Skip to content
ప్రపంచం వార్తలు

Iran War Update: హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ కొత్త హెచ్చరిక.. అనుమతి లేకుండా కొత్త జలమార్గాలు వాడొద్దు

Prajapaksham 25 Jun 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
Iran War Update: హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ కొత్త హెచ్చరిక.. అనుమతి లేకుండా కొత్త జలమార్గాలు వాడొద్దు

ai generated image

టెహ్రాన్: హోరుజ్ జలసంధిలో టోల్ ఫీజు వ సూలు చేసే విషయంపై అమెరికా- ఇరాన్ మధ్య వివాదం, వాగ్వాదం రోజు రోజుకూ ముదురుతో ౦ది. హోర్యుజ్ లో ఎలాంటి సుంకాలు, ఫీజులు న సూలు చేయడాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకి స్తుండగా, కొత్త జలమార్గాల అంశం తెరమీదకు రావడంతో ఉద్రిక్తతలు మళ్ళీ పెరిగాయి. సుంకా లు లేదా ఫీజులను తిరస్కరిస్తున్నట్లు ట్రంప్ ప్రక టించారు. ఒప్పందానికి కట్టుబడి ఉండాలని హె చ్చరించారు. ఈ పరిస్థితులు ఒప్పందం అమలుపై ప్రభావం పడతాయన్న భయాలు వ్యక్తమవుతున్నా యి. ఈ దశలో ఒకవైపు బహ్రెన్లో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగమంత్రి మార్కో రుబియా, గల్ఫ్ మిత్రదేశాలకు పూర్తి రక్షణ కల్పిస్తామని ప్రకటించగా, జలసంధిపై ఇరాన్ మరింత ఎక్కు వగా తన పట్టు బిగించింది.

ఇరాన్ తో సంప్రదించ కుండా హోర్భుజ్ జలసంధి దాలేందుకు కొత్త మార్గాలను ఏర్పాటు చేయడంపై ఆ దేశ పాలకులు మండిపడ్డారు. తమకు చెప్పకుండా నిషేధిత జల మార్గాలను నౌకలు ఉపయోగించడం ఎంత మాత్రం సమ్మతం కాదని విమర్శించారు. ఇరాన్ నిర్దేశించిన జలమార్గాలనే నౌకలు ఈ జలసంధిలో రాకపోకల నిమితం ఉపయోగించాలని, ఛానల్-16 మార్గంలోనే ప్రయాణం చేయాలని సముద్రయాన నిర్వాహకులను కోరింది. ప్రయాణ సమయంలో ప్రతినౌకా తమతో సమన్వయంతో వ్యవహరించాలని, తనకు అందుబాటులో ఉండాలని లేకపోతే ప్రమాదం సంభవిస్తుందని ఇస్లామిక్ 5వల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్ జిసి) హెచ్చరిం చింది. వ్యూహాత్మకంగా గతంలో తాము ప్రకటిం చిన మార్గాలే అధీకృత మార్గాలని తెలియజేసింది.

తమ ఆదేశాలను ఉల్లంఘించి కొత్త నౌక మార్గ్చా లలో ప్రయాణం చేసినట్లు తెలిస్తే అలాంటి నౌక లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తాము నిర్దేశించిన జలమార్గాలలో మాత్రమే నౌకలు ప్రయాణం చేయాలని, మిగిలిన దారులు చెల్లుబాటు కాబోవని హెచ్చరిక చేసింది. ఒకవేళ మిగతా దారులను ఉపయోగిస్తే తీవ్ర ప్రమాణాలు ఎదురవుతాయని గురువారం తెల్లవారుజామున విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. హోర్బుజ్ జలసంధి నీళ్ళలోపల యుద్ధ సమ యంలో ఇరాన్ చాలాచోట్ల మందుపాతరలను అమర్చింది. వీటిని తొలగించడం మహాకష్టమైన పని, దీనికి అతిపెద్ద సంప్రదింపుల యంత్రాంగం కూడా అవసరం.

