పంజాబ్ ఆధిపత్యం కోసం బిజెపి ఎత్తులు
BJP Steps Up Strategy to Expand Footprint in Punjab
పంజాబ్ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర రాజకీయ వాతావరణం వేగం గా మారుతోంది. ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని రాజకీయ పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. అలాగే, రాజకీయ పొత్తుల గురించి చర్చలు కూడా ప్రారంభమయ్యాయి. అవి ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి.
కేంద్రంలోని ఆర్ ప్రభుత్వం, ఎన్నికల సంఘం ద్వారా ఓటర్ల జాబితాల ‘ప్రత్యేక ముమ్మర సవరణ’ (సర్) ప్రక్రియను చేపట్టింది. ఈ కసరత్తు గతంలో కొన్ని ఇతర రాష్ట్రాల్లో బిజెపికి రాజకీయ ప్రయోజనాలను చేకూర్చిం ది. పంజాబ్ అదే తరహా విధానాన్ని అనుసరిస్తున్న సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే, పంజాబ్ తమ సాంప్రదాయ ‘హిందూ-ముస్లిం విభజన’ వ్యూహం పెద్దగా ఎన్నికల లబ్ది చేకూర్చకపోవచ్చని బిజెపికి బాగా తెలుసు. రాష్ట్రంలోని ముస్లిం జనాభా ప్రధానంగా మలేర్ జిల్లాలో కేంద్రీకృతమై ఉండగా, లూధియానా వంటి నగరాల్లోని పరిశ్రమల్లోనూ, రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ రంగంలోనూ గణనీయ సంఖ్యలో ముస్లిం వలస కార్మికులు పనిచేస్తున్నారు. అందుకే బిజెపి పంజాబ్ భిన్నమైన వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది.
పంజాబ్ సిక్కు జనాభా అధికం. వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత వ్యాపారాలలో సిక్కులు కీలక పాత్ర పోషించడంతో పాటు, పట్టణ ప్రాంతాల్లోనూ గణనీయమైన ఉనికిని కలిగి ఉన్నారు. హిందువులు ప్రధానంగా పట్టణాలు, నగరాల్లో నివసిస్తూ, వివిధ వాణిజ్య, వ్యాపార కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారు.
భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చి దశాబ్దాలు గా పంజాబ్ స్థిరపడిన వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. అంతేకాకుండా, వివిధ మతపరమైన వర్గాలు, ‘డేరాలు’ (మతపరమైన కేంద్రాలు) ప్రజలలోని వివిధ వర్గాలపై గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉన్నాయి. దీనిని గుర్తించిన బిజెపి, బహుముఖ వ్యూహాన్ని అవలంబిస్తూ ఈ మతపరమైన సంస్థలతో సంబంధాలను బలోపేతం చేసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
గురు రవిదాస్ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జలంధర్ ప్రభావవంతమైన ‘డేరా సచ్ బల్లన్’ను సందర్శించారు. ఈ పర్యటనలో ఆయన అక్కడ నివాళులర్పించి, ఆ డేరా ఆధ్యాత్మిక అధిపతి అయిన సంత్ నిరంజన్ దాస్ కలిశారు. ప్రధానమంత్రి పర్యటనకు ముందే, జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, మాజీ కేంద్ర మంత్రి విజయ్ సంప్లా, బిజెపి నాయకుడు అవినాష్ చందర్ కూడిన పంజాబ్ బిజెపి సీనియర్ నాయకుల బృందం కూడా ఆ డేరాను సందర్శించింది.
అలాగే హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ, పంజాబ్ బిజెపి అధ్యక్షుడు కేవల్ సింగ్ ధిల్లాన్ బియాస్ ‘రాధా స్వామి సత్సంగ్ బియాస్’ (ఆర్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. సైనీ అక్కడ ఆర్ అధిపతి బాబా గురీందర్ సింగ్ ధిల్లాన్ కలిశారు. ఆశీర్వాదం పొందడం, ఆధ్యాత్మిక, సామాజిక అంశాలపై చర్చించడం ఈ భేటీ ఉద్దేశమని సమాచారం. ఈ పర్యటనలు ఆ ప్రాంతంలోని ప్రధాన మతపరమైన సంస్థల అనుచరుల మధ్య తమ ప్రభావాన్ని విస్తరించడానికి బిజెపి చేస్తున్న ప్రయత్నాలను నొక్కి చెబుతున్నాయి.
