Skip to content
వినోదం వార్తలు

అంతా రాములోరు చూస్కుంటారు ..టైటిల్ గ్లింప్స్ రిలీజ్

Prajapaksham 07 Sep 2026 1 నిమిషాల పఠనం వినోదం
అంతా రాములోరు చూస్కుంటారు ..టైటిల్ గ్లింప్స్ రిలీజ్

antha ramuloru chusukuntaru

హీరో సంగీత్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా “అంతా రాములోరు చూస్కుంటారు”. ఈ చిత్రంలో అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీమతి శ్రావణి సమర్పణలో ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్, వి.జి.బి. ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని, న్యూ యాస్పరెంట్ ప్రొడ్యూసర్ గిరిబాబు వల్లభనేని నిర్మిస్తున్నారు. ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరీతో టాలెంటెడ్ డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ రూపొందిస్తున్నారు. లక్ష్మీ భూపాల్ రైటర్ గా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ లో “అంతా రాములోరు చూస్కుంటారు” సినిమా టైటిల్ గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ గిరిబాబు వల్లభనేని మాట్లాడుతూ – ఎంటర్ టైన్ మెంట్ తో కూడిన లవ్ స్టోరీతో మా “అంతా రాములోరు చూస్కుంటారు”ను నిర్మిస్తున్నాం. మా టైటిల్ లో ఉన్నట్లు అంతా రాములోరు చూసుకుంటారు అన్నారు.డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ , ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని
హీరోయిన్ అనస్వర రాజన్, హీరో సంగీత్ శోభన్ పాల్గొన్నారు.