Skip to content
బిజినెస్ › వార్తలు

FMCG Products: సామాన్యుడి నెత్తిన మరో పిడుగు.. భారీగా పెరగనున్న వంట నూనె, సబ్బులు, ఇతర వస్తువుల ధరలు.. కారణం ఏంటంటే..

jagan 26 Oct 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
FMCG Products: సామాన్యుడి నెత్తిన మరో పిడుగు.. భారీగా పెరగనున్న వంట నూనె, సబ్బులు, ఇతర వస్తువుల ధరలు.. కారణం ఏంటంటే..

Pay More or Get Less: FMCG Companies Prepare Another Price Hike

FMCG Products: ఇప్పటికే నిత్యావసర సరుకులైన బియ్యం, పప్పులు, ప్యాకేజ్డ్ పాలు, సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్లు , పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్య మధ్యతరగతి ప్రజలపై మరో భారం పడనుంది. నిత్యం ఉపయోగించే సబ్బులు, టూత్‌పేస్ట్‌లు, వంటనూనెలు, షాంపూలు, చాక్లెట్లు , ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తుల ధరలను పెంచేందుకు ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ (ముడి చమురు) ధరలు భారీగా పెరగడంతో పాటు, వర్షపాతం లోటు వల్ల వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి తగ్గి ముడిసరుకుల వ్యయం అమాంతం పెరగడమే ఈ ధరల పెంపునకు ప్రధాన కారణమని ఆర్థిక విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు ఏకంగా 113 డాలర్ల మార్కును తాకడంతో ఉత్పత్తి , రవాణా వ్యయాలపై దాని ప్రభావం గణనీయంగా పడిందని విశ్లేషణ సంస్థలు క్రైసిల్ (CRISIL), ఎలరా క్యాపిటల్ (Elara Capital) , కొటక్ నియో (Kotak Neo) ప్రతినిధులు వెల్లడించారు. చమురు ధరల పెరుగుదల వల్ల ప్యాకేజింగ్ మెటీరియల్స్, పామ్ ఆయిల్ , సబ్బుల తయారీకి వాడే రసాయనాల లాంటి ముడిసరుకుల ధరలు దాదాపు 74 శాతం వరకు పెరిగాయి. వీటికి తోడు దేశంలో బలహీనమైన వర్షపాతం నమోదు కావడంతో పామ్ ఆయిల్, చెరకు, పాలు , ఇతర వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా తగ్గి ధరలు పెరిగాయని, ఈ అదనపు ఉత్పత్తి భారాన్ని తగ్గించుకోవడానికి కంపెనీలు త్వరలోనే ఉత్పత్తుల ధరల పెంపును వినియోగదారులకు బదిలీ చేయనున్నాయని స్పష్టం చేశారు.

సబ్బులు, నిత్యావసరాల ధరలతో పాటు సామాన్యుల కమ్యూనికేషన్ ఖర్చులు కూడా భారీగా పెరగనున్నాయి. ప్రముఖ ఆర్థిక పరిశోధన సంస్థ అంబిత్ క్యాపిటల్ (Ambit Capital) అంచనాల ప్రకారం.. ముగింపు దశకు వస్తున్న టెలికాం రంగంలో సగటు రాబడి (ARPU) పెంపు చర్యల్లో భాగంగా టెలికాం కంపెనీలు ఈ ఏడాది డిసెంబర్ నుంచి మొబైల్ రీఛార్జ్ ప్లాన్లు, టెలిఫోన్ , డేటా బిల్లుల ధరలను గణనీయంగా పెంచనున్నట్లు తెలిపింది. విపరీతంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఇంధన ధరల వల్ల రాబోయే రోజుల్లో సగటు కుటుంబ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ట్యాగ్‌లు: business news crude oil prices FMCG