Skip to content
వినోదం › వార్తలు

‘అక్క’ ట్రైలర్‌ విడుదల

Prajapaksham 26 Oct 2026 0 నిమిషాల పఠనం వినోదం
‘అక్క’ ట్రైలర్‌ విడుదల

akka

‘అక్క’ కథలో భవాని (కీర్తి సురేష్), రుద్ర (రాధికా ఆప్టే) ప్రధాన పాత్రలు. విభిన్నమైన ఆశయాలు, నమ్మకాలు కలిగిన ఈ ఇద్దరు శక్తివంతమైన మహిళల మధ్య ఏర్పడే పోరాటమే కథకు కేంద్రబిందువు. వీరి మధ్య సంఘర్షణ అక్కడి వ్యవస్థను కుదిపేసే స్థాయికి చేరుకుంటుంది. అధికారం, విధేయత, కుటుంబం, ప్రతీకారం వంటి అంశాలను ఈ సిరీస్ లోతుగా ఆవిష్కరించనుంది. కీర్తి సురేష్, రాధికా ఆప్టేతో పాటు తన్వీ ఆజ్మీ, మహేష్ మంజ్రేకర్, అన్షుమన్ పుష్కర్, మోనికా పన్వార్ తదితరులు ఈ సిరీస్‌లో కీలక పాత్రలు పోషించారు. వై ఆర్ ఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ సిరీస్‌కు ధర్మరాజ్ శెట్టి రచన, దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ అక్టోబర్ 30న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కానుంది. పెర్నూరు అనే రాజ్యం, అక్కడి శక్తివంతమైన వంశాల చుట్టూ ఈ కథ సాగుతుంది. తరతరాలుగా మహిళలే ముందుండి నడిపిస్తూ, తమ అధికారాన్ని, ఆధిపత్యాన్ని కాపాడుకుంటున్న ఈ రాజ్యంలో పైకి కనిపించే క్రమశిక్షణ, బలమైన వ్యవస్థ వెనుక అనేక ఉద్రిక్తతలు దాగి ఉన్నాయి. ఎప్పటినుంచో కొనసాగుతున్న వారసత్వాన్ని ఒక బయటి వ్యక్తి సవాలు చేయడంతో, విధేయతలు పరీక్షకు గురవుతాయి, ప్రత్యర్థిత్వాలు మరింత తీవ్రమవుతాయి, గతంలోని గాయాలు మళ్లీ బయటపడతాయి. దీంతో ఆ రాజ్యాన్ని నిలబెట్టిన సమతుల్యత క్రమంగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది. భవాని పాత్ర గురించి కీర్తి సురేష్, రాధికా ఆప్టే నటిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ ఇండియా సిరీస్ హెడ్ తన్యా బామి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఆదిత్య చోప్రా, యోగేంద్ర మొగ్రే, అక్షయే విధాని.