ఇడ్లీలు దూది పింజల్లా మెత్తగా రావాలా? అయితే పిండిని ఇలా తయారు చేయండి.. ప్రతి సారి సూపర్ సాఫ్ట్ ఇడ్లీలు మీ కోసం..
ఇడ్లీలు దూది పింజల్లా మెత్తగా రావాలా? అయితే పిండిని ఇలా తయారు చేయండి.. ప్రతి సారి సూపర్ సాఫ్ట్ ఇడ్లీలు మీ కోసం..
మనం సాధారణంగా హోటల్లో ఇడ్లీలు చూసినప్పుడు అవి చాలా మెత్తగా . మృదువుగా ఉంటాయి అలాంటి ఇడ్లీలను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలా అని ఆలోచిస్తున్నారా అయితే కొన్ని చిట్కాలను పాటించినట్లయితే ఇంట్లోనే మీరు చక్కగా ఇలాంటి ఇడ్లీలను తయారు చేసుకోవచ్చు అది ఎలాగో తెలుసుకుందాం. దూది పింజాల్లాంటి మెత్తని, మృదువైన ఇడ్లీలు కావాలంటే ముందుగా ఏం చేయాలో తెలుసుకుందాం. సూపర్ సాఫ్ట్ ఇడ్లీలు రావాలంటే పిండిని రుబ్బుకునే విధానంలోనే అసలైన మ్యాజిక్ ఉంటుంది. ఇందుకోసం పాటించాల్సిన చిట్కాలు చూద్దాం.
కావలసిన పదార్థాలు
గుండు మినపప్పు: 1 కప్పు
ఇడ్లీ రవ్వ: 2 కప్పులు
అటుకులు: 1/4 కప్పు
1 టేబుల్ స్పూన్ మెంతులు)
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్లు: తగినన్ని
పిండి తయారీ విధానం
మినపప్పును 2-3 సార్లు శుభ్రంగా కడిగి, సరిపడా నీళ్లు పోసి కనీసం 5 నుండి 6 గంటలు నానబెట్టండి. నానబెట్టేటప్పుడే మినపప్పులో పావు కప్పు అటుకులు లేదా కొన్ని మెంతులు వేయండి. ఇవి ఇడ్లీలకు మంచి మెత్తదనాన్ని, తెల్లదనాన్ని ఇస్తాయి. ఇడ్లీ రవ్వను కూడా విడిగా 2-3 గంటల ముందు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి.
నానబెట్టిన మినపప్పును గ్రైండర్ లేదా మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. వీలైతే గ్రైండర్ ఉపయోగించండి, పిండి బాగా పొంగుతుంది. నీళ్లను ఒకేసారి పోయకుండా, కొద్దికొద్దిగా చల్లటి నీళ్లు చిలకరిస్తూ పిండిని చాలా మెత్తగా, వెన్నలా రుబ్బుకోవాలి.
నానబెట్టిన ఇడ్లీ రవ్వలోని నీటిని పిండి పిండిగా పిండేసి, రుబ్బుకున్న మినప పిండిలో వేయండి. పిండిని, రవ్వను బాగా కలపండి. ఈ పిండిని మూతపెట్టి, వెచ్చని ప్రదేశంలో 8 నుండి 10 గంటల పాటు లియబెట్టాలి. పిండి రెట్టింపు అయ్యి నూరంతా బుడగలతో వస్తే పర్ఫెక్ట్ వచ్చినట్లు.
పిండి రుబ్బిన వెంటనే ఉప్పు కలపండి ఇడ్లీలు వేసే ముందు ఉప్పు కలపడం మంచిది. ఇడ్లీ పాత్రలో నీళ్లు బాగా మరిగిన తర్వాతే ఇడ్లీ ప్లేట్లను ఉంచాలి. మీడియం మంటపై 10-12 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఎక్కువ సేపు ఉడికించినా ఇడ్లీలు గట్టిగా మారుతాయి.
పొయ్యి ఆపిన తర్వాత 2-3 నిమిషాలు ఆగాలి. ఆవిరి తగ్గాక చేతిని కొద్దిగా చల్లటి నీళ్లలో ముంచి ఇడ్లీలను తీస్తే ప్లేట్‌కి అంటుకోకుండా, దూదిలా విడివస్తాయి. ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తూ పిండి తయారు చేసుకుంటే, ప్రతిసారీ నోట్లో వేస్తే కరిగిపోయే సూపర్ సాఫ్ట్ దూది పింజల్లాంటి ఇడ్లీలు మీ సొంతం..