సమాజ మార్పు కోసం నిరంతర పోరాటాలు
Protest
కె.వి.ఎల్ – రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి,
అఖిలభారత శాంతి సంఘీభావ సంఘం
తెలంగాణ రాష్ట్ర కమిటీ -హైదరాబాద్
‘బీ ద చేంజ్ దట్ యు విష్ టు సి ఇన్ ద వరల్డ్ ’(Be the change that you wish to see in world) అని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారతదేశం లో జరుగుతున్న స్వాతంత్య్ర పోరా టం సందర్భంలో మహాత్మా గాంధీ చెప్పిన మాటలు ఎంతో స్ఫూర్తిమంతమైనవి.
ఆ మాటల లోతుల్లోనే ఆనాడు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న భారతదేశ పౌరుల్లో బలమైన లక్ష్యం దాగి ఉన్నది. సరిగ్గా ఇప్పుడు ఆ మాటలను మళ్లీ మనం మననం చేసుకోవాలి. ఆ మాటలు ఇప్పటికీ ఈ దేశ ప్రజలను మేలుకొలుపుతున్నట్లు, మార్పు కొరకు పోరాడండి అనే పిలుపునిస్తున్నట్లుగానే ఉన్నవి. ఆ మాటల సందేశాన్ని నిజాయితీగా, నిండు మనసుతో ,నిస్వార్ధంగా అర్థం చేసుకోవాలి. మన దేశాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థ ను, రాజ్యాంగాన్ని రక్షించుకోవటానికి ఆనాటి స్వాతం త్య్రయోధుల పోరాటాలు ,త్యాగాల, స్ఫూర్తినీ మరియు ‘క్విట్ ఇండియా ఉద్యమం’ 84వ వార్షికోత్సవం సందర్భంగా ఆ పోరాటాల స్ఫూర్తిని మన గుండె నిండా నింపుకొని ,భారతదేశంలో మనం కోరుకున్న మార్పు కొరకు, – సుస్థిర శాంతి, -ప్రగతి కొరకు- దేశమంత సమైక్యంగా ఉద్యమించవలసిన సందర్భం ఇది.
ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో భారతదేశం భూమి మీద కాలు పెట్టిన బ్రిటిష్ పాలకులు మన దేశ సంపదను కొల్లగొట్టారు. ఈ దేశ ప్రజలను బానిసలుగా తయారు చేసుకున్నారు. జాతి వివక్షతతో భారతదేశ పౌరులను హింసలకు గురి చేశారు. వేధించారు, భారతదేశ గౌరవాన్ని, ప్రతిష్టను ,నాగరికతను సామ్రాజ్యవాద ఉక్కు పాదాల కింద తొక్కిపెట్టారు. మన దేశ పౌరులను మనిషిగా తలెత్తుకొని బతకలేని ప్రపంచంలోకి ,పేదరికంలోకి ,అగాధంలోకి నెట్టివేశారు . బ్రిటిష్ వారి వ్యాపా విస్తరణకు ఉపయోగపడే ముడి సరుకుగా , సరుకులు లభ్యమయ్యే కేంద్రంగా ఈ దేశాన్ని వాడుకున్నారు. భారతీయుల గుండె మండింది. పిడికిళ్ళు బిగించారు. కండ్లు ఎర్ర చేశారు. పిక్కల్లో బలాన్ని పెంచుకున్నారు. ఒక్కొక్కరుగా ఆది నుండి స్వేచ్ఛ, స్వాతంత్య్రం, మానవ హక్కుల గురించి అడిగే ధైర్యాన్ని సంతరించుకున్నారు .మొత్తంగా బ్రిటిష్ సామ్రాజ్యవాద వలసవాద పాలనకు వ్యతిరేకంగా పోరాటంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి ఎదురొడ్డి మా దేశాన్ని మేమే పాలించుకుం టాం. మాకు స్వాతంత్య్రం కావాలి అని భారతదేశమంతటా దిక్కులు పిక్కటిల్లేలా సింహ గర్జన చేశారు.ప్రపంచంలో మొట్టమొదటి సోషలిస్టు దేశ నిర్మాణానికి నాయకత్వం వహించిన మహనీయుడు కామ్రేడ్ లెనిన్ స్ఫూర్తివంతమైన ఉపన్యాసాలు ,దూర దృష్టి, ప్రపంచాన్ని మొ త్తం వెలుతురు వైపు నడిపించాయి. స్వాతంత్ర పోరాటాలకు బలాన్ని ఇచ్చాయి. సామ్రాజ్యవాదానికి, యుద్దోన్మాదానికి వ్యతిరేకంగా నడిచే శక్తిని, యుక్తిని, సిద్ధాంతా అందించాయి. ఆ వరుసలోనే భారత దేశంలో స్వా పోరాటం సాగింది. పోరాటంలో భాగంగా సాగి స్వదేశీ ఉద్యమం, జలియన్ వాలాబాగ్ ఉద్యమం, పౌర శాసనోల్లంఘన ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం లాంటి ఎన్నో రూపాలలో ఉద్యమాలు నిర్వహించబడ్డా యి. స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీ అహింసా విధా నం ప్రసిద్ధిగాంచింది. చివరకు 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది.