‘డేరా సచ్చా సౌదా’ హర్యానాలో ఉన్నప్పటికీ, పంజాబ్ కూడా దీనికి గణనీయమైన సంఖ్యలో అనుచరులు ఉన్నారు. దీని అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ జైలులో ఉన్నప్పటికీ, ఆయనకు ఇంకా గట్టి పట్టు ఉంది. ఆయనకు తరచుగా లభించే పెరోల్ (తాత్కాలిక విడుదల) వివాదాలకు దారితీస్తుంటుంది, అలాగే ఎన్నికల సమయం లో ఆయన ప్రభావాన్ని వ్యూహాత్మకంగా వినియోగించుకుంటారని చాలామంది పరిశీలకులు భావిస్తుంటారు.
ఇటీవల బిజెపి తన రాజకీయ వ్యూహానికి మరో కోణాన్ని జోడించినట్లు కనిపిస్తోంది. ప్రజాక్షేత్రంలో కొన్ని ఆలోచనలను వదిలి, దానిపై ప్రజల స్పందనను అంచనా వేసి, ఆ తర్వాత వాటిని ముందు కు తీసుకెళ్లాలా వద్దా అని నిర్ణయించుకోవడం ఆర్ పరిపాటిగా వస్తున్న పద్ధతి. ఈ నేపథ్యంలో, మహారాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్ జూన్ 6న మెహతా చౌక్ ‘దమ్దమీ తక్సాల్’ ప్రధాన కార్యాలయంలో జరిగిన ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ స్మారక కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ సమయంలో భారత సైన్యంతో పోరాడిన వారిని ‘అమరులు’ అని ఆయన బహిరంగంగా పేర్కొన్నారు. స్వర్ణ దేవాలయంపై సైనిక చర్య చేపట్టాలని నాటి ప్రధాని ఇందిరా గాంధీపై బిజెపి నేత లాల్ కృష్ణ అద్వానీ ఒత్తిడి తెచ్చారన్న విషయం అందరికీ తెలిసిందే.
ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఒక ప్రధాన మతపరమైన ప్రదేశం లో సాయుధ చర్య చేపట్టడం అనేది ఎప్పుడూ వివాదాస్పదమే అవుతుంది. ఎందుకంటే అలాంటి ప్రదేశాలతో ప్రజల గాఢమైన భావోద్వేగాలు ముడిపడి ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ పాత్రను మహాజన్ ‘అహ్మద్ షా అబ్దాలీ’ పాత్రతో కూడా పోల్చారు. 1984లో ప్రధాని ఇందిరా గాంధీని ఆమె భద్రతా సిబ్బంది హత్య చేసిన తర్వాత ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో సిక్కు వ్యతిరేక హింసను ప్రేరేపించడంలో పలువు రు కాంగ్రెస్ నాయకులు నిందనీయమైన పాత్ర పోషించారనడంలో సందేహం లేదు. అయితే, ఆ సమయంలో సిక్కు వ్యతిరేక భావనను పెంచడంలో క్షేత్రస్థాయిలో ఆర్ కార్యకర్తలు పోషించిన పాత్ర పై మాత్రం తక్కువ దృష్టి సారించబడింది.
