ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ‘క్రేజీ కల్యాణం’
Crazy Kalyanam
నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “క్రేజీ కల్యాణం”. ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసమ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు. “క్రేజీ కల్యాణం” సినిమా టీజర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు. ఆగస్టు 1న ఈ సినిమా టీజర్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. పెళ్లి చుట్టూ సాగే ఆసక్తికరమైన కథతో ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో “క్రేజీ కల్యాణం” సినిమా చిత్రీకరణ జరిపారు. సురేష్ బొబ్బిలి “క్రేజీ కల్యాణం” సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఆగస్టు 1న రిలీజ్ కాబోతున్న టీజర్ హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మరింత క్రేజ్ పెంచబోతోంది. నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి, తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ – జె.గాయత్రి దేవి, ఆర్ట్ డైరెక్టర్ – సాయి కదిర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – అఖిల్ సాయి శ్రీమూర్తి, కొరియోగ్రాఫర్ – ఈశ్వర్ పెంటి, యాక్షన్ – డ్రాగన్ ప్రకాష్, లిరిక్స్ – గోరటి వెంకన్న, చైతన్య ప్రసాద్, కాసర్ల శ్యామ్, ఎడిటర్ – శ్రావణ్ కటికనేని, డీవోపీ – శ్యామ్ దూపాటి, మ్యూజిక్ – సురేష్ బొబ్బిలి.
- Varalakshmi Vratham 2026 Wishes Images: వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షల ఫోటోలు, HD Images, WhatsApp Status Photos మీకోసం..
- Nidhhi Agerwal ED: ఈడీ విచారణకు హాజరైన సినీ నటి నిధి అగర్వాల్…బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో 4 గంటల పాటు ప్రశ్నల వర్షం…
- Viral Video: మహబూబాబాద్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల పట్ల క్రూరంగా వ్యవహరించిన పోలీసు అధికారి…ఉద్రిక్తంగా మారిన జీవో 97 నిరసన..
- Konda Sushmita: సీఎం రేవంత్ రెడ్డిపై సుస్మిత ఘాటు వ్యాఖ్యలు.. కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్.. ఏం జరిగిందంటే..
- ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. పదో తరగతి విద్యార్థులే డబ్బుల కోసం దారుణంగా..