బ్యాంకు బ్యాలెన్స్, జీతం TDS, FDR వడ్డీ వంటి అంశాలు ఉన్నాయి.
ఈ వివరాలు ప్రధాని కార్యాలయం 2025–26 ఆర్థిక సంవత్సరానికి, అంటే 31 మార్చి 2026 నాటికి ప్రకటించిన అధికారిక ఆస్తుల వివరాలు. కాబట్టి వీటిని ప్రస్తుతం ఆయన వ్యక్తిగత ఆస్తుల తాజా అధికారిక ప్రకటనగా చూడవచ్చు.
- KTR At ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టులో విచారణకు.. కేటీఆర్ హాజరు..ఫార్ములా-ఈ కేసు విచారణ అక్టోబర్ 30కి వాయిదా
- Telangana Minister Ponguleti: అసైన్డ్ భూముల పట్టాలు ఉన్నవారిని ఎలాంటి ఇబ్బంది పెట్టము.. వట్టి నాగుల పల్లె భూమి నాది కాదు… మంత్రి పొంగులేటి స్పష్టం..
- Telangana 22A Land Issues: 22A భూముల సమస్యలకు హై లెవల్ కమిటీ.. ఫాస్ట్ ట్రాక్‌లో పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం
- Tata Group Stocks: టాటా గ్రూప్‌లో ఛైర్మన్ కొట్లాట.. భారీగా పడిపోయిన కంపెనీ షేర్లు.. కారణం ఏంటంటే..
- భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి షురూ