ఇరాన్ ప్రతిష్ఠ పెరిగింది: పెజెషియన్ శత్రువు చేతిలో పావుగా మారవద్దని ఇరాన్ ప్రజలకు ఆ దేశాధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ హెచ్చ రించారు. టెహ్రాన్ సమీపంలో ఇమామ్ ఖమేనీ సమాధివద్ద మాట్లాడుతూ, ప్రజలు ఇక్యత ప్రద ర్శించాలన్నారు. అమెరికాతో యుద్ధం తర్వాత కరాన్ ప్రతిష్ట పెరిగిందని, ముస్లిం దేశాల ఐక్యత పెంపొందించడం, ఇరాన్ ప్రతిష్ఠ పెంచడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇతర ముస్లిం ప్రపంచం కూడా ఇరాన్ బలమైన సంబంధాలను కోరుకుంటోందంటూ పాకి స్థాన్, లెబనాన్ దేశాలను ప్రస్తావించారు. యుద్ధ సమయంలో ఇరాన్ సైన్యం ఎంతో సమన్వ యంతో వ్యవహరించి శత్రువుతో పోరాడిందన్నారు. జాతీయ ఐక్యతను కాపాడాలన్నారు.

సాధారణ స్థాయికి చేరిన చమురు ధరలు
దుబాయ్: హోర్ముజ్ జలసంధిలో చమురు నౌకల రాకపోకల పునరుద్ధరణ, కార్యకలాపాలలో క్రియాశీలత బాగా పెరగడంతో చమురు ధరలు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. యుద్ధంముం దునాటి పరిస్థితికి చమురు ధరలు చేరాయని అంతర్జాతీయ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారల్ ధర 72.50 డాలర్లు, డబ్యుటిఐ ధర 69.02 డాలర్లకు చేరకుంది. ఈ ఏడాది ప్రబ్రవరి 28న ఇరాన్ పై అమరికా దాడులు ప్రారంభించడానికి ముందు ప్రామాణికమైన బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్ కు 72.48 దాల ర్లుగా ఉండేది. ఇరాన్ అయి కార్యక్రమాన్ని అదుపు చేయడానికి, ఇతర సమస్యల పరిష్కారానికి ఒక తుది ఒప్పందానికి వచ్చేందుకు 60 రోజుల కాలపరిమితిలో చర్చలు పూర్తిచేయడానికి ఒక బృహత్తర ప్రణాళి కపై అమెరికా-ఇరాన్ అంగీకారం తెలి యజేశాయి.

జూన్ 17న తాత్కాలిక ఎంఓయుపై సంతకాల ప్రక్రియ పూర్త యినప్పటినుండీ ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు గణనీయస్థాయిలో వేగంగా క్షీణిస్తూ వస్తున్నాయి. ఇటీవలి రోజుల్లో ఈ జలమార్గం మీదుగా ద్రవీకృత సహజ వాయువు, ఎరువులు, ఇతర వ్యవసాయ పరిక రాలు. ఆర్ధిక వ్యవస్థను మెరుపరచే ఉత్పత్తుల రవాణా వేగం పుంజుకున్నాయి. యుద్ధ సను యంలో ఇరాన్ ఏర్పాటు చేసిన మందుపాతరలను తప్పించుకుని వెళ్ళేందుకు అమెరికా రవాణా నిమిత్తం ప్రత్యేక మార్గదర్శనం చేసింది. ఐతే ఈ జలసంధిలో ఇప్పటికీ చాలా తక్కువగానే నౌకలు. ప్రయాణం చేస్తున్నాయి. సాధారణ రాకపోకలకు ఇంకా సమయం పడుతుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు ఇవే: FAQs

Q. హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఎందుకు హెచ్చరిక చేసింది?
A. ఇరాన్ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా జలమార్గాలను ఉపయోగించవద్దని తాము నిర్దేశించిన మార్గాల్లోనే నౌకలు ప్రయాణించాలని ఇప్పటికే ఇరాన్ ప్రత్యేక సైనిక విభాగం ఐఆర్‌జీసీ హెచ్చరించింది.

Q. అమెరికా-ఇరాన్ వివాదం వల్ల చమురు ధరలపై ప్రభావం ఉందా?
A. ఈ వివాదం నడిచినంతకాలం చమురు ధరల పైన తీవ్ర ప్రభావం చూపించింది అని చెప్పవచ్చు చాలా రోజుల తర్వాత 100 డాలర్లను దాటి ముందుకు వెళ్ళింది. భారతదేశంలో పెట్రోల్ డీజిల్ అలాగే ఎల్పిజి గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి.

Q. హోర్ముజ్ జలసంధి ఎందుకు కీలకం?
A. ఈ జల సంధి ద్వారానే ప్రపంచంలో సుమారు 20% పైగా క్రూడ్ ఆయిల్ రవాణా సరఫరా జరుగుతుంది అందుకే ఇది అంత కీలకం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *