Skip to content
తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం

Prajapaksham 13 Jun 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం

Hyderabad: Flight Operations Disrupted at Shamshabad Airport

హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) లో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా ప్రతికూలంగా మారడంతో, విమాన ల్యాండింగ్‌కు పరిస్థితులు అనుకూలించడం లేదని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రయాణికుల భద్రతను దృష్ట్యా అధికారులు అప్రమత్తమై పలు విమాన సర్వీసులను తాత్కాలికంగా ఇతర నగరాలకు దారి మళ్లించారు.

ముఖ్యంగా ముంబయి, దిల్లీ, వారణాసి, బెంగళూరులతో పాటు సింగపూర్ నుంచి హైదరాబాద్ రావాల్సిన విమానాలపై ఈ వాతావరణ ప్రభావం పడింది. ల్యాండింగ్ కోసం గగనతలంలోనే వేచి ఉండాల్సిన పరిస్థితి రావడంతో, కొన్ని విమానాలకు తాత్కాలికంగా అనుమతి నిరాకరించి సమీపంలోని విమానాశ్రయాలకు మళ్లించారు. షెడ్యూల్ ప్రకారం ల్యాండ్ కావాల్సిన విమానాలు దారి మళ్లడం, మరికొన్ని సర్వీసులు ఆలస్యం కావడంతో విమానాశ్రయంలోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *