Skip to content
జాతీయం వార్తలు

చదువుల ప్రారంభం… ఫీజుల దోపిడీకి శ్రీకారం!

Prajapaksham 14 Jun 2026 0 నిమిషాల పఠనం జాతీయం
చదువుల ప్రారంభం… ఫీజుల దోపిడీకి శ్రీకారం!

New Academic Year Brings Fresh Concerns Over School Fees

జూన్ నెల అంటే విద్యార్థులకు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమ యం. కొత్త పుస్తకాలు, కొత్త తరగతులు, కొత్త ఆశయాలతో విద్యార్థులు పాఠశాలలు, కళాశాలల కు అడుగుపెడతారు. కానీ అదే సమయంలో తల్లిదండ్రులకు జూన్ నెల ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడికి ఆర్థిక భారాన్ని మోసుకొచ్చే నెలగా మారుతోంది. విద్యను వ్యాపారం చేస్తున్నాయి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు. రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు అంతా మా ఇష్టం, ఫీజుల జీవోలు మాకు వర్తించవన్నట్టు, ప్రైవేట్ విద్యాసంస్థలు వ్యాపార కేంద్రాలు అన్నట్లుగా మార్చేస్తున్నారు. అసలు ఏ పాఠశాలకు, కళాశాలకు అనుమతి ఉందో బహిర్గతం చేయాలి అధికారులు .ఒక్కో బ్రాంచ్ కి అనుమతి దాని పేరు మీద 2, 3 బ్రాంచీలు నిర్వహణ చేస్తున్నారు. అధికారికంగా తెలంగాణలో జూన్ 15వ తేదీ నుంచి పాఠశాలల ప్రారంభం, జూన్ ఒకటవ తేదీ నుంచి ఇంటర్ కళాశాలల ప్రారంభం అయ్యాయి. కానీ ఎప్పటి నుండో నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్ల ప్రారంభం. అనేక పాఠశాలలు, కళాశాలలు ఈ అడ్మిషన్ల పేరుతో దందా మొదలెట్టాయి. తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు విద్యాశాఖ నిబంధనలను గాలికి వదిలి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు, కొత్తగా అడ్మిషన్ల కోసం విద్యార్థులకు అడ్మిషన్ టెస్టులను నిర్వహిస్తూ టెస్ట్ పాస్ అయితేనే సీటు, లేకుంటే లేదు అంటున్నారు. ఏకంగా ఒకటి, రెండు, మూడు తరగతి విద్యార్థు లకు కూడా అడ్మిషన్ టెస్టులు నిర్వహించి అడ్మిషన్లు ఇస్తున్నారు. అడ్మిషన్ టెస్ట్ కోసం ఫీజు కట్టి, పరీక్ష రాసి పరీక్ష పాస్ అయితేనే సీటు ఇట్లా ఒక్కో తరగతిలో 100మంది విద్యార్థులకు పరీక్ష పెట్టి పదుల సంఖ్య విద్యార్థులకు అడ్మిషన్ ఇచ్చి విద్యా వ్యాపారం చేస్తున్న పరిస్థితి. ఆ తరగతిలో విద్యార్థులు సరిపడా ఉన్నా, అడ్మిషన్ టెస్ట్ పెట్టీ ఫీజు వసూలు చేసి మార్కులు తక్కువ వచ్చాయి, సీటు ఇవ్వలేము అని వెనక్కి పంపించే పాఠశాలల యాజమాన్యాలు అనేకం ఉన్నాయి. మళ్లీ అడ్మిషన్ ఫీజు లేదా రిజిస్ట్రేషన్ ఫీజు అంటూ ఒక్కో పాఠశాలలో రూ.10 నుంచి రూ.25 వేల వసూలు, కళాశాలల్లో రూ.5వేల నుంచి రూ.8వేలు వసూలు ఇలా ఇష్టారాజ్యంగా లేని ఫీజులను సృష్టించి వసూలు చేస్తున్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ప్రతి పాఠశాల కళాశాలలో వారికి వారే నిర్ణయించుకొని 20 నుండి 25% ఫీజులు పెంచుకున్న పరిస్థితి. ఫీజుల నియంత్ర ణ చట్టం ప్రకారం ఏ పాఠశాలలో ఎంత ఫీజుల వసూలు చేస్తున్నారో ఆ పాఠశాల, కళాశాల ఆవరణ నోటీస్ బోర్డుపై పెట్ట డంలేదు, పేరెంట్స్ కమిటీలు వేయడం లేదు. టీచింగ్ సిబ్బం ది వివరాలు ప్రకటించడం లేదు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం మూలంగానే ఈ అడ్మిషన్ ఫీజులు, రిజిస్ట్రేషన్ ఫీజుల వసూళ్లు చేస్తున్నారు. అనేక పాఠశాలలు పుస్తకాలు, యూనిఫామ్, అన్ని రకాల స్టేషనరీ వస్తువులను పాఠశాలల ఆవరణలోనే అమ్ముతూ పాఠశాలలను సూపర్ మార్కెట్లుగా మార్చుతున్నారు. ఇక హాస్టల్ విద్యార్థులకు అదనపు ఫీజులు వసూళ్ల పేరుతో మరో 20 నుండి 25వేలు వసూలు చేస్తున్నా రు. చివరకు కొన్ని రెసిడెన్షియల్ కళాశాలల్లో విద్యార్థులకు తల్లిదండ్రులకు ఫోన్ చేసుకోవడానికి స్మార్ట్ కార్డులు ఇచ్చి రీఛార్జ్ చేసుకోవాలని కాయిన్ బాక్స్ దోపిడీ చేస్తున్నారు. ఇదంతా బహిరంగం గా చేస్తా ఉన్న విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడంలో, ఇలాంటి విద్యా వ్యాపారాన్నీ అరికట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. విద్యాశాఖ కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల, కళాశాలల అదనపు ఫీజు వసూళ్ల దోపిడీని అరికట్టాలి. విద్యాశాఖ తీసుకువచ్చిన ప్రతి జీవో ప్రతి విద్యాసంస్థలో అమలుచేసేలా చర్యలు తీసుకోవాలి.
ప్రైవేట్ పాఠశాల, కళాశాలల్లో అడ్మిషన్ ఫీజుల వసూళ్లు, పుస్తకాలు అమ్ముడు, అధిక ఫీజుల దోపిడీపై, నిబంధనలు పాటించని పాఠశాలలు, జూనియర్ కళాశాలలపై కఠినచర్యలు తీసుకోవాలి. విద్య అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *