Skip to content
తెలంగాణ వార్తలు

తెలంగాణ దిక్సూచి జయశంకర్‌ సార్‌

Prajapaksham 06 Aug 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
తెలంగాణ దిక్సూచి జయశంకర్‌ సార్‌

Telangana Compass Jayashankar Sir

దేవులపల్లి రమేశ్‌

ఆధిపత్యశక్తులపై అతడు వీరభద్రుడు, ఆలోచనల అవసరాన్ని తెలిపిన నిబద్ధుడు, తెలంగాణ కనుగొన్న అతడు మరో బు ద్ధుడు, అతడే ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ సార్‌, తెలంగాణను స్వప్నించి, శాసించిన మహోపాధ్యుడు జయశంకర్‌ సార్‌ వరంగల్‌ జిల్లా, ఆత్మకూరు మండలం అక్కన్నపేట గ్రామంలో లక్ష్మీ కాంతారావు, మహాలక్ష్మి దంపతులకు 1934 ఆగస్టు 6న జన్మించాడు. హనుమకొండలోని మార్కజీ పాఠశాలలో ప్రాథమిక విద్య నేర్చాడు. హనుమకొండ న్యూహైస్కూల్లో మాధ్యమిక వరకు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్‌.ఎస్‌.సి వరకు చదువుకున్నాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని బి.ఎ పూర్తి చేశాడు. బెనారస్‌ విశ్వవిద్యాలయం, అలీగడ్‌ విశ్వవిద్యాలయం నుండి పి.జి పూర్తి చేశాడు. సార్‌ పట్ల ఏ విధంగా స్పందించాలో, కానీ ఏ విధంగా ఉద్యమంగా తీర్చిదిద్దాలో నిరూపించే సంఘటన ఒకటి ఈయన విద్యాభ్యాస కాలంలో జరిగింది. అప్పట్లో వరంగల్‌లో డిగ్రీ కళాశాల లేదు. డిగ్రీ చదవాలంటే హైదరాబాదుకు వెళ్లాలి. లెక్చరర్స్‌ ప్రోద్భలంతో డిగ్రీ కాలే కావాలని విద్యార్థులు ఉద్యమించారు. అందులో మొదటి వరుసలో జయశంకర్‌ ఉన్నాడు. ఈ సంఘటన తర్వాత పదేళ్లకు డిగ్రీ కాలేజీ, 30 ఏళ్లకు యూనివర్సిటీ వచ్చింది. ఏదైతే డిగ్రీ కాలేజీ, యూనివర్సిటీ కోసం ఉద్యమం చేసిండో అదే యూనివర్సిటీకి ఆచార్య జయశంకర్‌ వైస్‌ ఛాన్సలర్‌ అయ్యా డు. ఉపాధ్యాయ వృత్తిలో అడుగు పెట్టడం ద్వారా ఉద్యోగ జీవి మొదలైంది. హనుమకొండలో ఉపాధ్యాయుడిగా నియామకమై, లెక్చర ఆదిలాబాద్‌కు పోయాడు. 1975- వరకు సికెఎం కళాశాల ప్రిన్సిపల్‌గా, బోర్డు మెంబర్‌గా సేవలందించాడు. 1982- వరకు సీఫేల్‌ రిజిస్టార్‌గా పని చేశాడు. 1991 వరకు కాకతీయ యూనివర్సిటీ వైస్‌ చా న్సలర్‌గా పనిచేశాడు. ఇవే కాక వివిధ ప్రభుత్వం ఉద్యోగాల్లో సంఘాల పదవుల్లో పనిచేసి తనదైన ముద్ర వేశాడు. ఇన్ని పదవుల్లో పనిచేసిన నాకు సికె ఎం కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేయడం ఎక్కువ తృప్తినిచ్చింది అని స్వయం గా అన్నాడు. మూడు దశలుగా సాగిన తెలంగాణ ఉద్యమంలో జయశంకర్‌ కీలక పాత్ర పోషించాడు. 1952లో ఇంటర్మీడియట్‌ విద్యార్థిగా తెలంగాణకు జై కొట్టి తరగతులను బహిష్కరించాడు. వరంగల్‌లో ఉద్యమం హైదరాబాద్‌లో కేంద్రీకృతమైంది. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధనకు వ్యూహాలు రచించారు.తెలంగాణ ఉ ద్యమానికి మూడు దశలు ఉన్నాయి. ‘మొదటిది భావజాల వ్యాప్తి. జరిగింది.రెండవది ఆందోళన కార్యక్రమం. అది కొనసాగుతున్నది. ఇక మిగిలింది రాజకీయ ప్రక్రియ అది జరగాల్సి ఉంది. దానిని పూర్తి చేయడమే ఉద్యమ కర్తవ్యం కావాలి. దానికి రాజకీయ చిత్తశుద్ధి అవసరము. ఇప్పుడు న్న రాజకీయ నాయకత్వం ఆ పని పూర్తి చేస్తుందని అని నేను నమ్ముతున్నా ను’ అని అన్నాడు. అతడు తెలంగాణ సిద్ధాంతకర్త. మొదటిది తెలంగాణ భా వజాల వ్యాప్తి. అది ప్రజలలో ఎంతగా పోయిందో జయశంకర్‌ ఒక రోజు ఇట్ల చెప్పిండు. ‘ఎందుకమ్మా తెలంగాణ అంటే? తెలంగా ణ వస్తే మా పొలాలకు నీళ్లు వస్తాయి, మా పోరగాళ్లకు కొలువులు వస్తాయి. అనే భావన వారికి కలిగిందీ ‘ చదువురాని ఆడవాళ్లు చెప్పిన మాటలు జ్ఞా పకం చేసుకున్నాడు. జయశంకర్‌ విద్యార్థి సంఘ నాయకుడు గొప్ప పరిపాలనాధక్షుడు. తెలంగాణ కోసం అహర్నిశలు శ్రమించిన కార్యశూరుడు. తె లంగాణ కోసం తెలంగాణ రాజకీయ నాయకులకు తన సహకారం అందించాడు. చెన్నా రెడ్డి నుండి చంద్రశేఖర్‌ రావు వరకు ప్రతి ఒక్కరి రాజకీయ పా ర్టీకి తన మేదో శ్రమను ధారపోశాడు. అయన ఆశించిన్నట్లే చివరగా రాజకీ య ప్రకియతో నే తెలంగాణ వచ్చింది. అందరిని తన మార్గంలో నడిపించా డు. అందుకే అతడు మార్గదర్శి. తెలంగాణకు చిరునామా, తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ సార్‌.