Lok Sabha Director Death: రూ.70 లక్షల అప్పు.. లోక్‌సభ సచివాలయ డైరెక్టర్ గౌరవ్ గౌతమ్ మృతి.. 15 పేజీల సూసైడ్ నోట్..
Lok Sabha Director Death: రూ.70 లక్షల అప్పు.. లోక్‌సభ సచివాలయ డైరెక్టర్ గౌరవ్ గౌతమ్ మృతి.. 15 సూసైడ్ నోట్..
మీకు లేదా మీకు తెలిసిన ఎవరికైనా తీవ్రమైన నిరాశ, మానసిక ఒత్తిడి లేదా ఆత్మహత్య ఆలోచనలు ఉంటే, వెంటనే కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం చాలా ముఖ్యం.
Lok Sabha Director Deat: లోక్‌సభ సచివాలయానికి చెందిన సీనియర్ అధికారి, డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్న 40 ఏళ్ల గౌరవ్ గౌతమ్ నోయిడాలోని తన నివాసంలో విగతజీవిగా కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ప్రాథమిక దర్యాప్తులో ఆయన తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, అప్పుల ఒత్తిడితో తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలం నుంచి 15 పేజీల చేతిరాత లేఖను స్వాధీనం చేసుకున్న అధికారులు, అందులో దాదాపు రూ.70 లక్షల అప్పుల గురించి ప్రస్తావించినట్లు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. గౌతమ్ భార్య బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాగానే అపార్ట్‌మెంట్ తలుపు లోపల నుంచి లాక్ అయి ఉండటం గమనించారు. పలుమార్లు పిలిచినా స్పందన లేకపోవడంతో భద్రతా సిబ్బంది సహాయంతో తలుపు తెరిచి చూడగా ఆయన స్పృహలేని స్థితిలో కనిపించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఘటన స్థలంలో లభించిన 15 పేజీల లేఖలో తన ఆర్థిక పరిస్థితి.. దాదాపు రూ.70 లక్షల అప్పుల గురించి గౌతమ్ వివరించినట్లు సమాచారం. ఈ అప్పుల్లో బ్యాంకు రుణాలు, వ్యక్తిగత రుణాలు, ప్రైవేట్ అప్పులు ఎంత మేర ఉన్నాయనే విషయాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అలాగే ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను పరిశీలిస్తూ ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు లేదా ఇతరుల ప్రమేయానికి సంబంధించిన ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. అయితే రుణాల వసూలు పేరుతో ఏమైనా ఒత్తిడి లేదా వేధింపులు ఎదుర్కొన్నారా అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది. కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, సన్నిహితులను ప్రశ్నిస్తూ, లేఖలోని ప్రతి అంశాన్ని ధృవీకరించిన అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన అధికారిక దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఆత్మహత్యకు గల కారణాలపై తుది నిర్ధారణకు పోలీసులు ఇంకా రాలేదు.
గమనిక: మీకు లేదా మీకు తెలిసిన ఎవరికైనా తీవ్రమైన నిరాశ, మానసిక ఒత్తిడి లేదా ఆత్మహత్య ఆలోచనలు ఉంటే, వెంటనే కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం చాలా ముఖ్యం.
- Gyanesh Kumar: ఎవరీ జ్ఞానేశ్ కుమార్ కుమార్…ఆయన నేపథ్యం ఏంటి..? గతంలో ఆయనపై ఉన్న ఆరోపణలేంటి..?
- Ritika Chopra: ఎవరీ రితికా చోప్రా..? ఎన్నికల సంఘం వ్యవహారం వెలుగులోకి తెచ్చిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
- Iran US Military Retreat: అమెరికా సైన్యాలు 500 కి.మీ. వెనక్కి? ఇరాన్ ఐఆర్జీసీ కమాండర్ సంచలన వ్యాఖ్యలు
- G7 oil reserves: చమురు ధరలపై ట్రంప్‌కు షాక్.. 10 కోట్ల బ్యారెళ్ల నిల్వలు విడుదలకు జి-7 నిర్ణయం
- 22A Lands: 22ఎ భూముల యజమానులకు గుడ్‌న్యూస్.. నాలా రుసుములు చెల్లిస్తే రిజిస్ట్రేషన్లకు అనుమతి