నాడు స్వాతంత్య్ర పోరాటంలో భాగంగానే నిజాం నవాబుకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఎంతోమంది విద్యార్థులు, యువకులు ,సామాన్య ప్రజానీకం ,మహిళలు, కార్మికులు, వీరోచితంగా ధైర్యంగా, బానిసత్వానికి వ్యతిరేకంగా , నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడినారు . ముక్క రాని ప్రజలు సైతం తమ జీవితాలు మా ర్పు కోసం, సమాజ మార్పు కోసం , పోరాడి ఎన్నో త్యా గాలు చేశారు . ఫలితంగా నిజాం నవాబు గద్దె దిగి, రా జరికాన్ని వదులుకొని పారిపోవాల్సి వచ్చింది. ఆ పోరాటం సమాజంలో ఎన్నో మార్పులకు నాంది పలికిం ది.. వారి ధైర్యం వారి వీరత్వం నేటికీ ఆదర్శనీయమైనది. ఇప్పుడు మళ్లీ ఆ స్వాతంత్య్ర పోరాట వీరుల చరిత్ర ను, స్వాతంత్య్ర పోరాట లక్ష్యాలను, చరిత్ర అనుభవాలను గురించి జన్ జి తరం కూడా మాట్లాడుకుంటున్నా రు. తమ జీవితాల్లో మార్పు కొరకు విద్యార్థులు యువత రోడ్లమీద కొచ్చి నిలువెత్తు ప్రశ్నలై పాలకులకు ఎదురు నిలబడి చెమటలు పట్టిస్తున్నారు. ఈ సమాజం మారదు అని మొండిగా చెప్పే నిద్రపుచ్చే నిరాశవాదుల, ప్రగతి నిరోధకుల మెదడు తుప్పు వదలగొట్టే కాలం వస్తుంది . సమాజ మార్పును ఎవరు ఆపలేరు అన్న సత్యం దేశమంతటా మారుమ్రోగుతున్నది.
ఈ సందర్భంగా మనం 1942 ఆగస్టు 8వ తేదీన గ్వాలియర్ ట్యాంక్ మైదాన్ లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చేసిన క్విట్ ఇండియా తీర్మానం గురించి కూడా గుర్తు చేసుకోవాలి . కమ్యూనిస్టు సిద్ధాంతకర్త కారల్ మార్క్స్ ‘ప్రపంచ కార్మికులారా ఏకంకండి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప’ అని పిలుపునిచ్చినట్లుగా, మహాత్మా గాంధీ కూడా ఆగస్టు 8వ తేదీన చా వోరేవో ( డు ఆర్ డై )అనే సాహసోపేతమైన పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపు భారతదేశ ప్రజానీకాన్ని ఉత్తేజపరిచింది. ఆ ప్రభావాన్ని పసిగట్టిన ఆంగ్లేయులు అర్ధరాత్రి తర్వాత గాంధీని, ఇతర అగ్ర నాయకులు అందరినీ అరెస్టు చేయడం జరిగింది. ఆగస్టు 9వ తారీఖున పిలుపుని అందుకున్న ప్రజానీకం మదిలో ‘పోరాడుదాం వస్తే స్వాతంత్య్రం వస్తది, -పోతే తన ప్రాణాలు పోతాయి‘ అని నిర్ణయించుకున్నారు. చావో బతుకో తేల్చుకుందాం అన్నట్లుగా సింహ గర్జన చేస్తూ బ్రిటీష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా అనే నినాదాలు చేశారు.
