India Pakistan Tension: ఇండియా-పాక్ మధ్య మరోసారి ఉద్రిక్తత.. అరేబియా సముద్రంలో నౌకలు ఢీ కొనడంపై పాకిస్తాన్ దౌత్యవేత్తకు సమన్లు..
India Pakistan Tension
India-Pakistan Tension: అరేబియా సముద్రంలో భారత్, పాకిస్థాన్ నౌకాదళాలకు చెందిన నౌకలు ఢీకొన్న ఘటన తీవ్ర దౌత్య పరిణామాలకు దారితీసింది. అంతర్జాతీయ జలాల్లో భారత నౌకాదళానికి చెందిన ఓ నౌకను పాకిస్థాన్ నౌకాదళ నౌక ఢీకొన్న ఘటనపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. పాకిస్థాన్ నౌకాదళం వ్యవహరించిన తీరు ‘ఆమోదయోగ్యం కాదు, ప్రొఫెషనల్‌గా లేదని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ మేరకు బుధవారం న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ అత్యున్నత అధికారిని.. భారత విదేశాంగ శాఖ పిలిపించి అధికారికంగా నిరసన తెలిపింది.
విదేశాంగ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఘటన సెప్టెంబర్ 15 రాత్రి అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో చోటుచేసుకుంది. భారత నౌకాదళ నౌక సాధారణ కార్యకలాపాల్లో ఉండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఢీకొన్నప్పటికీ భారత నౌకకు ఎలాంటి భారీ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే సముద్రంలో పాకిస్థాన్ నౌకాదళ యూనిట్ వ్యవహరించిన తీరు ఆందోళనకరంగా ఉందని భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ ఘటన 1991 ఏప్రిల్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య కుదిరిన సైనిక విన్యాసాలు, యుద్ధ కదలికలు, సైనిక బలగాల తరలింపుపై ముందస్తు సమాచారం ఒప్పందంలోని ఆర్టికల్ 10కు విరుద్ధంగా ఉందని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఇరు దేశాల సైనిక యూనిట్ల మధ్య అపార్థాలు, ప్రమాదాలు తలెత్తకుండా ఈ తరహా ఒప్పందాలు కుదిరాయి. ఈ నేపథ్యంలో సముద్రంలో నౌకాదళ యూనిట్లు తగిన జాగ్రత్తలు పాటించాలని భారత్ సూచించింది.
పాకిస్థాన్‌పాకిస్థాన్ తాత్కాలిక దౌత్య ప్రతినిధికు ఈ విషయాన్ని ఆ దేశ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని భారత్ స్పష్టం చేసింది. ఇలాంటి ఘటనలు మరోసారి చోటుచేసుకోకుండా పాకిస్థాన్ సైనిక యూనిట్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇరు దేశాల మధ్య అమల్లో ఉన్న సంబంధిత ఒప్పందాలను గౌరవించాలని సూచించింది.
న్యూఢిల్లీలో పాక్ దౌత్యవేత్తను పిలిపించడమే కాకుండా ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయానికి కూడా భారత్ ఆదేశాలు జారీ చేసింది. పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వద్ద ఇదే అంశంపై అధికారికంగా నిరసన వ్యక్తం చేయాలని భారత్ సూచించింది. దీంతో ఈ ఘటనపై రెండు దేశాల దౌత్య మార్గాల్లోనూ అధికారిక నిరసనలు నమోదుకానున్నాయి.
భారత్, పాకిస్థాన్ మధ్య ఇప్పటికే సైనిక, దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అరేబియా సముద్రంలో చోటుచేసుకున్న ఈ నౌకల ఢీ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ప్రస్తుతానికి ఈ ఘటనలో పెద్ద నష్టం జరిగినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించలేదు. పాకిస్థాన్ వైపు నుంచి ఈ ఘటనపై అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.
భారత విదేశాంగ శాఖ తాజా చర్యలతో సముద్ర జలాల్లో ఇరు దేశాల నౌకాదళాల కార్యకలాపాలపై మరోసారి దృష్టి పడింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇరు దేశాల మధ్య ఉన్న ఒప్పందాలను పాటించాల్సిన అవసరాన్ని భారత్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
- Telangana Assembly Session: 22ఏ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు.. వారం రోజుల్లో పెండింగ్ రిజిస్ట్రేషన్లు పరిష్కరించేలా చర్యలు..
- EPFO Wage Ceiling Hiked: ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు..రూ.15,000 నుంచి రూ.25,000కు పెరిగిన వేతన పరిమితి
- India Pakistan Tension: ఇండియా-పాక్ మధ్య మరోసారి ఉద్రిక్తత.. అరేబియా సముద్రంలో నౌకలు ఢీ కొనడంపై పాకిస్తాన్ దౌత్యవేత్తకు సమన్లు..
- Telangana Assembly Session: 22ఏ సమస్య ఒక్కరోజులో పుట్టింది కాదు..గత ప్రభుత్వాల నుంచి వారసత్వంగా వచ్చిన సమస్య .. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి..
- Hyderabad Water Crisis: నీటి సంక్షోభం దిశగా హైదరాబాద్.. భారీగా పడిపోయిన గ్రౌండ్‌వాటర్ లెవల్స్..ఏడాదిలోనే 4.84 మీటర్ల పతనం