72st National Films Awards: జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన కల్కి, పుష్ప-2…ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రోళ్లు…
భారతీయ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాలలో ఒకటైన ’72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటించారు. 2024 సంవత్సరపు అత్యుత్తమ చిత్రాలు, కళాకారులను గౌరవిస్తూ, విజేతలను ఈరోజు, జూలై 18న అధికారికంగా ప్రకటించారు. ‘చందూ ఛాంపియన్’ చిత్రానికి గాను కార్తీక్ ఆర్యన్, ‘బ్రహ్మయుగం’ చిత్రానికి గాను మమ్ముట్టిని ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ‘సంపూర్ణ వినోదాన్ని అందించే ఉత్తమ చలనచిత్రం’గా ‘కల్కి 2898 AD’ ఎంపిక కాగా, ‘ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రోళ్లు ఎంపిక అయ్యింది. ఉత్తమ బాలల చిత్రంగా 36 చిన్న కథ కాదు కూడా ఎంపికైంది.
జాతియ అవార్డులు దక్కించుకున్న టాలివుడ్ చిత్రాలు ఇవే..
ఉత్తమ తెలుగు చిత్రం: కమిటీ కుర్రాళ్లు
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: కల్కి 2898 ఏడీ (దర్శకుడు: నాగ్ అశ్విన్)
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: సుకుమార్ (పుష్ప 2)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: దీపాలి నూర్, సీతల్ శర్మ (పుష్ప 2)
ఉత్తమ స్క్రీన్ ప్లే (సంభాషణలు): వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ మేకప్: పి. రవికుమార్ (కమిటీ కుర్రాళ్లు)
ఉత్తమ బాలనటుడు (షేర్డ్): అరుణ్ దేవ్ పోతుల (చిత్రం: చిన్న కథ కాదు)
ఉత్తమ బాలల చిత్రం: 36 చిన్న కథ కాదు (దర్శకుడు: నంద కిషోర్ ఇమాని)
ప్రధాన విభాగాల్లో విజేతలు (ఫీచర్ ఫిల్మ్స్):
ఉత్తమ చిత్రం: ఆర్టికల్ 370 (హిందీ)
ఉత్తమ నటుడు (షేర్డ్): కార్తిక్ ఆర్యన్ (చందూ ఛాంపియన్ – హిందీ), మమ్ముట్టి (భ్రమయుగం – మలయాళం)
ఉత్తమ నటి: యామి గౌతమ్ (ఆర్టికల్ 370)
ఉత్తమ దర్శకుడు: రాజ్ కుమార్ పెరియసామి (చిత్రం: అమరన్ – తమిళ్)
ఉత్తమ సహాయ నటుడు: సంజయ్ మిశ్రా (భక్షక్ – హిందీ)
ఉత్తమ సహాయ నటి (షేర్డ్): రూపశ్రీ వర్కాడే (మిథ్య – కన్నడ), సచన నమిదాస్ (మహారాజ – తమిళ్)
ఇతర భాషల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు:
ఉత్తమ తెలుగు చిత్రం: కమిటీ కుర్రాళ్లు
ఉత్తమ తమిళ చిత్రం: రాయన్
ఉత్తమ మలయాళ చిత్రం: ఫెమినిచ్చి ఫాతిమా
ఉత్తమ కన్నడ చిత్రం: మిథియా
ఉత్తమ హిందీ చిత్రం: శ్రీకాంత్
ఉత్తమ మరాఠీ చిత్రం: ముక్కమ్ పోస్ట్ బొంబిల్ వాడి
ఉత్తమ బెంగాలీ చిత్రం: చలిచిత్ర ఎకోన్
ఉత్తమ గుజరాతీ చిత్రం: మారన్
ఉత్తమ ఒడియా చిత్రం: లహరి
ఉత్తమ అస్సామీ చిత్రం: జుయ్ఫిల్మ్ (ఆరెంజ్ అండ్ పర్పుల్)
ఉత్తమ మణిపురి చిత్రం: సునీత
ఉత్తమ తుళు చిత్రం: ఇంబు
ఉత్తమ గర్వాలీ చిత్రం: ధోలి
ఉత్తమ కొంకణి చిత్రం: మోగ్ ఆసుమ్
సాంకేతిక విభాగాల పురస్కారాలు:
ఉత్తమ సంగీతం (పాటలు): శశ్వాంత్ సచ్దేవ్ (ఆర్టికల్ 370)
ఉత్తమ నేపథ్య సంగీతం (బీజీఎం): జీవీ ప్రకాశ్ కుమార్ (అమరన్)
ఉత్తమ కొరియోగ్రఫీ: విజయ్ గంగూలీ (స్త్రీ 2 – ఆజ్ కీ రాత్ పాట)
ఉత్తమ యాక్షన్ (స్టంట్స్): మహారాజ (తమిళ్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: షెహనాద్ జలాల్ (భ్రమయుగం)
ఉత్తమ ఎడిటింగ్: ఆర్. కలైవానన్ (అమరన్)