బొంబాయి విద్యార్థి యువజనులు ప్రజల ప్రదర్శనలతోటి హోరెత్తిపోయింది. ఆజాద్ మైదాన్‌లో కమ్యూనిస్టు యువకిశోరం అరుణా అసఫాలీ ప్రాణాలకు తెగిం జాతీయ జెండా ఎగురవేసి వీరనారిగా చరిత్ర సృష్టించారు. ఆగస్టు 11న పాట్నా సెక్రటేరియట్ పై జాతీయ జాతీయ జెండాలను ఎగరవేయడానికి వందలాది మంది విద్యార్థులు ప్రదర్శనగా వెళ్లారు .ఈ సందర్భంగా వారి బ్రిటిష్ పోలీసులు క్రూరంగా కాల్పులు జరిపారు .ఆ కాల్పుల్లో ఏడుగురు విద్యార్థులు వీరమరణం చెందారు. ఆ స్థలం షాహిద్ స్మారక స్థలంగా ప్రఖ్యాతిగాంచింది. అంతేకాదు ఉత్తర ప్రదేశ్ లోని బాలియా ప్రజ సమాంతర ప్రభుత్వాన్ని నడిపించారు .అక్కడ అరెస్టు జరిగాయి.బెంగాల్లోని తుములూకు,మిడ్నాపూర్‌లో మా తంగి జాతీయ హజర్‌లో వందలాదిమంది విద్యార్థులు,ప్రజానీకం ఊరేగింపులు చేశారు, 72 ఏండ్ల స్వాతంత్య్ర యోధుడు త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని ప్రదర్శనలో వెళ్తుండగా పోలీసులు పాశవికంగా కాల్చి చంపారు. వందేమాతరం – వందేమాతరం అంటూ నినదించి కన్నుమూసాడు. ఇలాంటి ఎన్నో వీరోచిత సంఘటనలు, వీర మరణాలు, స్వాతంత్ర పోరాటం కనిపిస్తాయి. క్విట్ ఇండియా ఉ ద్యమంలో వినిపిస్తా ఆనాడు ఆ వీరులు దేశం కోసం త్యాగం చేశారు ! ఆనాటి లక్ష్యం నెరవేరింది. స్వాతంత్య్రం వచ్చింది. కా స్వాతంత్ర ఫలాలు ఈ భారత దేశ సామాన్య ప్రజానీకానికి దక్కుతున్నయా? స్వాతంత్య్ర లక్ష్యాలను పాలకు అమలు చేస్తున్నారా? నిరుద్యోగము, అంటరానితన మతోన్మాదము, పేదరికం, అసమానతలు రూపుమాపబడ్డాయా ? విద్య, వైద్యం ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చాయా? ఈ విషయాలపై అఖిలభారత శాంతి సంఘీభావ సంఘం దేశమంతటా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంది. భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ప్రజలను చైతన్య పరుస్తూ దేశమంతటా పాదయాత్రలు, ప్రదర్శనలు నిర్వహిస్తూ ‘బదులావ్ హై’ అంటూ ఉక్కు సంకల్పంతో ముందుకు సాగుతుంది. ఉన్నవాడు లేనివాడు అనే వ్యత్యాసాలు లేని మహోన్నత సమాజం రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. యువకులు పోరాట శక్తులుగా మార్చి. ఎర్రబారిన కండ్ల పిడి కిళ్లను బిగించి ఆత్మవిశ్వాసంతో మార్పు కోసం ముందుకు పెద్ద అడుగు వేస్తున్నారు. ఈ సమాజం మారదనే వాదానికి తావులేదు. మార్పు తథ్యం అంటూ పెద్ద నోటితో బిగ్గరగా అరిచి తమ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు.