Skip to content
వినోదం › వార్తలు

ఏపీ -తెలంగాణాలో ఎన్వీఆర్ ద్వారా ‘సీన్’ రిలీజ్

Prajapaksham 26 Oct 2026 1 నిమిషాల పఠనం వినోదం
ఏపీ -తెలంగాణాలో ఎన్వీఆర్ ద్వారా ‘సీన్’ రిలీజ్

Scene

హీరో సూర్య, మలయాళ బ్లాక్‌బస్టర్ ‘ఆవేశం’ ఫేమ్ దర్శకుడు జిత్తు మాధవన్‌తో కలసి యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘సీన్’ చేస్తున్నారు. నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జ్యోతిక, సూర్య జాగరం స్టూడియోస్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జయశ్రీ దామోదరన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల మేకర్స్ టైటిల్ టీజర్‌ను విడుదల చేసి సినిమాలోని క్విర్కీ, ఎంటర్‌టైనింగ్ ప్రపంచాన్ని పరిచయం చేశారు. ఫస్ట్ సింగిల్ ‘అమ్మో ఇది ఎవర్రా’ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ సింగిల్ ‘ఏరోప్లేన్’ అదిరిపోయే ఎనర్జీతో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎన్వీఆర్ సినిమా ద్వారా గ్రాండ్ రిలీజ్ కానుంది.ఈ చిత్రానికి వినీత్ అగస్టిన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సుశిన్ శ్యామ్ సంగీతం సమకూరుస్తున్నారు. అజ్మల్ సాబు ఎడిటింగ్, అశ్విని కాలే ప్రొడక్షన్ డిజైన్‌. సీన్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 6న దీపావళి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది.