Skip to content
వినోదం వార్తలు

నాకు ఒకే ఒక్క కూతురే ..పేరు మనమ్మ’ అంటున్న రవితేజ

Prajapaksham 22 Jul 2026 1 నిమిషాల పఠనం వినోదం
నాకు ఒకే ఒక్క కూతురే ..పేరు మనమ్మ’ అంటున్న రవితేజ

Ravi Teja starts dubbing for Irumudi; Second single to be released soon

రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఇరుముడి పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ గ్లింప్స్‌తో సినిమాపై ఆసక్తిని పెంచిన మేకర్స్, ఆ తర్వాత విడుదల చేసిన తొలి పాట ‘ఇరుముడి కట్టు’తో ఆకట్టుకున్నారు. అయ్యప్ప స్వామిపై భక్తి భావాన్ని ఆవిష్కరించిన ఆ పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసిన రవితేజ ఇప్పుడు ఈ సినిమా డబ్బింగ్ పనులు కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన డబ్బింగ్ స్టూడియో వీడియో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. వీడియోలో “నాకు ఒకే ఒక్క కూతురే… పేరు మనమ్మ” అంటూ రవితేజ ఎంతో ఎమోషనల్‌గా చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఆ ఒక్క డైలాగ్‌తోనే సినిమాలో తండ్రి-కూతురు మధ్య ఉండే బలమైన అనుబంధాన్ని దర్శకుడు చూపించబోతున్నారనే ఆసక్తిని మరింత పెంచారు. ఈ వీడియోలో బేబీ నక్షత్ర, దర్శకుడు శివ నిర్వాణ కూడా కనిపించారు.ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా, కేవలం మూడు రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సైమల్టేనియస్‌ గా జరుగుతున్నాయి. దీంతో సినిమా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఆగస్టు 21న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ రీ-రికార్డింగ్ పనులు కూడా ప్రారంభించారు. అలాగే సినిమా నుంచి రెండో పాటను త్వరలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఈ చిత్రంలో, బేబీ నక్షత్ర వారి కుమార్తె పాత్రను పోషిస్తోంది. అలాగే సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక కీలక పాత్రల్లో కనిపించనున్నారు.నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా నిలవనుంది. ఈ చిత్రానికి సంగీతం: జివి ప్రకాష్ కుమార్. డీఓపీ : విష్ణు శర్మ, రెడిటింగ్: ప్రవీణ్ పూడి, స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్: నరేష్ బాబు పి.