Sreeleela: ఐరన్ లెగ్ ముద్ర పడుతోందా..? శ్రీలీల చేతిలోంచి వరుసగా జారిపోతున్న అవకాశాలు..!
మొన్నటి వరకు టాలీవుడ్లో తిరుగులేని హీరోయిన్గా పేరు సంపాదించుకున్న శ్రీలీల ఇప్పుడు నెమ్మదిగా ఫేడ్అవుట్ అవుతోందా? అనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. ఒకప్పుడు వరుస అవకాశాలతో బిజీగా ఉన్న ఈ భామ చేతిలోంచి ఇప్పుడు పెద్ద ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా చేజారిపోతున్నాయి. దీంతో ఆమె కెరీర్‌పై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సాధారణంగా విజయవంతమైన హీరోయిన్లతో పనిచేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతుంటారు. పెద్ద హీరోలు కూడా సక్సెస్ ట్రాక్‌లో ఉన్న హీరోయిన్లకే ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే కెరీర్ ప్రారంభంలో వరుస విజయాలు అందుకున్న శ్రీలీల, ఆ తర్వాత వరుస పరాజయాలను ఎదుర్కోవడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీంతో ఇప్పటికే ఖరారైన అవకాశాలు కూడా చివరి నిమిషంలో చేజారిపోతున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.
తాజాగా తమిళ స్టార్ హీరో అజిత్ కథానాయకుడిగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో మొదట శ్రీలీలను హీరోయిన్గా ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే తర్వాత ఆమె స్థానంలో ఖయాదు లోహార్‌ను తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం శ్రీలీల చేతిలో పెద్దగా ప్రాజెక్టులు లేని సమయంలో ఈ అవకాశం కూడా చేజారిపోవడం ఆమె కెరీర్‌కు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
ఇది మొదటిసారి కాదు. అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’ సినిమాలో కూడా మొదట శ్రీలీలనే హీరోయిన్గా ఎంపిక చేశారు. సినిమా ప్రారంభ వేడుకల్లో అఖిల్, శ్రీలీలపై ప్రత్యేక టీజర్ కూడా విడుదల చేశారు. కానీ తర్వాత డేట్ల సమస్యల కారణంగా ఆమెను తప్పించి భాగ్యశ్రీ బోర్సేను తీసుకున్నారు. ప్రస్తుతం ఆ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతుండటంతో శ్రీలీల కోల్పోయిన అవకాశాల జాబితాలో మరో సినిమా చేరింది.
అంతకుముందు విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్డమ్’ చిత్రంలో కూడా మొదట శ్రీలీల పేరు వినిపించింది. అయితే ఆ ప్రాజెక్ట్‌లో కూడా చివరికి భాగ్యశ్రీ బోర్సేకే అవకాశం దక్కింది. అలాగే నవీన్ పొలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రంలోనూ మొదట శ్రీలీలనే హీరోయిన్గా అనుకున్నప్పటికీ, చివరికి ఆమె ఆ ప్రాజెక్ట్‌లో కనిపించలేదు.
టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్లో కూడా ఆమెకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కుతున్న ‘జవానీ తో ఇష్క్ హోనా హై’ చిత్రంలో శ్రీలీల పేరు బలంగా వినిపించినా, చివరి నిమిషంలో ఆమె స్థానంలో మరో హీరోయిన్ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది.
ఇలా వరుసగా అవకాశాలు చేజారిపోవడంతో శ్రీలీలపై “ఐరన్ లెగ్” అనే ముద్ర పడుతోందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే దీనికి అభిమానులు మాత్రం అంగీకరించడం లేదు. సరైన కథ, సరైన విజయం దొరికితే శ్రీలీల మళ్లీ ఫామ్‌లోకి రావడం పెద్ద విషయం కాదని వారు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం శ్రీలీల ఆశలన్నీ ధనుష్ నటిస్తున్న ‘ఓం’ సినిమాపైనే ఉన్నాయి. అయితే ఇందులో ఆమె ప్రధాన హీరోయిన్ కాదు. సాయి పల్లవి ప్రధాన కథానాయికగా నటిస్తుండగా, శ్రీలీల మరో కీలక పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ప్రధాన ప్రాజెక్ట్ ఇదే కావడంతో ఈ సినిమాపైనే భారీ అంచనాలు పెట్టుకుంది.
మరి ఈ సినిమా శ్రీలీల కెరీర్‌కు మళ్లీ ఊపిరి పోస్తుందా? లేక అవకాశాలు చేజారిపోతున్న పరంపర కొనసాగుతుందా? అన్నది వేచి చూడాల్సిందే.