ముఖ్యంగా బర్నాలా ప్రభుత్వ హయాంలో జరిగిన ‘ఆపరేషన్ బ్లాక్ థండర్’ గురించి మహాజన్ ఎక్కడా ప్రస్తావించలేదు. స్వర్ణ దేవాలయ ప్రాంగణం నుండి సాయుధ మిలిటెంట్లను తొలగించడానికి ‘ఆపరేషన్ బ్లాక్ థండర్’ను రెండు దశల్లో చేపట్టారు. ‘ఆపరేషన్ బ్లాక్ థండర్-1’ 1986 ఏప్రిల్ 30 రాత్రి ప్రారంభమై మే 1న ముగిసింది. ‘ఆపరేషన్ బ్లాక్ థండర్-2’ 1988 మే 9న మొదలై, మిలిటెంట్ల లొంగుబాటుతో మే 18న ముగిసింది. ఈ ఆపరేషన్లు ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ నుండి గణనీయంగా భిన్నంగా ఉన్నాయి. వీటికి ప్రధానంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ పంజాబ్ పోలీసులు నాయక త్వం వహించారు. పౌర ప్రాణనష్టాన్ని, పుణ్యక్షేత్రానికి జరిగే నష్టాన్ని తగ్గించడంపై ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వీటిని నిర్వహించారు. బ్లాక్ థండర్1 సమయంలో, ముఖ్యమంత్రి సుర్జిత్ సింగ్ బర్నాలా కేంద్ర జోక్యం కోరారు, దాని ఫలితంగా భద్రతా దళాలను మోహరించారు. బ్లాక్ థండర్2 ప్రారంభమయ్యేనాటికి, బర్నాలా ప్రభుత్వం డిస్మిస్ కావడంతో పంజాబ్ రాష్ట్రపతి పాలనలో ఉంది.
శిరోమణి అకాలీ దళ్ ఎన్నికల పొత్తుకు అవకాశం ఉందని బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సూచించినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. ఇది కొన్ని వైరుధ్యాలను లేవనెత్తుతుంది. చారిత్రాత్మకంగా, అకాలీలు, దమ్దమీ తక్సాల్ ఎల్లప్పుడూ ఉమ్మడి రాజకీయ దృక్పథాలను పంచుకోలేదు. తీవ్రవాదం ప్రబలంగా ఉన్న అల్లకల్లోల సంవత్సరాలలో దమ్దమీ తక్సాల్ ప్రముఖ పాత్ర పోషించింది. ఖలిస్తాన్ ఉద్యమం, వేర్పాటువాద భావజాల ప్రచారంతో సంబంధం కలిగి ఉంది. అకాలీ నాయకత్వం హింసను లేదా వేర్పాటువాదాన్ని సమర్థించలేదు. అయినప్పటికీ ఈ ధోరణులను వ్యతిరేకించటంలో అకాలీలు అవసరమైనంత చొరవ చేయలేదనీ, లేదా మౌనంగా ఉన్నారనే భావన ప్రజల్లో ఉంది.
రాజకీయంగా మతపరమైన గుర్తింపు పాతుకుపోయిన పార్టీగా అకాలీ దళ్ లౌకిక విశ్వసనీయత తరచుగా ప్రశ్నించబడింది. అకాలీ నాయకులు సిక్కులపై వివక్ష ఆరోపణలకు సంబంధించిన సమస్యల ను పదేపదే లేవనెత్తడం, కొన్ని సందర్భాల్లో భారత రాజ్యాంగ ప్రతుల ను చించివేయడం వంటి ప్రతీకాత్మక చర్యలకు పాల్పడటం కూడా గమనార్హం. అటువంటి చర్యలు ఆ కాలంలో ప్రజల అభిప్రాయాలను, రాజకీయ చర్చలను రూపొందించడంలో దోహదపడ్డాయి.
అకాలీలతో భవిష్యత్తులో పొత్తు పెట్టుకుంటే అది తమను ఆధిపత్య స్థానంలో నిలబెడుతుందని బిజెపి ఆశిస్తునట్లు కనిపిస్తోంది. అయితే, ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల దృష్ట్యా ఇది అంత సులభమేమి కాకపోవచ్చు. సంప్రదాయబద్ధంగా సిక్కు ఓట్లను ఏకీకృతం చేయడానికి ప్రయత్నించిన అకాలీ దళ్, ఇప్పుడు అనేక ఇతర సంస్థల నుండి పోటీని ఎదుర్కొంటోంది. అలాంటి ఒక కొత్త శక్తే ‘వారిస్ పంజాబ్ దే’. దీనికి ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుడు, బోధకుడు అమృత్ సింగ్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ సంస్థ వ్యవస్థాపకు డు, నటుడుఉద్యమకారుడు అయిన దీప్ సిద్ధు మరణానంతరం ఆయన నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల అమృత్ సింగ్ పరోక్షంగా లబ్ధి పొందారని విమర్శకులు ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో దీప్ సిద్ధుకు బహిరంగంగా ఉన్న సాన్నిహిత్యం కూడా ఈ సంబంధాల స్వభావాన్ని కొందరు రాజకీయ పరిశీలకులు ప్రశ్నించేలా చేసింది. ఫలితంగా, అమృత్ సింగ్ రాజకీయ ప్రస్థానంపై కూడా ప్రశ్నలు తలెత్తాయి.
పంజాబ్ మత విభజనను పరోక్షంగా ప్రోత్సహించడంలో బిజెపి పాత్ర గతంలో కూడా చూసాం. తీవ్రవాదం ఉధృతంగా ఉన్న కాలంలో శాంతి కమిటీ సమావేశాలలో కొంతమంది బిజెపి నాయకులు చేసిన ప్రసంగాలు ఐక్యతను పెంపొందించే బదులు, తరచుగా మత విద్వేష ధోరణులను ప్రతిబింబిస్తూ మత విభజనలను బలపరిచాయి. ఈ నేపథ్యంలో, పంజాబ్ బిజెపి చేస్తున్న ప్రస్తుత రాజకీయ ఎత్తుగడలు నిశితంగా గమనించాల్సినవి. భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఎంతో నిబద్ధత కలిగిన పలువురు కామ్రేడ్ కోల్పోవడం తో సహా, అనేక గొప్ప త్యాగాలు చేస్తూ వేర్పాటువాదాన్ని, ఉగ్రవాద హింసను నిరంతరం వ్యతిరేకించింది. ఆ కాలంలో మతతత్వ అధికసంఖ్యాకవాదం, వేర్పాటువాదం రెండింటినీ వ్యతిరేకిస్తూ ‘న హిందూ రాజ్, న ఖలిస్తాన్ జుగ్ జుగ్ జివే హిందుస్థాన్ (హిందూ రాజ్ వద్దు, ఖలిస్తాన్ వద్దు, యుగయుగాలు హిందుస్థాన్ వర్థిల్లాలి) అనే నినాదం విస్తృతంగా ప్రాచుర్యం పొందింది.
ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాయి. బిజెపి రాజకీయ పురోగతిని అడ్డుకోవడం లో పంజాబ్ విజయం సాధిస్తే, అది ఆ పార్టీకి ఒక పెద్ద ఎదురుదెబ్బ కావచ్చు. అలాంటి ఫలితాన్ని సాధించేందుకు నిశితమైన ప్రణాళిక, విశాల రాజకీయ సమీకరణ అవసరం. 1980లలో ఉన్నంత సంస్థాగత శక్తిని వామపక్షాలు ఇప్పుడు కలిగి లేవు, కానీ అవి గణనీయమైన సైద్ధాంతిక బలాన్ని నిలుపుకున్నాయి. వామపక్షాలు ఇప్పటికీ ట్రేడ్ యూనియన్ వ్యవసాయ కార్మికులు, చిన్న, సన్నకారు రైతుల మధ్య గణనీయమైన ఉనికిని కలిగి ఉన్నాయి. అనేక రాజకీయ పార్టీ లు ఎన్నికల రాజకీయాలను ప్రధానంగా మతపరమైన గుర్తింపు కోణంలోనే చూస్తున్నప్పటికీ, వామపక్షాలు మాత్రం సామాన్య ప్రజల ను ప్రభావితం చేసే వేతనాలు, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఉపాధి, మహిళల హక్కులు వంటి అంశాలపై నిరంతరం దృష్టి సారిస్తున్నాయి.
ఈ అంశాలు ప్రజా బాహుళ్యంలో అగ్రస్థానంలో ఉండటం అత్యంత అవసరం. వామపక్ష సంఘాలు, వామపక్షాలకు వెలువల ఉండే ప్రజాస్వామ్య, లౌకిక శక్తులను ఏకం చేయగల ఫాసిస్ట్ వ్యతిరేక విశాల కూటమిని నిర్మించి, తద్వారా విభజనవాద, అస్థిత్వ ఆధారిత రాజకీయాలకు నమ్మకమైన ప్రత్యామ్నాయాన్ని అందించడమే ప్రగతిశీల శక్తుల ముందున్న సవాలు. – డాక్టర్ అరుణ్ మిత్ర